ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గుజరాత్‌ లోని కెవాడియాలో జరిగిన ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన చింతన్ శిబిర్ కు అధ్యక్షత వహించిన - కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్


ప్రభుత్వంలో అందుబాటులో ఉన్న విస్తారమైన వనరులు, అనుభవాన్ని సముచితంగా ఉపయోగించుకోవాలని ఉద్భోధించిన - శ్రీమతి సీతారామన్


అమృత్ కాల్‌ లో 2047 వికసిత్ భారత్ వైపు సాగుతున్న ప్రయత్నాలను కొనసాగించడానికి వీలుగా యువ తరానికి మార్గదర్శకత్వం వహించాలి : కేంద్ర ఆర్థిక మంత్రి


చింతన్ శిబిర్ సందర్భంగా గుజరాత్‌ లోని కెవాడియాలో జి-20 ఇండియా ఫైనాన్స్ ట్రాక్ టీమ్‌ తో కూడా సంభాషించిన - కేంద్ర ఆర్థిక మంత్రి

Posted On: 22 AUG 2023 8:10PM by PIB Hyderabad

గుజరాత్‌లోని కెవాడియాలో నిర్వహించిన ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన మూడు రోజుల చింతన్ శిబిర్ ఈ రోజు ముగిసింది.  కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ చింతన్ శిబిర్ కు అధ్యక్షత వహించారు.  ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రులు శ్రీ పంకజ్ చౌదరి, డాక్టర్ భగవత్ కిషన్ రావ్ కరద్ పాల్గొన్నారు. 

 

 

చింతన్ శిబిర్‌ లో ఆర్థిక మంత్రిత్వ శాఖ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో - ఆర్థిక శాఖ కార్యదర్శితో పాటు, ఆర్థిక వ్యవహారాల శాఖ (డి.ఈ.ఏ), పెట్టుబడి, పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ శాఖ (డి.ఐ.పి.ఏ.ఎం), రెవెన్యూ శాఖ (డి.ఓ.ఆర్), ఆర్థిక సేవల శాఖ (డి.ఎఫ్.ఎస్), కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు చెందిన కార్యదర్శులు; ముఖ్య ఆర్ధిక సలహాదారులు; సి.బి.డి.టి,, బి.ఐ.సి, అధ్యక్షులు కూడా పాల్గొన్నారు.  

 

 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఊహించిన విధంగా పంచప్రాణ్ ని స్వీకరించడం ద్వారా అమృత్ కాల్ లక్ష్యాలను ఎలా సాధించాలనే దానిపై 100 కంటే ఎక్కువ మంది ఎం.ఓ.ఎఫ్. మరియు ఎం.సి.ఏ. సీనియర్ అధికారులు పరస్పరం చర్చలు జరిపారు. 

 

 

అమృత్ కాల్ లో ఆర్థిక మంత్రిత్వ శాఖ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పాత్ర”, “మన శక్తి, సామర్ధ్యాలను పెంపొందించడం”, “మన సమర్ధతను మెరుగుపరచడం” అనే అంశాలపై పరస్పరం ఇష్టాగోష్టి చర్చలు జరిగాయి.

 

 

ప్రభుత్వంలో ఉన్న అపారమైన వనరులు, అనుభవాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీమతి సీతారామన్ అధికారులకు సూచించారు. 

 

 

అమృత్ కాల్‌ లో 2047 వికసిత్ భారత్ వైపు సాగుతున్న ప్రయత్నాలను కొనసాగించడానికి వీలుగా యువతరానికి మార్గదర్శకత్వం వహించాలనే విషయాన్ని ఆర్ధిక మంత్రి ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. 

 

 

అధికారులు తమ నిర్ణీత బాధ్యతలకు మించి సరిహద్దులను అన్వేషించాలని, ఇతర అంశాలపై కూడా అదనపు ప్రభావాన్ని చూపాలని శ్రీమతి సీతారామన్ సూచిస్తూ, తద్వారా మొత్తం మంత్రిత్వ శాఖకు ఉపయోగపడే సమిష్టి ఆలోచనలు ఉద్భవిస్తాయని పేర్కొన్నారు. 

 

 

సంస్కరణ విధానంలో ప్రభావం, సామర్థ్యం రెండూ, వ్యక్తిగత మరియు సంస్థాగత సామర్థ్యాలు రెండింటిపై దృష్టి సారిస్తూ, దీర్ఘకాలిక ప్రభావం మరియు స్థిరత్వాన్ని చూపే అంశాలని, అదేవిధంగా, ప్రజాసేవలను అందించే కీలకమైన అంశాలని, చింతన్ శిబిర్‌ లో కేంద్ర ఆర్థిక మంత్రి తన ప్రసంగాన్ని ముగిస్తూ, పేర్కొన్నారు.

 

 

ప్రభావం, సామర్థ్యానికి మించి ప్రతికూల ఉత్పాదకత కారణంగా, పరిమితికి మించి సమాచారం రావడం అనే విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రస్తావిస్తూ, ఎం.ఓ.ఎఫ్. మరియు ఎం.సి.ఏ. రెండూ ప్రభుత్వ విధానంపైనే కాకుండా, బట్వాడా, ఒప్పందాలను పెంపొందించడానికి దేశవ్యాప్తంగా అనే విధానం పై దృష్టి సారించి, ప్రక్రియలను సరళతరం చేయడానికి ప్రయత్నించాలని, కేంద్ర ఆర్థిక మంత్రి ఉద్ఘాటించారు.

 

 

అమృత్ కాల్ లో ఫలితాలను అందించడంలో, 2047 నాటికి వికసిత్ భారత్ ను రూపొందించడంలో అంతకు మించిన శక్తిని అభివృద్ధి చేయడానికి కొత్తగా ప్రవేశించినవారు, యువ సహోద్యోగులకు నిరంతరం మార్గదర్శకత్వం వహించాలని సీతారామన్ ఎం.ఓ.ఎఫ్. మరియు ఎం.సి.ఏ. సీనియర్ అధికారులను కోరారు.  సాంస్కృతిక నేపధ్యంలో విధానాన్ని నిరంతరంగా మార్చడం మరియు నిర్ణయాధికారంలో యాజమాన్యం యొక్క భావాన్ని పెంపొందించడం, సమర్థతతో ప్రభావాన్ని పెంచడం వంటి వాటిపై కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నొక్కిచెప్పారు.

 

 

ఈ సదస్సులో చర్చల సందర్భంగా, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి మాట్లాడుతూ, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ప్రయాణంలో ఉత్పాదక లక్ష్యాలను సాధించడానికి ప్రతిష్టాత్మక లక్ష్య-ధోరణి అవసరమని పిలుపునిచ్చారు.

 

 

కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిసన్‌రావ్ కరద్, ఈ సందర్భంగా మాట్లాడుతూ, జ్ఞానం, నైపుణ్యం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని ఉద్ఘాటించారు.  సేవలు అందించడానికి సరిగ్గా ఎంత సమయం పడుతుంది అంచనా వేయడం కోసం తగిన ప్రతిస్పంద యంత్రాంగాన్ని పెంపొందించుకోవడంతో పాటు, తగిన పరిజ్ఞానం ఉన్న భాగస్వాములు, వాటాదారులతో సంప్రదించి సరైన నిర్ణయాలు తీసుకోవాలని డాక్టర్ కరాడ్ సూచించారు. 

 

 

“అమృత్ కాల్‌ లో ఆర్థిక మంత్రిత్వ శాఖ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖల పాత్ర” పై నిర్వహించిన సదస్సు వృద్ధి, స్థిరత్వాన్ని పెంపొందించడం తో పాటు, ఈ క్రింద పేర్కొన్న నాలుగు అంశాలపై దృష్టి కేంద్రీకరించింది: 

     i)     మూలధన నిర్మాణం మరియు నిలిపి ఉంచడం; 

     ii)     సమ్మిళిత వృద్ధి; 

    iii)     ఆత్మనిర్భర్ భారత్; 

    iv)     ప్రభుత్వ నిధులను బలోపేతం చేయడం.

 

 

“మన సామర్థ్యాలను పెంపొందించడం” అనే అంశంపై జరిగిన సదస్సులో - 

     i)     వృత్తిపరమైన సామర్థ్యాన్ని పెంపొందించడం;

     ii)     వ్యక్తిగత సామర్థ్యాన్ని నిర్మించుకోవడం; 

    iii)     వృత్తి-జీవితం మధ్య సమతులన సామర్థ్యం; 

    iv)     సంస్థాగత సామర్థ్యం

వంటి అంశాలపై సవివరంగా చర్చలు జరిగాయి.

 

 

ఈ సదస్సులో జరిగిన చర్చలు - మానవ వనరులు, సంస్థల వంటి రంగాల్లో సామర్థ్యాన్ని పెంపొందించడం; సాంకేతికత, సాఫ్ట్‌వేర్ తో కూడిన వ్యవస్థల పాత్ర; అంతర్గత మరియు అంతర్ మంత్రిత్వ శాఖల సంప్రదింపులు; వివిధ స్థాయిల్లో శిక్షణ ప్రాముఖ్యత, 2047 నాటికి బలమైన, దృఢమైన భారతదేశం వికసిత్ భారత్‌ ను నిర్మించే దిశగా ప్రయాణంలో అమృత్ కాల్‌ లో ప్రముఖ పాత్ర పోషించే విధంగా యువతకు మార్గ దర్శకత్వం వహించడం వంటి వివిధ అంశాలపై దృష్టి సారించాయి. 

 

 

“బిల్డింగ్ అవర్ ఎఫిషియెన్సీ” అనే విషయం పై జరిగిన సదస్సులో - 

     i)     నైపుణ్యం మరియు ప్రేరేపిత శ్రామిక శక్తిని ప్రారంభించడం;

     ii)     బలమైన అంతర్గత ప్రక్రియలు; 

    iii)     అంతర్గత వాటాదారులతో సమన్వయం మరియు ఒప్పందం;

    iv)     బాహ్య వాటాదారులపై దృష్టి పెట్టడం; 

     v)     సంస్థాగత సంస్కృతిని మార్చడం

వంటి అంశాలపై లోతైన చర్చలు జరిగాయి.

 

 

నైపుణ్యం; బలమైన సంస్థాగత ప్రక్రియలను నిర్వహించడం; ఫైల్ మేనేజ్‌మెంట్ విధానాలను క్రమబద్ధీకరించడం; ఎం.ఓ.ఎఫ్., ఎం.సి.ఏ. లలో నిర్ణయం తీసుకోవడాన్ని వేగవంతం చేయడం; ప్రారంభం నుంచీ వాటాదారులను భాగస్వాములను చేయడం;  పౌర-స్నేహపూర్వక సాంకేతిక సాధనాలు; సాంకేతికతను పూర్తిగా ఉపయోగించుకోవడం;  భవిష్యత్తు సంసిద్ధత కోసం కృత్రిమ మేధస్సు వినియోగించడం; ప్రజా సేవలు అందించడంలో పూర్తి-ప్రభుత్వం మరియు సమగ్ర విధానం; ఒకే పని రెండు సార్లు చేయకుండా చూడడంతో పాటు ప్రజలకు నిర్ణీత కాలపరిమితిలో సేవలు అందించడం అనే అంశాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చలు జరిగాయి. 

 

 

చింతన్ శిబిర్ సందర్భంగా, జి-20 ఫైనాన్స్ ట్రాక్ ఇండియా బృందంతో కూడా కేంద్ర ఆర్థిక మంత్రి సంభాషించారు.  జి-20 సదస్సుకు భారత్ అధ్యక్షత వహించిన మొదటి 9 నెలల్లో ప్రస్తావనకు వచ్చిన వివిధ అంశాలపై జి-20 ఫైనాన్స్ ట్రాక్ బృందం తమ ఆలోచనలను శ్రీమతి సీతారామన్ తో పంచుకుంది. 

 

 

*****


(Release ID: 1951982) Visitor Counter : 115