సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

ఎస్.సి, ఎస్టి లలో ఎంటర్ ప్రెన్యూర్షిప్ సంస్కృతి పెంచేలా అవగాహన కల్పించేందుకు,


జార్ఖండ్లోని గుమ్లాలో ఏర్పాటు చేసిన జాతీయ ఎస్.సి.ఎస్టి హబ్ మెగా సమ్మేళనాన్ని ప్రారంభించిన కేంద్ర ఎం.ఎస్.ఎం.ఇ శాఖ సహాయ మంత్రి శ్రీ భానుప్రతాప్ పింగ్ వర్మ,

Posted On: 18 AUG 2023 6:28PM by PIB Hyderabad

కేంద్ర చిన్న మధ్యతరహా ఎంటర్ప్రైజెస్(ఎం.ఎస్.ఎం.ఇ), 2023 ఆగస్టు 18న జార్ఖండ్ లోని గుమ్లా టౌన్ హాల్ లో జాతీయ ఎస్.సి, ఎస్.టి హబ్ సమ్మేళనాన్ని నిర్వహించింది. ఎంటర్ప్రెన్యుయర్షిప్ సంస్కృతిని పెంపొందించడానికి, ఎన్.ఎస్.ఎస్.హెచ్ పథకం, మంత్రిత్వశాఖకు చెందిన ఇతర పథకాల గురించి అవగాహన కల్పించడానికి ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు.
కేంద్ర ఎం.ఎస్.ఎం.ఇ శాఖ సహాయమంత్రి శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారితో పాటు జార్ఖండ్ ప్రభుత్వం పరిశ్రమల శాఖ కార్యదర్శి శ్రీ జితేంద్ర కుమార్ సింగ్, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సమ్మేళనంలో 650 మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, ప్రస్తుత పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.
ఈ సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ, భారతీయ ఆర్ధిక వ్యవస్థలో ఎం.ఎస్.ఎం.ఇ రంగం  దేశ జిడిపి కి తోడ్పాటు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.
అలాగే దేశ నంచి జరిగే మొత్తం ఎగుమతులలో ఎం.ఎస్.ఎం.ఇ ల పాత్ర గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, ఎం.ఎస్.ఎం.ఇలు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే కాక, గ్రామీణ, వెనుకబడన ప్రాంతాల పారిశ్రామికీకరణకు ఎంతో దోహదపడుతున్నాయన్నారు.

జార్ఖండ్ ఎం.ఎస్.ఎం.ఇ రంగానికి ఎన్నో రకాల సహజవనరులు అందుబాటులో ఉన్నాయన, ఖనిజాల ఆధారిత యూనిట్లు ఏర్పాటు చేయడానికి ఇది అద్భుతమైన గమ్యస్థానమని ఆయన అన్నారు. అటవీ, ఖనిజాధారిత పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్రంలో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని, ఈ యూనిట్లు నిలదొక్కుకోవడానికి తమ ప్రభుత్వం పలు మద్దతు చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
ఎం.ఎస్.ఎం. ఇ రంగానికి సాధికారత కల్పించచచేందుకు ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల ముఖ్యాంశాలను ఆయన వివరించారు. ఈ సమ్మేళనం ద్వారా, ఎస్.సి, ఎస్.టి ఎంటర్ప్రెన్యుయర్లు వినూత్న ఆలోచనలతో ముందుకు రావడానికి వీలు కలుగుతుందని, వివిధ వ్యాపార అవకాశాలతో ముందుకు రావడానికి, ఈ పథకాల నుంచి గరిష్ఠ స్థాయి లో ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఈ సమ్మేళనంలో మాట్లాడుతూ, ఎం.ఎస్.ఎం. ఇ మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి మెర్సీ ఎపావో, జాతీయ ఎస్.సి–ఎస్.గి హబ్ పథకం కింద, ఎస్.సి, ఎస్.టి ఎంటర్ప్రెన్యుయర్ల కోసం

 ఎం.ఎస్.ఎం.ఇ రంగంలో అమలు చేస్తున్న వివిధ పథకాలను వివరించారు. సిపిఎస్ఇలు, బ్యాంకుల, ఇతర రుణ సహాయ సంస్థల చేత ఒక ప్రత్యేక టెక్నికల్ సెషన్ ఏర్పాటు చేసి ఎస్.సి, ఎస్.టి ఎంటర్ప్రెన్యుయర్లకు అవగాహన కల్పించారు.
ఒ.ఎన్.జి.సి,బిఎస్ఎన్ఎల్, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ లిమిటెడ్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తమ వద్ద వెండర్లుగా పేర్లు నమోదు చేసుకోవడానికి గల ప్రక్రియను తెలిపారు. ఎస్.సి, ఎస్.టి ల యాజమాన్యంలోని ఎం.ఎస్.ఎం.ఇ లనుంచి పొందగల వివిధ ఉత్పత్తులు, సేవలకు సంబంధించిన వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఎస్.బి.ఐ, ఎన్.ఐ.డి.బి.ఐ, ఐఎఫ్సిఐ వెంచర్ కాపిటల్ ఫండ్స్, నాబార్డ్ సంస్థలు ఎం.ఎస్.ఎం.ఇ రంగానికి అందిస్తున్న రుణసదుపాయాల గురించి వివరించాయి. ఇతర ప్రభుత్వ సంస్థలైన కె.వి.ఐ.సి, ఎం.ఎస్.ఎం.ఇ–డిఎఫ్ఒ, ట్రైఫెడ్, జిఇఎం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎం.ఎస్.ఎం.ఇకి తమ తరఫున అందిస్తున్న సేవల గురించి తెలిపాయి..

ఈ కార్యక్రమంలో ఫెసిలిటేషన్ డెస్క్లు ఏర్పాటు చేసి ఎస్.సి, ఎస్.టి ఎం.ఎస్.ఇ లకు అక్కడికక్కడే ఉదయం పథకం రిజిస్ట్రేషన్లకు వీలు కల్పించారు.
సమ్మిళిత అభివృద్దికి, దేశంలో ఎస్.సి, ఎస్టి కమ్యూనిటీలలో  ఎంటర్ప్రెన్యుయర్షిప్ సంస్కృతిని పెంపొందించడానికి,  పబ్లిక్ ప్రొక్యూర్ మెంట్ విధానం కింద,  4 శాతం పబ్లిక్ ప్రొక్యూర్మెంట్  ప్రక్రియలో అవి క్రియాశీలంగా పాలుపంచుకునేట్టు   చేయడానికి వీరి పాత్ర ఎంతో కీలకమని తెలియజేయడం జరిగింది.

***



(Release ID: 1950386) Visitor Counter : 124


Read this release in: English , Urdu , Hindi , Punjabi