గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

విద్యా పర్యటనలో భాగంగా రేపు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ను కలవనున్న 6 రాష్ట్రాలకు చెందిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు విద్యార్థులతో సంభాషించనున్న కేంద్ర మంత్రి శ్రీ అర్జున్ ముండా


2023 ఆగస్టు 23 న పార్లమెంట్ హౌస్‌ని సందర్శించనున్న విద్యార్థులు

Posted On: 21 AUG 2023 5:41PM by PIB Hyderabad

విద్యా పర్యటనలో భాగంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (EMRS) విద్యార్థులు 2023 ఆగస్టు 22న  రాష్ట్రపతి భవన్‌ను సందర్శించి రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ను కలవనున్నారు. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఎన్ఈఎస్టీఎస్  విద్యా పర్యటన నిర్వహిస్తున్నాయి. 

రాష్ట్రపతిని కలిసిన తర్వాత విద్యార్థులు కేంద్ర  గిరిజన వ్యవహారాల శాఖ  మంత్రి  శ్రీ అర్జున్ ముండా, గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు  శ్రీ బిశ్వేశ్వర్ తుడు, శ్రీమతి. రేణుకా సింగ్.లను  కలుస్తారు.   రాజస్థాన్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిషా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన  దాదాపు 500 మంది ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు విద్యా పర్యటనలో ఉన్నారు. 2023 ఆగస్టు  22న విద్యార్థులు  న్యూఢిల్లీ లో ఉన్న డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ను  సందర్శిస్తారు.

విద్య, వృత్తి  స్కాలర్‌షిప్ పథకాలకు సంబంధించిన వివిధ అంశాలపై  ఆలోచనలు, అభిప్రాయాలు,   అనుభవాలను పంచుకోవడానికి విద్యార్థులకు అవకాశం కల్పించాలన్న లక్ష్యంతో  కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 
2023 ఆగస్టు  23 ఉదయం పార్లమెంట్ హౌస్ ను సందర్శిస్తారు. విద్యార్థులకు పార్లమెంట్ పనితీరు, పార్లమెంట్ నిర్వహణ, బాధ్యతలు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుంది. 

 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ విధార్యాదుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న పర్యటన వివిధ అంశాలపై వారికి అవగాహన కల్పిస్తుంది. దీనివల్ల విద్యార్థులు వ్యక్తిగతంగా, సామాజికంగా రాణించడానికి అవకాశం కలుగుతుంది. పర్యటన వారి జీవితాల్లో మరపురాని సంఘటన గా నిలుస్తుంది.  

 

***



(Release ID: 1950941) Visitor Counter : 123