మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

భారతదేశంలో పశు సంవర్ధక ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి పాండమిక్ ఫండ్ కింద పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖకు 25 మిలియన్ అమెరికన్ డాలర్ల గ్రాంట్ మంజూరు


యాహర్నిఅట్మహాల్ హెల్త్ సిస్టమ్ ఆఫ్ ఇండియాను బలోపేతం చేయడానికి పాండమిక్ ఫండ్ కింద పశుసంవర్ధక & పాడిపరిశ్రమ శాఖ 25 మిలియన్ USD గ్రాంట్‌ను అందుకుంటుంది

వ్యాధి నివారణ, సంసిద్ధత, ప్రతిస్పందన కోసం అదనపు వనరుల సమీకరణ, పెట్టుబడుల ప్రోత్సాహానికి ఉపకరించనున్న గ్రాంట్

జంతువులనుంచి మానవులకు వ్యాపించే వ్యాధుల నివారణ పై ప్రత్యేక దృష్టి సారించనున్న ప్రాజెక్టు

Posted On: 21 AUG 2023 1:36PM by PIB Hyderabad

ప్రజలు, ఆర్థిక వ్యవస్థ సామాజిక వ్యవస్థపై  తీవ్ర ప్రభావం చూపించిన కోవిడ్-19 పటిష్ట ఆరోగ్య వ్యవస్థ అవసరాన్ని గుర్తు చేసింది. పటిష్ట ఆరోగ్య వ్యవస్థతో పాటు కోవిడ్ లాంటి  మహమ్మారి నివారణ, సంసిద్ధత, ప్రతిస్పందన కోసం అదనపు వనరులను సమీకరించడానికి, తక్షణం సమన్వయ చర్యలు అమలు చేసేందుకు పటిష్ట వ్యవస్థ అవసరం అన్న వాస్తవాన్ని కూడా కోవిడ్-19 ప్రపంచ  చేసింది.  గత కొన్ని దశాబ్దాల కాలంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరు  సార్లు ఆరోగ్య అత్యవసర పరిస్థితిని అంతర్జాతీయ స్థాయిలో ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో 5  జంతువుల మూలంగా సంక్రమించిన వ్యాధులు ఉన్నాయి.   ఏదైనా మహమ్మారిని ఎదుర్కోవడానికి అమలు చేసే  సంసిద్ధత,  ప్రతిస్పందన వ్యవస్థలో  జంతు ఆరోగ్య భద్రతపై దృష్టి సారించే ఒక ఆరోగ్య విధానం అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. 

అత్యవసర ఆరోగ్య పరిస్థితిని ఎదుర్కోవడానికి పశువుల ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేయడానికి భారతదేశం రూపొందించిన పధకానికి జీ-20 ఆమోదం తెలిపింది.  పశుసంవర్ధక , పాడి పరిశ్రమ శాఖ, మత్స్య , పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ ,పధకాన్ని రూపొందించి సమర్పించింది.   జీ-20 అధ్యక్ష బాధ్యతలు ఇండోనేషియా నిర్వర్తించిన సమయంలో జీ-20 పాండమిక్ ఫండ్ ఏర్పాటయింది. భారతదేశం నుంచి  $25 మిలియన్ గ్రాంట్ కోసం అందిన ప్రతిపాదనను జీ-20 పాండమిక్ ఫండ్ ఆమోదించింది. తక్కువ ,మధ్య-ఆదాయ దేశాలకు ప్రాధాన్యత ఇస్తూ   జాతీయ, ప్రాంతీయ మరియు ప్రపంచ స్థాయిలో  మహమ్మారి నివారణ, సంసిద్ధత, ప్రతిస్పందన సామర్థ్యాలను బలోపేతం చేయడానికి  పెట్టుబడులకు పాండమిక్ ఫండ్  ఆర్థిక సహాయం చేస్తుంది.

దాదాపు 350 ఆసక్తి వ్యక్తీకరణ (EoI),180 పూర్తి ప్రతిపాదనలు పాండమిక్ ఫండ్ కు అందాయి. $2.5 బిలియన్లకు మించి గ్రాంటులు కోరుతూ పాండమిక్ ఫండ్ కు   అభ్యర్థనలు అందాయి. అయితే,  $338 మిలియన్ల వరకు మాత్రమే పాండమిక్ ఫండ్ వద్ద అందుబాటులో ఉన్నాయి. మొదటి దశలో 19  అభ్యర్థనలకు పాండమిక్ ఫండ్ పాలకమండలి ఆమోదం తెలిపింది. 2023 జూలై 20న జరిగిన పాలకమండలి  ఆరు ప్రాంతాల్లో 37 దేశాల్లో భవిష్యత్తులో వచ్చే మహమ్మారి నివారణ వ్యవస్థను పటిష్టం చేయడానికి గ్రాంట్ల కోసం అందిన  19 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. 

పాండమిక్ ఫండ్ నిధులతో  వ్యాధి నిఘా, ముందస్తు హెచ్చరిక వ్యవస్థను బలోపేతం చేసి  ఏకీకృతం చేయడం, ప్రయోగశాల వ్యవస్థను  అప్‌గ్రేడ్ చేసి  విస్తరించడం, ఇంటర్-ఆపరబుల్ డేటా సిస్టమ్‌లను మెరుగుపరచడం, రిస్క్ అనాలిసిస్ , రిస్క్ కమ్యూనికేషన్ కోసం డేటా అనలిటిక్స్ సామర్థ్యాన్ని పెంపొందించడం, ఆరోగ్య భద్రత బలోపేతం చేయడం లాంటి అంశాలు అమలు జరుగుతాయి. పథకం అమలులో ఇతర దేశాలకు భారతదేశం సహకారం అందిస్తుంది. 

పాండమిక్ ఫండ్ మహమ్మారి నివారణ, సంసిద్ధత , ప్రతిస్పందన కోసం అదనపు, అంకితమైన వనరులను సమీకరించడం తో పాటు పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది.  భాగస్వాముల మధ్య సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది.  జంతువుల నుంచి  (పెంపుడు జంతువులు మరియు వన్యప్రాణులు) మనుషులకు సోకే అవకాశం ఉన్న వ్యాధుల నివారణకు  ప్రాజెక్టు ప్రాధాన్యత ఇస్తుంది. ప్రజల  ఆరోగ్యం, పోషక భద్రత, జీవనోపాధికి అపాయం కలిగించే వ్యాధుల నివారణకు అమలు జరిగే పథకాన్ని ఆసియా అభివృద్ధి బ్యాంకు పర్యవేక్షిస్తుంది.   ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ అమలుకు అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తుంది. 

 

*****



(Release ID: 1950853) Visitor Counter : 115