పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్వమిత్వ భూ రికార్డులకు బ్యాంకింగ్ కార్యకలాపాలలో ఆర్ధికత కల్పించడంపై రౌండ్ టేబుల్ చర్చ.

Posted On: 21 AUG 2023 9:06PM by PIB Hyderabad

 

స్వమిత్వ ఆస్తి కార్డులకు ,బ్యాంకు లావాదేవీలలో ఆర్థికత కల్పించే అంశంపై ఉత్తరప్రదేశ్లోని లక్నోలో గల బ్యాంకర్స్ ఇన్స్టిట్యూట్
ఆఫ్ రూరల్ డవలప్ మెంట్ (బిఐఆర్డి) లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు,
గ్రామీణ  ఆబాదీ ప్రాంతాలలోని ప్రజలకు ఆర్థిక స్థిరత్వం కల్పించే లక్ష్యాన్ని నెరవేర్చే ఉద్దేశంతో, వారి ఆస్తిని రుణాలు, ఇతర ఆర్ధిక ప్రయోజనాలు పొందేందుకు
వాడే విషయంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో , ఈ అంశానికి సంబంధించిన విషయనిపుణులు,
రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీలు (ఎస్.ఎల్.బి.సి), వివిధ రాష్ట్ర విభాగాల అధికారుల, రిజిస్ట్రేషన్ విభాగం అధికారులు,
బ్యాంకుల అధికారులు, డిపార్టమెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్.బి.ఐ) అధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశానికి కేంద్ర పంచాయతి రాజ్ మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ అలోక్ ప్రేమ్ నగర్ అధ్యక్షత వహించారు.
బిఐఆర్డి డైరక్టర్ నిరుపమ మెహ్రోత్రా, డిజి, యాషదా, శ్రీ ఎస్.చొక్కలింగం లు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సదస్సు సందర్భంగా , ఒక ప్యానల్ చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఆస్తి కార్డులను హక్కు పత్రాలుగా పరిగణించడం,
ప్రాపర్టీ కార్డుల బదిలీ అవకాశం, ఆబాదీ భూమి కి విలువ కట్టడం, బ్యాంకు ఆర్ధిక లావాదేవీలకు ఆస్తి కార్డులను పూచీగా పెట్టుకోవడం,
రిజిస్ట్రేషన్ అవసరం తదితరాల గురించి ఇందులో చర్చించారు. రాష్ట్రాలలో ప్రాపర్టీ కార్డులకు రిజిస్ట్రేషన్ అవకాశం,
రాష్ట్రాలలో ఆబాది భూమికి ఎంకంబరెన్సు ను న మోదు ప్రక్రియ, ఆబాదీ ప్రాంతాల విషయంలో సర్ఫేసి చట్టం, ఇతర అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి.ఈ చర్చా కార్యక్రమాన్ని బ్యాంకర్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డవలప్మెంట్ (బిఐఆర్డి) ఏర్పాటు చేసింది. ఈ చర్చలో ప్యానలిస్టులుగా ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్, ఇతర ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులైన ప్రథమ్ యుపి గ్రామీణ బ్యాంక్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు,
బరోడా యుపి గ్రామీణ బ్యాంకు, ఎస్.ఎల్.బి.సిల సభ్యులు, ఉత్తర ప్రదేశ్ రిజిస్ట్రేషన్ విభాగం అధికారులు పాల్గొన్నారు. అలాగే కర్ణాటక  సర్వే విభాగం కమిషనర్ శ్రీ మంజునాథన్,  కర్ణాటక రెవిన్యూ కమిషనర్ శ్రీ పి.ఎస్.కుమార్
శ్రీ ఎం.ఎ. పాండ్య, కమిషనర్, ఎస్ఎస్ ఎల్.ఆర్ ,గుజరాత్ ,  మధ్యప్రదేశ్ భూ రికార్డుల జాయింట్ కమిషనర్ , శ్రీ అఖిలేష్ జైన్,  ఉత్తరాఖండ్ రెవిన్యూ కమిషనర్ శ్రీ చంద్రేశ్ కుమార్,
హర్యానా  , మహారాష్ట్ర, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల అధికారులు  పాల్గొన్నారు.

 

***


(Release ID: 1951117) Visitor Counter : 130


Read this release in: English , Urdu , Hindi , Punjabi