యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
యువజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో జీ20 కింద వై20 సమ్మిట్ 2023 ఆగస్టు 17 నుండి 20 వరకు జరిగే వారణాసి సమ్మిట్‌లో ప్రారంభమవుతుంది
Posted On:
17 AUG 2023 1:40PM by PIB Hyderabad
జీ 20 అధ్యక్షత లో భాగంగా యూత్ 20 సమ్మిట్-2023 ఈ రోజు వారణాసిలో ప్రారంభమైంది.
శ్రీ పంకజ్ కుమార్ సింగ్, డైరెక్టర్ (యువజన వ్యవహారాల శాఖ) ,శ్రీ ఎస్. రాజలింగం, జిల్లా మేజిస్ట్రేట్, వారణాసి; వై20 చైర్ అన్మోల్ సోవిట్ ఆగస్ట్ 16న వారణాసిలో జరిగిన వై20 కర్టెన్ రైజర్ లో మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు.
డైరెక్టర్ (యువజన వ్యవహారాల శాఖ) శ్రీ పంకజ్ కుమార్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, జీ 20 ప్రెసిడెన్సీ కింద, యువజన వ్యవహారాల శాఖ, యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో 2023 ఆగస్టు 17 నుండి 20 వరకు యూత్ 20 సమ్మిట్-2023ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
వై20 సమ్మిట్‌లో ప్రముఖ నిపుణులు, నిర్ణయాధికారులు, జి20 దేశాలకు చెందిన జాతీయ మరియు అంతర్జాతీయ ప్రతినిధులు, నాలెడ్జ్ భాగస్వాములు (ఐఐఎం రాయ్‌పూర్), విద్యా భాగస్వాములు (విశ్వవిద్యాలయాలు/సంస్థలు) పాల్గొంటారని ఆయన చెప్పారు.
వారణాసిలో జరిగే వై20 సమ్మిట్ జీ 20 దేశాలకు చెందిన లబ్దిదారులు చర్చలు జరిపి, ఖరారు చేసిన వై20 కమ్యూనిక్‌పై సంతకం చేస్తుంది, ఇది గత కొన్ని నెలలుగా జరిగిన చర్చల ఫలితాల ఆధారంగా రూపొందించబడుతుంది.
ఈ వై20 కమ్యూనిక్ ఐదు గుర్తించబడిన ఇతివృత్తాలపై ఉమ్మడి విధానం యొక్క సారాంశాన్ని ప్రతిబింబిస్తుందని మరియు అత్యున్నత స్థాయిలో విధాన నిర్ణయాలు తీసుకునే వారు యువత వాణిని వినేలా చూస్తారని ఆయన అన్నారు.
వై20 సమ్మిట్ లో కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ మరియు కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల సహాయ మంత్రి శ్రీ నిసిత్ ప్రమాణిక్ మరియు శ్రీ. యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పాల్గొంటారు.
జీ 20 దేశాలు, అతిథి దేశాలు మరియు అంతర్జాతీయ సంస్థల నుండి దాదాపు 150 మంది ప్రతినిధులు వై20 యొక్క ఐదు గుర్తించబడిన థీమ్‌ల గురించి చర్చించనున్నారు. పరిశ్రమ 4.0, ఆవిష్కరణ మరియు 21వ శతాబ్దపు నైపుణ్యాలు, శాంతి నిర్మాణం మరియు సయోధ్య: యుద్ధం లేని యుగం, వాతావరణ మార్పులు మరియు విపత్తు రిస్క్ తగ్గింపు: సుస్థిరతని జీవిత శైలి గా మార్చడం, భాగస్వామ్య భవిష్యత్తు: ప్రజాస్వామ్యం మరియు పాలనలో యువత, ఆరోగ్యం, శ్రేయస్సు మరియు క్రీడలు: యువత కోసం ఎజెండా థీమ్‌ల పై చర్చించనున్నారు.
గౌహతిలో వై20 సమ్మిట్ ప్రారంభ సమావేశం, ప్రముఖ విద్యా సంస్థలలో నిర్వహించిన 14 యూత్-20 సంప్రదింపులు, లేహ్, లడఖ్‌లో ప్రీ సమ్మిట్, బ్రెయిన్‌స్టామింగ్ సెషన్‌లు, వై20 చౌపల్స్ మరియు దేశవ్యాప్తంగా నిర్వహించిన వివిధ జన్ భగీదారి ఈవెంట్‌ల ముగింపు కార్యక్రమం ఈ ప్రధాన వై20 సమ్మిట్. ఈ సమ్మిట్ ఇతర వాటాదారులతో సహకారం మరియు నెట్‌వర్కింగ్ కోసం అవకాశాలను అందించడం, యువకుల అభివృద్ధికి దోహదపడటం మరియు ప్రపంచ వేదికపై యూత్ ఎజెండాను చర్చించడం లక్ష్యంగా పెట్టుకుంది. యూత్20 అనేది జీ 20 యొక్క అధికారిక ఎంగేజ్‌మెంట్ గ్రూప్‌లలో ఒకటి. యూత్20 (వై20) ఎంగేజ్‌మెంట్ గ్రూప్, మెరుగైన భవిత కోసం ఆలోచనలపై దేశంలోని యువతను సంప్రదించడానికి మరియు ప్రణాళిక అమలు కోసం ఒక ఎజెండాను రూపొందించడానికి, భారతదేశవ్యాప్తంగా చర్చలు మరియు సంప్రదింపులను నిర్వహించింది. జీ20 ప్రాధాన్యతలపై యువత తమ దృక్కోణాలు మరియు ఆలోచనలను వ్యక్తీకరించడానికి వై20 ఒక వేదికగా నిరూపించబడింది.
***
(Release ID: 1949904)
Visitor Counter : 193