సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
లక్నోలో యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ ను కలసిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్; రాష్ట్ర డిజిటల్ గవర్నెన్స్ ప్రణాళికపై చర్చ
మరే రాష్ట్రంలో లేని విధంగా యూపీ డిస్ట్రిక్ట్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ 2022 విడుదలకు సిద్ధంగా ఉంది: డాక్టర్ జితేంద్ర సింగ్
యూనిఫైడ్ సర్వీసెస్ పోర్టల్ లో మరిన్ని రాష్ట్ర ప్రభుత్వ సేవలను తీసుకురావాలని డాక్టర్ జితేంద్ర సింగ్ యుపి సిఎంను కోరిన డాక్టర్ జితేంద్ర సింగ్
ఉత్తర ప్రదేశ్ లో సేవోత్తమ్ పై డిఎఆర్ పిజి రెండవ జాతీయ వర్క్ షాప్ నిర్వహిస్తుంది; 2023 మే, జూన్ , జూలై నెలల్లో వరుసగా పెద్ద రాష్ట్రాలలో ఫిర్యాదుల పరిష్కార ర్యాంకింగ్ లలో యుపి అగ్రస్థానంలో నిలిచింది: డాక్టర్ జితేంద్ర సింగ్
జీవన్ ప్రమాణ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ (డి ఎల్ సి ) జనరేషన్ కు వీలుగా రాష్ట్ర ట్రెజరీలు ఎం ఇ ఐ టి వైతో ఒప్పందం కుదుర్చుకోవాలి: డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
20 AUG 2023 5:09PM by PIB Hyderabad
కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) పి ఎం ఒ , పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ, స్పేస్ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ లక్నోలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలిశారు. గంటకు పైగా జరిగిన ఈ భేటీలో ఉత్తరప్రదేశ్ డిజిటల్ గవర్నెన్స్ ప్లాన్ పై చర్చించారు.
దేశంలో ఏ రాష్ట్రం చేపట్టని విధంగా జిల్లాల సర్వేలో తొలిసారిగా ఉత్తరప్రదేశ్ డిస్ట్రిక్ట్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ (డీజీజీఐ) 2022 విడుదలకు సిద్ధంగా ఉందని తెలిపింది.
డి ఎ ఆర్ పి జి రూపొందించిన గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ (జి జి ఐ) 2021 నివేదిక ప్రకారం జి జి ఐ 2019 పనితీరు కంటే ఉత్తరప్రదేశ్ 8.9 శాతం వృద్ధిని కనబరిచింది. ఈ రంగాలలో ప్రధానంగా వాణిజ్యం , పరిశ్రమల రంగంలో యుపి అగ్రస్థానాన్ని పొందింది. సాంఘిక సంక్షేమం, అభివృద్ధి , న్యాయవ్యవస్థ , ప్రజా భద్రతలో కూడా పెరుగుదలను చూపించింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం సహా పౌర కేంద్రీకృత పాలనలో కూడా ఉత్తరప్రదేశ్ మంచి పనితీరు కనబరిచింది.
ఉత్తమ విధానాలకు బహుమతులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం డిజిజిఐ ఆధారిత పనితీరు ప్రోత్సాహక వ్యవస్థను రూపొందించాలని , భారత ప్రభుత్వం డిఎ ఆర్ పి జి నిర్వహించే పిఎం అవార్డుల తరహాలో సుపరిపాలన / అభ్యాసాల కోసం ముఖ్యమంత్రి అవార్డులను ఏర్పాటు చేయాలని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రతిపాదించారు.
2023 సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా రాంపూర్, చిత్రకూట్ జిల్లాలు ప్రధాన మంత్రి అవార్డులను గెలుచుకున్న సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ యుపి ముఖ్యమంత్రి ని అభినందించారు. బ్లాక్ రైస్ కోసం చందౌలి జిల్లా, ఓడీఓపీ- కళా నమక్ బియ్యం కోసం సిద్ధార్థనగర్ జిల్లా, స్వామిత్వ యోజన కోసం వారణాసి జిల్లా, రాష్ట్ర మైన్స్ అండ్ మినరల్ మేనేజ్మెంట్ సిస్టమ్ తో.సహా పరిపాలన, ఇ-గవర్నెన్స్ లో అత్యుత్తమ పనితీరు కు గానూ అనేక ఇతర వినూత్న పద్ధతులకు కూడా ప్రధాన మంత్రి అవార్డులు లభించాయి.
ఉత్తరప్రదేశ్ లో 714 ప్రభుత్వ సేవలను ఆన్ లైన్ లో అందించిన యోగి ఆదిత్యనాథ్ ను జితేంద్ర సింగ్ ప్రశంసించారు. యూనిఫైడ్ సర్వీసెస్ పోర్టల్ లో మరిన్ని సేవలను తీసుకురావాలని ఆయన యుపి ముఖ్యమంత్రిని కోరారు. ఆన్ లైన్ లో 1,000 సేవలను అందించే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో ఉన్న మధ్యప్రదేశ్ ను యు పి రాష్ట్రం త్వరలోనే చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పర్యాటక రంగంలో కనీసం 20 రకాలు, పర్యావరణంలో 9 రకాలు, విద్యలో 14 రకాల ఇ-సేవలను అందించే సామర్థ్యం ఉత్తరప్రదేశ్ కు ఉందని పేర్కొన్నారు.
డి ఎ ఆర్ పి జి ద్వైవార్షికంగా విడుదల చేసిన నేషనల్ ఇ-గవర్నెన్స్ సర్వీస్ డెలివరీ అసెస్మెంట్ (ఎన్ ఇ ఎస్ డి ఎ) 2021 ఇండెక్స్ ప్రకారం, పోర్టల్స్, సర్వీస్ పోర్టల్స్ మదింపులో 85% కంటే ఎక్కువ నిబద్ధతతో పెద్ద రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది. ఎన్ ఇ ఎస్ డి ఎ 2021 మదింపులో తప్పనిసరి సేవలను అమలు చేయడంలో ఉత్తరప్రదేశ్ ముందంజలో ఉంది. "నివేష్ మిత్ర" అనే ఇంటిగ్రేటెడ్ పోర్టల్ లో యుపి నుండి ఆదర్శవంతమైన చొరవ కూడా 2021 మదింపులో కవర్ చేయబడింది.
ఫిర్యాదుల పరిష్కార (గ్రీవెన్స్ డిస్పోజల్) ర్యాంకింగ్స్ లో రాష్ట్రం అసాధారణ పనితీరు కనబరిచిందని జితేంద్ర సింగ్ ప్రశంసించారు.
డి ఎ ఆర్ పి జి విడుదల చేసిన రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల గ్రీవెన్స్ రిడ్రెసల్ అండ్ అసెస్ మెంట్ ఇండెక్స్ (జీఆర్ ఏఐ) నెలవారీ నివేదిక ప్రకారం 2023 మే, జూన్, జూలై నెలల్లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెద్ద రాష్ట్రాల్లో వరుసగా ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిచింది. 01.01.2023 నుండి 15.08.2023 వరకు అన్ని రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలలో ఉత్తర ప్రదేశ్ అత్యధికంగా ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించింది. సగటున 23 రోజుల ముగింపు సమయం ఉన్న ఉత్తర ప్రదేశ్, 30 రోజుల ప్రామాణిక పరిష్కార సమయంలో వారి ఫిర్యాదుల సగటు ముగింపు సమయాన్ని కలిగి ఉన్న ఏకైక పెద్ద రాష్ట్రం.
రాష్ట్ర ప్రభుత్వం ఐజిఆర్ఎస్ లేదా 'యుపి జన్ సున్వాయి సమాధాన్' అని పిలువబడే చాలా బలమైన ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ ను అభివృద్ధి చేసింది. ఈ వ్యవస్థకు సి ఎం హెల్ప్ లైన్ కేంద్ర బిందువు. 500 మంది సిబ్బందితో పనిచేసే కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నంబర్ 1076 ద్వారా సాధారణ పౌరులు తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు. ఐజిఆర్ఎస్ భారత ప్రభుత్వ పిజి పోర్టల్ (సిపిజిఆర్ఎంఎస్) తో పాటు గవర్నర్ కార్యాలయం, సిఎంఒ వంటి వివిధ కార్యాలయాలలో జిల్లాలు / తహసీల్ , పోలీస్ స్టేషన్ల స్థాయి వరకు పూర్తిగా అనుసంధానించబడింది. ఐజీఆర్ఎస్ ప్రభావం చాలా సానుకూలంగా ఉంది. ఈ విధానం ద్వారా ఏటా సగటున 80 లక్షల ప్రజా ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరిస్తున్నారు. పౌరుల నుండి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు లేదా సూచనలను స్వీకరించడం వ్యవస్థపై పెరుగుతున్న విశ్వాసాన్ని , పరిపాలన లో పెరిగిన విశ్వసనీయతను ప్రతిబింబిస్తుంది. సరాసరి పరిష్కార సమయం గణనీయంగా తగ్గింది.
డి ఏ ఆర్ పి జి ఉత్తర్ ప్రదేశ్ లో సేవోత్తమ్ పై రెండవ జాతీయ వర్క్ షాప్ ను నిర్వహించవచ్చని డాక్టర్ జితేంద్ర సింగ్ సూచించారు. సేవోత్తమ్ అనేది సిపిజిఆర్ఎమ్ఎస్ కింద నమోదైన ఫిర్యాదుల పరిష్కార అధికారులకు సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమం. స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్స్ (ఏటీఐ) ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. యు పి సహా 19 ఏటీఐలు సేవోత్తమ్ అమలులో డీఏఆర్ పీజీలో చేరాయి. 2022-23లో యూపీ ఏటీఐకి రూ.20 లక్షల గ్రాంట్ను విడుదల చేసింది. 658 మంది అధికారులకు 11 శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.
ఫేస్ అథెంటికేషన్ టెక్నిక్ ఉపయోగించి జీవన్ ప్రమాణ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ (డిఎల్ సి ) జనరేషన్ ను ప్రారంభించడానికి పెన్షనర్ల మొబైల్ ఫోన్ లలో యాప్ ను ఇన్స్టాల్ చేసేలా ఎంఈఐటివైతో ఒప్పందం కుదుర్చుకునేలా రాష్ట్ర ట్రెజరీలను ఆదేశించాలని డాక్టర్ జితేంద్ర సింగ్ యుపి సిఎంను కోరారు. దీంతో యూపీ రాష్ట్ర ప్రభుత్వ ట్రెజరీల నుంచి పింఛను పొందుతున్న పెన్షనర్లకు డి ఎల్ సి సదుపాయం అందుబాటులోకి రానుంది.
లక్నోలో బయోటెక్నాలజీ పార్కు ఏర్పాటుకు కేంద్ర బయోటెక్నాలజీ విభాగం వీలైనంత త్వరగా భూమిని కేటాయించాలని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రిగా డాక్టర్ జితేంద్ర సింగ్ యు పి ముఖ్యమంత్రి ని కోరారు.
****
(Release ID: 1950671)
Visitor Counter : 128