శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
వన్ వీక్ వన్ లాబ్ ప్రచారం కింద సిఎస్ఐఆర్- సెంట్రల్ గ్లాస్ అండ్ సెరామిక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సిజిసిఆర్ఐ) విద్యార్ధి, శాస్త్రవేత్త అనుసంధాన కార్యక్రమం
Posted On:
26 AUG 2023 10:35AM by PIB Hyderabad
వీక్ వన్ లాబ్ (ఒడబ్ల్యుఒఎల్ - ఒక వారం ఒక ప్రయోగశాల) ప్రచారంలో భాగంగా సిఎస్ఐఆర్ - సెంట్రల్ గ్లాస్ & సెరామిక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సిజిసిఆర్ఐ) 25 ఆగస్టు 2023న స్కూల్ కనెక్ట్ ప్రోగ్రామ్ (పాఠశాలలతో అనుసంధాన కార్యక్రమం)ను నిర్వహించాయి. పాఠశాల విద్యార్ధులలో శాస్త్రీయ దృక్పధాన్ని ప్రోత్సహించి, వివిధ శాస్త్రీయ రంగాలలో పరిశోధనను చేపట్టి కొనసాగించడాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమ లక్ష్యం. సిఎస్ఐఆర్- సిజిసిఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ ఎస్.కె. మిశ్రా ఇందులో పాల్గొంటున్నవారికి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఎస్ఐఆర్- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ కె.జె. శ్రీరామ్ మాట్లాడుతూ, దేశ నిర్మాణ కార్యకలాపాలలో సిఎస్ఐఆర్ పాత్రను పట్టి చూపగా, గౌరవ అతిథిగా విచ్చేసిన సిఎస్ఐఆర్- ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ డైరెక్టర్ డాక్టర్ అరుణ్ బంద్యోపాధ్యాయ దేశ అత్యున్నత ప్రయోజనాల కోసం విద్యార్ధులు సైన్స్‌ను అభ్యసించేందుకు ప్రేరణను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 7 పాఠశాలల నుంచి 295మంది విద్యార్ధులు, 28మంది అధ్యాపకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాలలలో దమ్‌దమ్‌లోని కేంద్రీయ విద్యాలయం సెయింట్ గ్జేవియర్స్ ఇనిస్టిట్యూషన్, లక్ష్మీపట్ సింఘానియా స్కూల్, సిల్వర్ పాయింట్ స్కూల్, ముకుల్ బోస్ మెమోరియల్ స్కూల్, జాదవ్‌పూర్ హైస్కూల్, ది సమ్మిట్ స్కూల్ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ప్రాచుర్యం పొందినవారి ఉపన్యాసాలు, ప్రత్యక్ష ఇంటరాక్టివ్ సెషన్లు, సిఎస్ఐఆర్- సిజిసిఆర్ఐ భిన్న ఉత్పత్తుల ప్రదర్శనలు, శాస్త్రీయ క్విజ్‌లు, వర్చువల్ లాబ్ వేదికలు సహా వివిధ శాస్త్రీయ కార్యకలాపాలలో పాఠశాల విద్యార్ధులు పాల్గొని ఆనందించారు. వివిధ క్షేత్రాలలో పని చేస్తున్న శాస్త్రవేత్తలు సిజిసిఆర్ఐకి చెందిన వివిధ అధునాతన సాంకేతికతలను ప్రదర్శించారు.
***
(Release ID: 1952631)
Visitor Counter : 132