యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పతకం సాధించిన కాంపౌండ్, రికర్వ్ ఆర్చర్లను సత్కరించిన - కేంద్ర క్రీడా శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్

Posted On: 22 AUG 2023 8:35PM by PIB Hyderabad

బెర్లిన్ లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌ పోటీలతో పాటు, పారిస్‌ ప్రపంచ కప్ 2023 స్టేజ్-4 లో దేశానికి  పతకాలు సాధించి, కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టిన రికర్వ్ మరియు కాంపౌండ్ ఆర్చర్లను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ మంగళవారం సత్కరించారు.  ఈ ఏడాది ఆగస్టులో ఈ అంతర్జాతీయ [పోటీలు జరిగాయి.

భారతదేశం పారిస్‌ లో మొత్తం 5 పతకాలు (2 స్వర్ణం, 3 కాంస్యం) కైవసం చేసుకోగా, బెర్లిన్ పోటీల్లో మొత్తం 4 పతకాలు (3 స్వర్ణం, 1 కాంస్యం) కైవసం చేసుకుంది. 

మంగళవారం జరిగిన సన్మాన కార్యక్రమంలో చరిత్ర సృష్టించిన అదితి గోపీచంద్ స్వామి, ఓజాస్ ప్రవీణ్ డియోటాలే తో సహా మొత్తం 13 మంది ఆర్చర్లు పాల్గొన్నారు.  ఖేలో ఇండియా అథ్లెట్ అయిన అదితి అతి పిన్న వయస్కురాలైన ఆర్చరీ వరల్డ్ ఛాంపియన్‌ గా మాత్రమే కాకుండా ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో స్వర్ణం గెలిచిన మొదటి భారతీయ మహిళగా కూడా పేరుగాంచింది.  అదేవిధంగా, ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో స్వర్ణం సాధించిన తొలి భారతీయ పురుష ఆర్చర్‌ గా ఓజాస్ ప్రవీణ్ డియోటాలే నిలిచాడు.

ప్రతిభావంతులైన ఆర్చర్లను ఉద్దేశించి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ,  “మీ పనితీరుకు నేను మీ అందరినీ అభినందిస్తున్నాను.  పరిశోధనా బృందం మీ పనితీరును విశ్లేషించింది.  మీ మంచి ఫలితాల పరంపర కొనసాగుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను." అని పేర్కొన్నారు. 

శిబిరంలో ఆర్చర్లు పరస్పరం పంచుకున్న అందమైన సంతోషం గురించి శ్రీ ఠాకూర్ ప్రస్తావిస్తూ, “జూనియర్ల మానసిక దృఢత్వం, సంసిద్ధతను రూపొందించడంలో కోచ్‌ లతో పాటు, సీనియర్లు కూడా సహాయం చేశారని తెలుసుకుని నేను చాలా గర్విస్తున్నాను.   అభిషేక్ వర్మ వంటి అనుభవజ్ఞులైన సీనియర్, పోటీ సమయంలో ఓజాస్ ప్రవీణ్ వంటి యువకునికి ప్రేరణ, స్ఫూర్తినిచ్చి, మార్గదర్శకత్వం వహించిన తీరు అభినందనీయం." అని పేర్కొన్నారు. 

“ఆసియన్ గేమ్స్, ఒలింపిక్ క్వాలిఫయర్ ఈవెంట్స్ తో పాటు చివరకు పారిస్ ఒలింపిక్స్‌ కు దారితీసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ పోటీలన్నీ చాలా ముఖ్యమైనవి.  ఒక పతకం మనందరి భారతీయుల భావాలను కలిగి ఉంటుంది.  ఒక సాధారణ పతకం అనేక విజయాలకు అవకాశాలను తెరుస్తుంది,” అని కూడా గౌరవనీయ మంత్రి పేర్కొన్నారు.

 

 

మంగళవారం జరిగిన ఈవెంట్‌ లో భాగమైన ఇతర ఆర్చర్‌ లలో టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ అథ్లెట్లు ధీరజ్ బొమ్మదేవర, భజన్ కౌర్, సిమ్రంజీత్ కౌర్, అంకిత భకత్ ఉన్నారు.

 

 

*****


(Release ID: 1951598) Visitor Counter : 135