శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
సెంట్రల్ మెకానికల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిఎంఈఆర్‌ఐ) దుర్గాపూర్ అభివృద్ధి చేసిన మొదటి స్వదేశీ ఇ-ట్రాక్టర్ సిఎస్‌ఐఆర్ ప్రైమా ఈటీ11ను ఆవిష్కరించిన డాక్టర్ జితేంద్ర సింగ్; వ్యవసాయంలో కొత్త మరియు ఏఐ ఆధారిత సాంకేతికతలను స్వీకరించాలని పిలుపు.
సముచిత సాంకేతికతలపై దృష్టి సారిస్తూ వ్యవసాయ రంగంలోకి కొత్త స్టార్టప్‌ల సంఖ్య పెరుగుతోందని తెలిపిన డాక్టర్ జితేంద్ర సింగ్.
సిఎస్‌ఐఆర్ ఆర్&డి విజయం కోసం 5 ఎస్‌ల మంత్రం షోకేసింగ్,స్టెక్‌హోల్డర్స్, స్టార్టప్‌లు, సినర్‌జైజింగ్ మరియు స్ట్రాటజైజింగ్ ఇండస్ట్రీ లింకేజీ అనే మంత్రి అందించిన డాక్టర్ జితేంద్ర సింగ్
"ప్రధానమంత్రి మోదీలో మనకు చాలా అనుకూలమైన వాతావరణం మరియు ఎనేబుల్ నాయకత్వం ఉంది, ఇది చాలా అవసరమైనది"
Posted On:
21 AUG 2023 5:13PM by PIB Hyderabad
సెంట్రల్ మెకానికల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిఎంఈఆర్‌ఐ) దుర్గాపూర్ అభివృద్ధి చేసిన మొదటి స్వదేశీ ఇ-ట్రాక్టర్ సిఎస్‌ఐఆర్ ప్రైమా ఈటీ11ను కేంద్ర సైన్స్ & టెక్నాలజీ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) ; ఎంఓఎస్, పిఎంఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ మరియు స్పేస్ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో అగ్రి స్టార్టప్‌ల పాత్రను నొక్కిచెప్పారు మరియు వ్యవసాయంలో కొత్త మరియు ఏఐ ఆధారిత సాంకేతికతలను స్వీకరించాలని పిలుపునిచ్చారు.
ఈ-ట్రాక్టర్, చెత్తను రీసైక్లింగ్ చేయడం, డ్రిప్ ఇరిగేషన్, మామిడి, కమలం వంటి జీనోమ్ సీక్వెన్స్ ఫార్మింగ్ వంటి సముచిత సాంకేతికతలపై దృష్టి సారిస్తూ వ్యవసాయ రంగంలోకి కొత్త స్టార్టప్‌లు పెరుగుతున్నాయని మంత్రి తెలిపారు.
"ఇది భారతదేశం అవసరమైన వేగాన్ని తీసుకోని ఒక రంగం" అని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు "ఇది భారతదేశానికి మాత్రమే ప్రత్యేకమైన భారీ అన్వేషించని వనరు. ఐటీని ప్రోత్సహిస్తున్న దేశాలు తమ ఆస్తులను కలిగి ఉన్నందున వారి దృక్కోణంలో ప్రచారం చేస్తున్నాయి; మన వద్ద ఉన్న వ్యవసాయ ఆస్తి వారికి లేదు. కాబట్టి మనం వాటిని అందుకోవాల్సిన అవసరం లేదు. మన దగ్గర పుష్కలంగా వ్యవసాయ వనరులు ఉంటే దానిని ఎందుకు ఉపయోగించుకోకూడదు? కాబట్టి రాబోయే 25 సంవత్సరాలలో భారతదేశ భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థలో ఈ మార్గం చాలా ముఖ్యమైన భాగం అవుతుంది" అని చెప్పారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రభుత్వం నిర్వహించే శాస్త్రీయ ప్రయోగశాలలలో నిర్వహించిన ఆర్&డి విజయవంతానికి 5 ఎస్'లు - షోకేసింగ్, స్టేక్‌హోల్డర్స్, స్టార్టప్‌లు, సినర్‌జైజింగ్ మరియు స్ట్రాటజైజింగ్ ఇండస్ట్రీ లింకేజ్ అనే మంత్రాన్ని అందించారు.
"మనం ఈ ఐదు భాగాలను నిమగ్నం చేయగలిగితే తప్ప అవసరమైన ఫలితాలను సాధించలేము," అని చెప్పారు.
సమగ్ర విధానం కోసం పిలుపునిస్తూ, సంబంధిత మంత్రిత్వ శాఖలు మరియు సిఎస్‌ఐఆర్ ల్యాబ్‌లు మరియు పరిశ్రమల మధ్య విస్తృత అనుసంధానాలతో సహా అందరు వాటాదారులతో సన్నిహిత పరస్పర చర్యను డాక్టర్ జితేంద్ర సింగ్ సూచించారు. పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలని ఎస్ అండ్ టీ మంత్రి ప్రతిపాదించారు.
"మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవాలంటే, మీరు మొదటి రోజు నుండి పరిశ్రమ ప్రమేయాన్ని కలిగి ఉండాలి" అని తెలిపారు. "మనకు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్న పరిశ్రమ ఉంది, కానీ ఎక్కడ మరియు ఎలా పెట్టుబడి పెట్టాలో వారికి తెలియదు" అన్నారాయన.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం వ్యవసాయ రంగంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను ప్రారంభించడం ద్వారా గత తొమ్మిదేళ్లలో కొత్త జీవనోపాధిని సృష్టించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
"మనకు చాలా అనుకూలమైన వాతావరణం మరియు ఎనేబుల్ నాయకత్వం ఉంది, ఇది చాలా అవసరమైనది" అని ఆయన అన్నారు, "ప్రధానమంత్రి మోదీ మన పూర్తి సామర్థ్యాన్ని మరియు ప్రతిభను ప్రదర్శించడానికి మాకు స్వేచ్ఛను ఇవ్వడమే కాకుండా, ఆయన గౌరవాన్ని కూడా పెంచారు." అని తెలిపారు.
భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించాలని లక్ష్యంగా పెట్టుకున్నందున అమృత్‌కాల్‌లో వ్యవసాయ రంగం నిర్వచించే పాత్రను కలిగి ఉంటుందని ప్రధాని మోదీ నొక్కిచెప్పారని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
"రాబోయే 25 సంవత్సరాలలో ప్రభుత్వ ఉద్యోగాల వెలుపల జీవనోపాధి అవకాశాలకు ప్రాధాన్యత ఉంది. ఈ వ్యవసాయ రంగం ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగం కాబోతుంది, ఇది యువతకు వృత్తిలో కూడా ముఖ్యమైన భాగం కానుంది" అని ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా సిఎస్‌ఐఆర్-సిఐఎమ్‌ఏపి పుస్తకాన్ని అలాగే సిఎస్‌ఐఆర్ అభివృద్ధి చేసిన 75 టెక్నాలజీల సంకలనాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ విడుదల చేశారు. సిఎంఈఆర్‌ఐ అభివృద్ధి చేసిన రీసైక్లింగ్ వాహనాలు మరియు ఉత్పత్తులపై మంత్రి ఆసక్తి కనబరిచారు.
సిఎస్‌ఐఆర్-సిఎంఈఆర్ఐ 11-15 సెప్టెంబర్ 2023 వరకు థీమ్ ఆధారిత ప్రచారాన్ని "వన్ వీక్ వన్ ల్యాబ్" జరుపుకుంటుంది. ఇది ప్రయోగశాలకు చెందిన అత్యాధునిక పరిశోధన, ఉత్పత్తులు మరియు సాంకేతికతలు, నైపుణ్యం మరియు సౌకర్యాలను వివిధ వాటాదారులకు ప్రదర్శిస్తుంది.
<><><><>
(Release ID: 1950937)
Visitor Counter : 179