వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

జైపూర్‌లో 2023 ఆగస్టు 24 నుంచి రెండు రోజుల పాటు జరగనున్న జీ-20 వాణిజ్యం, పెట్టుబడుల మంత్రుల సమావేశం


భారతదేశం అధ్యక్షతన ప్రపంచ వాణిజ్య, పెట్టుబడి సంబంధిత అంశాలపై ఏకాభిప్రాయాన్ని సాధించే అంశంపై దృష్టి సారించనున్న సమావేశం

ప్రాధాన్యత అంశాలుగా అభివృద్ధి , శ్రేయస్సు కోసం వాణిజ్యం, స్థితిస్థాపక వాణిజ్యం, ప్రపంచ విలువ గొలుసులు,, ప్రపంచ వాణిజ్యంలో ఎంఎస్ఎంఈ లను సమగ్రపరచడం, వాణిజ్యం రవాణా, ప్రపంచ వాణిజ్య సంస్థ సంస్కరణలు అంశాలను చర్చించిన వాణిజ్యం, పెట్టుబడులపై ఏర్పాటైన వర్కింగ్ గ్రూప్

Posted On: 18 AUG 2023 5:25PM by PIB Hyderabad

జైపూర్‌లో 2023 ఆగస్టు 24 నుంచి రెండు రోజుల  పాటు  జీ-20 వాణిజ్యం, పెట్టుబడుల మంత్రుల సమావేశం జరుగుతుంది. ఆగస్టు 24, 25 తేదీల్లో జరిగే సమావేశానికి ముందు వాణిజ్యం, పెట్టుబడులపై ఏర్పాటైన  వర్కింగ్ గ్రూప్ 4వ సమావేశం భారతదేశం అధ్యక్షతన జైపూర్‌లో ఆగస్టు 21,22 తేదీల్లో  సమావేశం అవుతుంది. వాణిజ్యం, పెట్టుబడులపై ఏర్పాటైన  వర్కింగ్ గ్రూప్ మొదటి మూడు సమావేశాలు ముంబై, బెంగళూరు, కెవాడియాలో  జరిగాయి. జీ-20 సభ్య దేశాలు,  ఆహ్వానిత దేశాలు చెందిన    వాణిజ్య మంత్రులు/కార్యదర్శులు,, ప్రాంతీయ సంస్థలు,  అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సహా 300 కు పైగా ప్రతినిధులు రెండు రోజుల పాటు జరిగే సమావేశాల్లో పాల్గొంటారు.  ప్రపంచ వాణిజ్యం, పెట్టుబడి సంబంధిత అంశాలపై ఏకాభిప్రాయాన్ని సాధించే అంశంపై  దృష్టి సారించి చర్చలు జరుగుతాయి. జీ-20 అధ్యక్ష హోదాలో భారతదేశం ప్రతిపాదించిన  కార్యాచరణ-ఆధారిత అంశాలను కూడా సమావేశంలో చర్చిస్తారు. 

వాణిజ్యం, పెట్టుబడులపై ఏర్పాటైన  వర్కింగ్ గ్రూప్ మొదటి రెండు సమావేశాలలో   స్థితిస్థాపక వాణిజ్యం, ప్రపంచ విలువ గొలుసులు,, ప్రపంచ వాణిజ్యంలో ఎంఎస్ఎంఈ లను సమగ్రపరచడం, వాణిజ్యం రవాణా, ప్రపంచ వాణిజ్య సంస్థ సంస్కరణ అంశాలపై జీ-20 సభ్య దేశాలు / ఆహ్వానిత దేశాల ప్రతినిధులు  విస్తృతంగా చర్చించారు. 

ఈ రెండు సమావేశాల్లో  పాల్గొన్న నిపుణులు గుర్తించిన ప్రాధాన్యత అంశాలకు సంబంధించి    ప్రతి అంశాన్ని లోతుగా చర్చింది  వాటి నుండి వెలువడే ఫలితాలను వివరిస్తూ ప్రదర్శనలు ఇచ్చారు. ఈ  చర్చలలో పాల్గొన్న జీ-20 సభ్య దేశాలు/ ఆహ్వానిత దేశాల ప్రతినిధులు  వ్యక్తం చేసిన అభిప్రాయాలు/సూచనల ఆధారంగా అధ్యక్ష హోదాలో భారతదేశం అధికారిక  ప్రకటన, కార్యాచరణ-ఆధారిత నిర్దిష్ట ప్రతిపాదనలను రూపొందించింది.

అంతర్జాతీయ వాణిజ్య వృద్ధి ఎదుర్కొంటున్న ప్రపంచ ప్రకంపనలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో  సమ్మిళిత వృద్ధి, ఆవిష్కరణ, ఉద్యోగ కల్పన వంటి సమిష్టి  లక్ష్యాలు, స్థిరమైన అభివృద్ధి సాధించడానికి ప్రపంచ వాణిజ్య సంస్థ రూపొందించిన నియమాల ఆధారిత బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థ అనివార్యమని జీ-20  పునరుద్ఘాటించింది.

దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య కార్యక్రమాలు సాంకేతికత ఆధారంగా జరుగుతున్నాయి. కాగిత రహిత వాణిజ్య వ్యవస్థ  లావాదేవీల ఖర్చులను మరింత తగ్గిస్తుంది, చిన్న సరుకుల రవాణా ఖర్చులు తగ్గుతాయి.  తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ  కార్యకలాపాల నిర్వహణకు అవకాశం కలిగిస్తుంది.  వేగంగా జరుగుతున్న డిజిటలైజింగ్ ప్రపంచంలో వాణిజ్య పోటీతత్వాన్ని తీసుకువస్తుంది అని గుర్తించిన జీ-20 ఈ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. 

అంతర్జాతీయ వాణిజ్య రంగంలో  సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ  లు) ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని జీ-20 నిర్ణయించింది.  ఉద్యోగాల కల్పన, జీడీపీ అభివృద్ధిలో ఎంఎస్ఎంఈ ల పాత్ర కీలకంగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎంఎస్ఎంఈ రంగం ఎదుర్కొంటున్న  వ్యాపార, వాణిజ్య సంబంధిత సమాచార లోపం, నిధుల కొరత, మార్కెట్‌ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జీ-20 దేశాలు నిర్ణయించాయి.  

 ప్రపంచ వాణిజ్యంలో 70%   గ్లోబల్ వాల్యూ చైన్స్ (GVCs) ద్వారా జరుగుతుంది. భవిష్యతులో ఎదురయ్యే సవాళ్ళను తట్టుకునే విధంగా  గ్లోబల్ వాల్యూ చైన్స్   నిలకడగా పనిచేయడానికి సహకరించే వ్యవస్థను అభివృద్ధి చేసే అంశంపై జీ-20 దృష్టి సారించాల్సి ఉంటుంది. 

ప్రపంచ వాణిజ్య సంస్థ రూపొందించిన సంస్కరణలను అమలు చేసే అంశంలో సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించడానికి వాణిజ్యం, పెట్టుబడులపై ఏర్పాటైన  వర్కింగ్ గ్రూప్ ప్రాధాన్యత ఇవ్వాలని అభిప్రాయపడింది.   రాబోయే పదమూడవ మంత్రివర్గ సమావేశం (MC13)లో అర్ధవంతమైన నిర్ణయం  సాధించడానికి నిర్మాణాత్మకంగా పని చేస్తుంది.

ప్రతి ప్రాధాన్యతా అంశాలపై  సభ్య దేశాల  అభిప్రాయాలు, సూచనలు మంత్రివర్గ ప్రకటన మరియు దాని అనుబంధాల కోసం ముసాయిదా పాఠాన్ని తయారు చేయడంలో సహాయపడ్డాయి. వాణిజ్యం, పెట్టుబడులపై ఏర్పాటైన  వర్కింగ్ గ్రూప్  సమావేశాల సందర్భంగా జరిగిన చర్చలు తుది ప్రకటన   మెరుగుదలకు దారితీశాయి. ప్రపంచ వాణిజ్యాన్ని కలుపుకొని పోవడానికి వాణిజ్యం, పెట్టుబడులపై ఏర్పాటైన  జీ-20 వర్కింగ్ గ్రూప్ నిబద్ధతను తెలియజేస్తాయి. 

ప్రపంచ వాణిజ్యం , పెట్టుబడులను వేగవంతం చేయడానికి జీ-20 సభ్యుల మధ్య విశ్వసనీయ సహకారానికిజీ-20 వాణిజ్యం, పెట్టుబడుల మంత్రుల సమావేశం  మార్గం సుగమం చేస్తుందని భావిస్తున్నారు.భారతదేశం ప్రతిపాదించిన  వసుధైవ కుటుంబంతో స్ఫూర్తితో అభివృద్ధి సాధనలో అందరినీ కలుపుకొని, పారదర్శకంగా పని  చేయడానికి ఇప్పటికే ఉన్న అవకాశాలను ఉపయోగించుకునే సాధనాలను సహ-అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.

ఐదు ప్రతిపాదిత ప్రాధాన్యత అంశాల ప్రాధాన్యత గుర్తించిన భారతదేశం జీ-20 అధ్యక్ష హోదాలో   ముంబై, బెంగళూరు, ఏక్తా నగర్‌లలో ట్రేడ్ ఫైనాన్స్, ట్రేడ్ అండ్ టెక్నాలజీ మరియు ట్రేడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై సైడ్ ఈవెంట్ సెమినార్‌లను కూడా నిర్వహించింది. అన్ని స్థాయిల పాలనలో వాటాదారులను ఒకచోటచేర్చి, బలమైన ప్రపంచ వాణిజ్య పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి అవసరమైన సమిష్టి చర్యలపై ఆలోచనలు చేయడం లక్ష్యంగా సమావేశాలు జరిగాయి. 

మంత్రుల సాహెబు సమావేశంలో పాల్గొంటున్న  ప్రతినిధుల కోసం అనేక రకాల భారతీయ టీ, కాఫీ, మసాలా దినుసులు మరియు మిల్లెట్‌లను ప్రదర్శించడానికి ప్రదర్శన నిర్వహిస్తారు.  పింక్ సిటీగా గుర్తింపు పొందిన  జైపూర్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడానికి జైపూర్  ప్రదర్శన జరుగుతుంది. 

 

***

 



(Release ID: 1950374) Visitor Counter : 124


Read this release in: English , Urdu , Hindi , Tamil