శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
సిఎస్ఐఆర్-సిజిసిఆర్ఐ కోల్‌కతాలో వన్‌వీక్ వన్ లాబ్ కార్యక్రమంలో భాగంగా ఓపెన్ డే, నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమ నిర్వహణ
Posted On:
25 AUG 2023 1:36PM by PIB Hyderabad
శాస్త్రసాంకేతిక రంగాల గురించి సామాన్య ప్రజలు, చేతివృత్తి పనివారిలో అవగాహనను సృష్టించాలన్న లక్ష్యంతో 24.08.2023న వన్ వీక్ వన్ లాబ్ (ఒడబ్ల్యుఒఎల్ - ఒక వారం ఒక ప్రయోగశాల) కార్యక్రమంలో భాగంగా సిఎస్ఐఆర్ - సెంట్రల్ గ్లాస్ & సెరామిక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సిజిసిఆర్ఐ), కోల్‌కతా కలిసి ఓపెన్ డే & నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహించాయి. కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నవారికి సిఎస్ఐఆర్- సిజిసిఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ సుమన్ కుమారి మిశ్రా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఎస్ఐఆర్- ఇనిస్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ రామానుజ నారాయణ మాట్లాడుతూ, సైన్సుకు, సమాజానికి మధ్య గల సంబంధాన్ని పట్టి చూపారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన 100 మంది పాల్గొని, టెర్రకోటాతో వస్తువులను తయారు చేయడంలో నైపుణ్యాల అభివృద్ధి / ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా సిఎస్ఐఆర్- సిజిసిఆర్ఐ ఉత్పత్తులను, సాంకేతికతలను కూడా ప్రదర్శించారు. .


****
(Release ID: 1952346)
Visitor Counter : 180