రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

సైనికుల సతీమణుల సంక్షేమ సంఘం ఏర్పాటుచేసిన అస్మిత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము.

Posted On: 21 AUG 2023 4:51PM by PIB Hyderabad

సైనికుల సతీమణుల సంక్షేమ సంఘం (ఎ.డబ్ల్యు.డబ్ల్యు.ఎ) అస్మిత `సైనికుల సతీమణుల ప్రేరణాత్మక కథనాలకు సంబంధించిన కార్యక్రమాన్ని న్యూఢల్లీిలోని , మనేక్‌షా కేంద్రంలో ఏర్పాటు చేసింది. ఎన్నో సవాళ్లను అధిగమించి, వివిధ రంగాలలో తమకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న సైనికుల సతీమణుల ప్రేరణాత్మక కథనాలను
ఇతరులతో పంచుకునేందుకు ఈ కార్యక్రమాన్ని ఈ ఫోరం ఏర్పాటుచేసింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము విచ్చేశారు.  ఉపరాష్ట్రపతి సతీమణి శ్రీమతి డాక్టర్‌ సుధేష్‌ ధన్‌ కర్‌, విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక  శాఖ సమాయమంత్రి శ్రీమతి మీనాక్షి లేఖి, గౌరవ అతిథులుగా హాజరయ్యారు. ఎ.డబ్ల్యు.డబ్ల్యు.ఎ అధ్యక్షురాలు శ్రీమతి అర్చనా పాండే ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చారు.

ఎ.డబ్ల్యు డబ్ల్యుఎ సంస్థ, సైనికుల జీవిత భాగస్వాములు, వారి పిల్లలు, వారిపై ఆధారపడిన వారి సంక్షేమానికి పాటుపడుతుంది. భారత సైన్య తన శక్తిని చూపడం వెనుక ఇదొక అదృశ్య హస్తంగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ సంస్థను రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీల కింద ఢిల్లీ పాలనా యంత్రాంగం వద్ద 1966  ఆగస్టు 23న సంక్షేమ  సొసైటీగా రిజిస్టర్ చేయించారు. ఇది ఏర్పడినప్పటి నుంచి, ఎ.డబ్ల్యు.డబ్ల్యు.ఎ తన కార్యకలాపాలను పెద్ద ఎత్తున విస్తరించింది. ఇవాళ ఇది దేశంలోని పెద్ద ఎన్.జి.ఒలలో ఒకటిగా ఉంది. 

అస్మిత , అసమాన ధైర్యసాహసాలుగల సైనిక సతీమణులు సాధిస్తున్న విజయాలకు వేదికగా  నిలుస్తోంది. వారు సాధిస్తున్న విజయాల వెనుక, వారు ఎన్నో సవాళ్లను ఎదుర్కొని  ఈస్థాయికి చేరుకోవడం కనిపిస్తుంది. ఇది ఇతరులకు ఎంతో ప్రేరణదాయకం. నిరంతరం పోరాటంలో  జీవితాలు సాగించే అసమాన మహిళలకు ఇదోక గుర్తింపు. 

అస్మిత తొలి సీజన్ ను 2022 ఆగస్టు 14న ఏర్పాటు చేశారు. ఇందులో అప్పుడు ప్రసంగించిన వారిలో వివిధ రంగాలకు చెందిన ఎ.డబ్ల్యు.డబ్ల్యుఎ కి చెందిన వారు ఉన్నారు. ఇందులో వీరనారీమణులు, సైనికుల సతీమణులు, ఆర్టిస్టులు, డాక్టర్లు, రచయిత్రులు, కాన్సర్ను జయించిన వారు,ప్రముఖులు ఉన్నారు.  ఆ తర్వాత స్మిత పురబా పేరుతో 2023 ఫిబ్రవరి 11న కోల్ కతాలో నిర్వహించడం జరిగింది. ఈ ఈవెంట్లు గొప్ప విజయం సాధించాయి. ఇవి  ఎంతో మంది సైనికుల భార్యలకు వారు తమ లక్ష్యాన్ని సాధించడానికి ప్రేరణగా నిలిచాయి. దీనితో ఎడబ్లుయ డబ్ల్యుఎ ఆస్మితా సీజన్ 2ను ఏర్పాటు చేసింది.

ప్రస్తుత సీజన్ అస్మిత లో ప్రసంగించిన వారిలో శ్రీమతి జయప్రభ మహతో (సైన్స్ టీచర్, జార్ఖండ్), డాక్టర్ సంజనా నాయర్ ( రచయిత , సామాజిక కార్యకర్త,,)శ్రీమతి  వందనా మహాజన్ ( కాన్సర్ కేర్, పాలియేటివ్ కేర్ కౌన్సిలర్), శ్రీ అమ్ బ్రీన్ జైదీ ( రచయిత , కాలమిస్ట్), కాప్టెన్ యాషిక హెచ్. త్యాగి ( రిటైర్డ్),

కార్గిల్ యుద్ధ ప్రముఖులు, పరివర్తనాత్మక ప్రసంగకర్త, నాయత్వ శిక్షకులు, శ్రీమతి ఫ్లారెన్స్ హనమ్టే ( టాటూ, మేకప్ ఆర్టిస్ట్), సర్గమ్ శుక్లా (నేషనల్ రోవింగ్ మెడలిస్ట్), శ్రీమతి ఆష్నా కుషవాహా ( ఎంటర్ ప్రెన్యుయర్, కంటెంట్ రూపకర్త), లెఫ్టినెంట్ జ్యోతి ( వీర నారి– ప్రస్తుతం పనిచేస్తున్న అధికారి) వంటి వారు ఉన్నారు.

దీనికితోడు ఇద్దరు అతిథి ఉపన్యాసకులు కూడా ఉన్నారు.  వారు శ్రీమతి అరుణిమ సిన్హ, పర్వతారోహకులు, క్లాసికల్ డాన్సర్ శ్రీమతి ఆనంద శంకకర్ జయంత్.  ఈ ఈవెంట్ లో మరో ముఖ్యమైన అంశం ఏమంటే,  ఎంటర్ ప్రెన్యుయర్ ఎగ్జిబిషన్. ఇందులో అత్యద్భుత ఎంటర్ ప్రెన్యూరియల్ నైపుణ్యాలను సైనికుల సతీమణులు ప్రదర్శించారు. అస్మిత– సైనికుల సతీమణుల ప్రేరణాత్మక కథనాల పేరుతో సాగిన ప్రసంగాలు , ఈ కార్యక్రమానికి హాజరైన వారికి తమ లక్ష్యాలు సాధించేందుకు తగిన ప్రేరణనిచ్చాయి.

సైనికుల జీవిత భాగస్వాములుగా వారు తమ జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంటారు. జీవిత భాగస్వామి కి ఎంతో కాలం దూరంగా ఉండాల్సి రావడం, పిల్లల పెంపకం బాధ్యతలు, తరచూ బదిలీలు, ఇంటి పనులు, సామాజిక బాధ్యతలు ఇలా ఎన్నో. ఇన్ని ఉన్నప్పటికీ,ఈ కార్యక్రమంలో ప్రసంగించిన వారు , సవాళ్లను ఎదుర్కొని  సమాజానికి తామేమిటో నిరూపించుకున్నారు. ఇందుకు అస్మిత ఒక ఆదర్శవంతమైన వేదికగా నిలిచింది. ఆ రకంగా విజయాలు సాధించిన మహిళలను గుర్తించి వారి విజయగాధలను వెలికితీసి , తగిన విధంగా వారిని గౌరవించుకుంటూ, సంస్థకు, సమాజానికి వారు చేస్తున్నకృషిని  అస్మిత సమాజానికి  తెలియజేస్తోంది. ఇది ఇతరులకు మార్గదర్శకంగా ఉంటోంది.

 

***


(Release ID: 1951114) Visitor Counter : 146