యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లో ఈ రోజు విజయవంతంగా ముగిసిన - యూత్ 20 (వై20) సదస్సు
ఏకగ్రీవ సమ్మతితో విజయవంతంగా ఆమోదం పొందిన - వై20 అధికారిక ప్రకటన
2023 ఆగష్టు, 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగిన - వై20 సదస్సు
Posted On:
20 AUG 2023 9:24PM by PIB Hyderabad
జి-20 అధ్యక్షతన జరుగుతున్న మొత్తం సమావేశాల్లో భాగంగా, వై-20 ఇండియా ఎంగేజ్‌మెంట్ గ్రూప్ సమావేశం ఈరోజు (2023 ఆగస్టు, 20వ తేదీన) వారణాసిలో విజయవంతంగా ముగిసింది.
భారతదేశం అధ్యక్షతన జరుగుతున్న మొత్తం జి-20 సమావేశాల్లో భాగంగా నిర్వహించిన వై-20 సమావేశం ప్రపంచానికి కొత్త రికార్డులు నెలకొల్పింది. ఈ శిఖరాగ్ర సమావేశంలో, వై-20 అధికారిక ప్రకటన పై సవివరమైన చర్చ జరిగింది. అనంతరం, ఏకగ్రీవ సమ్మతితో ఆ ప్రకటనను విజయవంతంగా ఆమోదించడం జరిగింది.
ఈ అధికారిక ప్రకటనలో చేర్చిన ప్రధాన సిఫార్సులు -
* జీవితకాల అభ్యాసానికి సాధికారత కల్పించడం.
* అంతర్జాతీయ సవాళ్ళ కోసం ప్రపంచ స్థాయి శ్రామికశక్తిని సమకూర్చడం.
* అంతర్జాతీయ పరిశోధనా సహకారాన్ని బలోపేతం చేయడం.
* కార్మికులకు ఒకే రకమైన హక్కులు ప్రోత్సహించడం
* అందుబాటులో సుస్థిరమైన ఆర్ధిక సహకారం, పర్యవేక్షణ ను అమలుచేయడం.
ఈ రోజు చివరి రోజున రుద్రాక్ష ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ (ఆర్.ఐ.సి.సి.సి) లో ప్లీనరీ సమావేశం జరిగింది. ఈ ప్లీనరీ సమావేశానికి వై-20 ఇండియాకి చెందిన శ్రీ శరద్ వివేక్ సాగర్, శ్రీ అన్మోల్ సోవిట్; వై-20 ఇండియా కోఆర్డినేషన్ హెడ్ శ్రీ పతిక్రిత్ పేన్; వై-20 ఇండియా డెలిగేషన్ హెడ్ శ్రీ ఫాలిత్ సిజారియా; వై-20 ఇండియా ట్రాక్ చైర్ శ్రీమతి అదితి నారాయణి పాశ్వాన్ నాయకత్వం వహించారు. 2023 యూత్-20 అధికారిక ప్రకటనను ఇండోనేషియా నిర్వహణ కమిటీ ప్రతినిధి, బ్రెజిల్ నిర్వహణ కమిటీ ప్రతినిధి తో కూడిన ట్రోయికా దేశాలు విడుదల చేశాయి. వై-20 అధ్యక్ష స్థానంలో ఉన్న భారతదేశం పతాకాన్ని బ్రెజిల్ ప్రతినిధి బృందం అధిపతికి అధికారికంగా అందజేసింది.
వై-20 అధికారిక ప్రకటన రూపంలో వెలువడిన సదస్సు ఫలితంపై ప్రతినిధి బృందాల నాయకులు సంతకం చేశారు, ఇది గత కొన్ని నెలలుగా జరిగిన వివిధ చర్చల ముగింపును సూచిస్తుంది. వై-20 కి చెందిన ఐదు గుర్తించిన ఇతివృత్తాలలో సామూహిక ఉమ్మడి దృష్టికి ఇది నిదర్శనం, ఇది ప్రపంచ వేదికపై అత్యున్నత స్థాయి నిర్ణయాధికారులకు యువత అభిప్రాయాలను వినిపించేలా చేస్తుంది.
4 రోజుల శిఖరాగ్ర సమావేశంలో భాగంగా, ప్రతినిధులు సారనాథ్, ప్రసిద్ధ కాశీ విశ్వనాథ దేవాలయంతో పాటు, గంగానదిలో పడవల్లో తిరుగుతూ వివిధ ఘాట్ లను కూడా సందర్శించారు. భారతదేశ గొప్ప కళ, సంస్కృతి, వారసత్వం ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన ప్రతినిధులపై దీర్ఘకాల ముద్ర వేసింది. పవిత్ర నగరం వారణాసి గొప్ప, విభిన్న సాంస్కృతిక వారసత్వం; దాని ఆధ్యాత్మికత, సాహిత్యం, కళ, సంగీతం కూడా జి-20 దేశాలు, అతిథి దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులను మంత్రముగ్ధులను చేశాయి.
2023 యూత్-20 (వై-20) సదస్సు నిర్వహణ బాధ్యతను భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని యువజన వ్యవహారాల విభాగానికి అప్పగించడం జరిగింది. న్యూ ఢిల్లీలో వై-20 కర్టెన్ రైజర్; గౌహతిలో ప్రారంభ సమావేశం; లడఖ్ లోని లే లో వై-20 ప్రీ-సమ్మిట్; దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల్లో 14 చోట్ల వై-20 సంప్రదింపులు; భారత పారిశ్రామిక సమాఖ్య (సి.ఐ.ఐ) తో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలకోసం పరిశోధన, సమాచార విధానం (ఆర్.ఐ.ఎస్) ద్వారా ఒక్కొక్కటి 50 చొప్పున మేధోమథన సదస్సులు వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
*****
(Release ID: 1950705)
Visitor Counter : 185