భారత పోటీ ప్రోత్సాహక సంఘం

పోటీవ్యతిరేక పద్ధతులకు పాల్పడటం మానుకోవాలని ఔషధ విక్రేతల సంఘాల సభ్యులు ఇకముందు అటువంటి చర్యలకు పాల్పడటాన్ని నిరోధిస్తూ ఉత్తర్వులు జారీచేసిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI)

Posted On: 25 AUG 2023 5:37PM by PIB Hyderabad

       పోటీ చట్టం, 2002 ('చట్టం') సెక్షన్ 3(3)ను సెక్షన్ 3(1)తో కలిపి చదవగా పొందుపరచిన నిబంధనలకు విరుద్ధంగా
రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ జిల్లా మరియు తహసీల్ స్థాయి కెమిస్ట్‌ల సంఘాల ('OPs') తీరు ఉన్నట్లు గుర్తించిన
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ('CCI')  23.08.2023న ఒక ఉత్తర్వు జారీ చేసింది.

        సోలార్ లైఫ్ సైన్సెస్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ (‘సోలార్’) సంస్థ దాఖలు చేసిన సమాచారం ఆధారంగా కేసు ప్రారంభించడం జరిగింది.   ఔషధవిక్రేతల సంఘాలు సోలార్ సంస్థలో తయారయ్యే  ఔషధ ఉత్పత్తులను సమిష్టిగా బహిష్కరించడం ద్వారా పోటీ వ్యతిరేక పద్ధతుల్లో మునిగిపోయాయని ఆరోపించడం జరిగింది.  తాము సూచించిన విధంగా  మార్జిన్లు మరియు ప్రోత్సాహక పథకాలను
అందించడంలో  విఫలమైన  తయారీదారులు / సరఫరాదారుల ఉత్పత్తులను బహిష్కరించాలని ఔషధవిక్రేతల సంఘాలు సమిష్టిగా
నిర్ణయించి అమలు చేయడం  OPs  వ్యవహరించే పధ్ధతి.  అదే విధంగా 'సోలార్' ఉత్పత్తులను కూడా బహిష్కరించారు

         నమోదైన సాక్ష్యాలు , ఔషధ విక్రేతల సంఘాల ప్రెసిడెంట్ల వాఙ్మూలాల ఆధారంగా OPs  తీరు సెక్షన్ 3(3)(a) మరియు సెక్షన్ 3(3)(b) లను సెక్షన్ 3(1)తో కలిపి చదివిన  నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు CCI  గుర్తించింది. చట్టంలోని సెక్షన్ 48 ప్రకారం ఈ సంఘాల అధ్యక్షులను కూడా బాధ్యులుగా CCI  గుర్తించింది.

        ఉపశమనం కలిగించే అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఎలాంటి నగదు జరిమానా విధించకూడదని CCI నిర్ణయించింది. చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా ఔషధ విక్రేతల సంఘాల సభ్యులు ఉండేలా చూడాలని వారి సంబంధిత అధ్యక్షుల ద్వారా సంఘాలను CCI ఆదేశించింది.
 
         కేసునంబరు 20/2020 కు సంబంధించిన ఉత్తర్వు  ప్రతి  CCI వెబ్‌సైట్ www.cci.gov.inలో లభ్యమవుతోంది.


 

****



(Release ID: 1952506) Visitor Counter : 95


Read this release in: English , Urdu , Hindi , Tamil