ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
బంగ్లాదేశ్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్ మరియు తుర్కియే మంత్రుల ప్రతినిధులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించిన ఎంఓఎస్ రాజీవ్ చంద్రశేఖర్
డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్, ఇండియా స్టాక్, ఏఐ, స్కిల్లింగ్ మరియు సైబర్‌సెక్యూరిటీ వంటి సంభావ్య సహకార రంగాలపై చర్చ
సాంకేతికత యొక్క భవిష్యత్తును కేవలం కొన్ని దేశాలు లేదా కంపెనీలు రూపొందించలేవు. అందువల్ల అందరూ కలసి పనిచేయాలి:ఎంఒఎస్ రాజీవ్ చంద్రశేఖర్
ఇండియా స్టాక్ పౌరుల జీవితాలను మార్చివేసింది మరియు ప్రభుత్వం మరియు డిజిటల్ నగ్రిక్‌ల మధ్య నమ్మకాన్ని పెంచింది: ఎంఒఎస్ రాజీవ్ చంద్రశేఖర్
ప్రపంచవ్యాప్తంగా తమ ఆర్థిక వ్యవస్థలు మరియు పాలనను డిజిటలైజ్ చేయాలని భావిస్తున్న దేశాలకు మేము ఇండియా స్టాక్‌ను అందిస్తున్నాము: ఎంఒఎస్ రాజీవ్ చంద్రశేఖర్
Posted On:
18 AUG 2023 5:28PM by PIB Hyderabad
జీ20 డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ నాల్గవ సమావేశంలో బంగ్లాదేశ్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్ మరియు తుర్కియే దేశాలకు చెందిన మంత్రుల బృందాలు మరియు ఇతర సీనియర్ ప్రతినిధులతో కేంద్ర నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మరియు ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు.
బంగ్లాదేశ్ ఐసిటి సహాయ మంత్రి జునైద్ అహ్మద్ పాలక్‌తో మంత్రి సమావేశమయ్యారు మరియు సంభాషించారు. ఇండియా స్టాక్, సైబర్ సెక్యూరిటీ మరియు స్కిల్లింగ్ చుట్టూ సంభావ్య సహకారాలపై చర్చ దృష్టి సారించింది. ఈ సమావేశంలో శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ "భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య భాగస్వామ్యం దక్షిణాసియా గురించిన కథనాలను తిరిగి రాస్తుంది" అని పేర్కొన్నారు.
ఫ్రాన్స్ డిజిటల్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాయబారి హెన్రీ వెర్డియర్‌తో మంత్రి ద్వైపాక్షిక సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఏఐ వంటి సాంకేతికతలు పౌరుల జీవితాలను ఎలా మారుస్తున్నాయి అనే అంశంపై ఈ చర్చ సాగింది.ఏఐలో న్యూ ఇండియా భారీగా పెట్టుబడులు పెట్టిందని మంత్రి చంద్రశేఖర్ పేర్కొన్నారు. "ఇండియా స్టాక్ వంటి డిపిఐల ద్వారా తమ ప్రభుత్వాన్ని మరియు ఆర్థిక వ్యవస్థను డిజిటలైజ్ చేయాలనుకునే దేశాలకు సహాయం చేయడానికి భారతదేశం మరియు ఫ్రాన్స్ వంటి సారూప్య భాగస్వాములకు అవకాశం ఉంది" అని ఆయన అన్నారు.
తుర్కియే పరిశ్రమ మరియు సాంకేతిక మంత్రి శ్రీ మెహ్మెత్ ఫాతిహ్ కాసిర్‌తో తన సమావేశంలో మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ “టెక్నాలజీ యొక్క భవిష్యత్తును కేవలం కొన్ని దేశాలు మరియు కంపెనీలు రూపొందించలేవు. అందువల్ల అందరినీ కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంది” అని పేర్కొన్నారు.
చివరగా దక్షిణ కొరియాకు చెందిన సైన్స్ అండ్ ఐసిటీ మంత్రిత్వ శాఖ డిప్యూటీ మంత్రి డాక్టర్ జిన్ బే హాంగ్‌తో మంత్రి ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. విస్తృత సాంకేతిక రంగంలో ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్‌లో భారతదేశం మరియు దక్షిణ కొరియాల మధ్య లోతైన సంబంధాలపై ఈ చర్చ సాగింది. "ఈ భాగస్వామ్య పెరుగుదల ప్రపంచంపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది" అని మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. సేఫ్ అండ్ ట్రస్టెడ్ ఇంటర్నెట్ ఆవశ్యకత గురించి కూడా మంత్రులు చర్చించారు.
*****
(Release ID: 1950369)
Visitor Counter : 107