గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
సుస్థిరత్వం, వాతావరణ స్థితిస్థాపకత నిర్మిత పర్యావరణ జీవిత చక్రం అంతటా పాదుకోవాలి: శ్రీ హర్దీప్ ఎస్.పూరి
నిర్మిత పర్యావరణాన్ని డీకార్బోనేట్ చేయడం తక్షణ అవసరం: శ్రీ హర్దీప్ ఎస్. పూరి
నిర్మాణ పరిశ్రమలో నూతన , అభివృద్ధి చెందుతున్న బిల్డింగ్ మెటీరియల్స్ టెక్నాలజీల స్వీకరణపై సదస్సుకు
ప్రారంభోత్సవం
Posted On:
25 AUG 2023 4:02PM by PIB Hyderabad
నిర్మిత పర్యావరణం జీవిత చక్రం అంతటా సుస్థిరత , వాతావరణ స్థితిస్థాపకతను పొందుపరిచే కోణం నుంచి పట్టణ ప్రణాళికను చూడాల్సిన అవసరం ఉందని గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాలు, పెట్రోలియం , సహజ వాయువు శాఖల మంత్రి శ్రీ హర్దీప్ ఎస్ పూరి స్పష్టం చేశారు. నిర్మాణ రంగంలో నూతన , అభివృద్ధి చెందుతున్న బిల్డింగ్ మెటీరియల్స్ , టెక్నాలజీల స్వీకరణపై సదస్సును ప్రారంభించిన మంత్రి, మోదీ ప్రభుత్వం పట్టణీకరణను బహుముఖ వృద్ధికి ఒక అవకాశంగా చూసిందని, అందువల్ల భారతదేశ ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ అత్యంత సమగ్రమైన కార్యక్రమాలలో ఒకటిగా ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో, మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మక గృహనిర్మాణ పథకం- ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ (పిఎమ్ఎవై-యు) భారతదేశ పట్టణ పేదలకు తక్కువ వ్యయం తో సరసమైన గృహాలను అందించే సమస్యను పరిష్కరించడంతో పాటు స్థిరమైన, హరిత మౌలిక సదుపాయాలను సృష్టిస్తోందని చెప్పారు. పిఎమ్ ఎవై-యులో గ్రీన్ కన్ స్ట్రక్షన్ టెక్నాలజీల వాడకాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ, ఫ్లయ్ యాష్ బ్రిక్స్/బ్లాక్ లు , ఎఎసి బ్లాక్ లు వంటి సుస్థిర నిర్మాణ సామగ్రిని ఉపయోగించి ఈ మిషన్ కింద సుమారు 43.3 లక్షల గృహాలను నిర్మిస్తున్నట్లు శ్రీ పురి తెలియజేశారు. 2024 డిసెంబర్ చివరి నాటికి 9 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించడానికి ఈ గృహాలు దోహదం చేస్తాయి.
గృహ నిర్మాణ రంగంలో సమూల మార్పు తీసుకురావడానికి, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఒహెచ్ యుఎ) గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ ఛాలెంజ్ (జిహెచ్ టిసి) కింద ప్రపంచవ్యాప్తంగా 54 వినూత్న నిర్మాణ సాంకేతికతలను షార్ట్ లిస్ట్ చేసింది. చెన్నై, రాజ్ కోట్, ఇండోర్, లక్నో, రాంచీ, అగర్తలా నగరాల్లో ప్రస్తుతం అమలవుతున్న ఆరు లైట్ హౌస్ ప్రాజెక్టుల కింద 6,368 ఇళ్లను నిర్మిస్తున్నారు. ఈ వినూత్న నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల కలిగే బహుళ ప్రయోజనాలను మంత్రి వివరించారు. వీటిలో నిర్మాణ వ్యయం, సమయం, ఉపయోగించిన సిమెంట్ , ఉత్పత్తి అయ్యే వ్యర్థాలతో పాటు పెరిగిన థర్మల్ సౌకర్యం తక్కువ జీవిత చక్ర ఖర్చులు ఉన్నాయి.
సరికొత్త, సృజనాత్మక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సమాజంలోని అన్ని వర్గాలకు నాణ్యమైన గృహాలను అందించాల్సిన అవసరాన్ని గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ కౌశల్ కిశోర్ పునరుద్ఘాటించారు, ఎందుకంటే ఇది నూతన , స్వావలంబన భారతదేశంలో మెరుగైన జీవన నాణ్యతకు దోహదం చేస్తుంది. పెరుగుతున్న ఇళ్ల డిమాండ్ ను పరిష్కరించడానికి దేశానికి సహాయపడే ఆధునిక , హరిత నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడం ప్రాముఖ్యతను గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ మనోజ్ జోషి నొక్కి చెప్పారు.
ఈ నిర్మాణ సామగ్రి దేశంలోని విభిన్న భౌగోళిక-వాతావరణ , ప్రమాద పరిస్థితులకు అనుగుణంగా వేగవంతమైన , మెరుగైన నాణ్యత కలిగిన గృహ నిర్మాణానికి వీలు కల్పిస్తుంది. సీపీడబ్ల్యూడీ, ఎన్ బీసీసీ సహకారంతో క్రెడాయ్ నిర్వహించిన ఈ సదస్సు నిర్మాణ, రియల్ ఎస్టేట్ రంగాల్లోని ప్రతిభావంతులను ఒకే వేదిక పైకి తెచ్చింది.
***
(Release ID: 1952241)
Visitor Counter : 180