వ్యవసాయ మంత్రిత్వ శాఖ

77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 700 మందికి పైగా రైతుల భాగస్వామ్యంతో జరిగాయి. అట్టడుగు స్థాయినుండి ప్రాతినిధ్య లభించాలన్న ప్రధానమంత్రి దార్శనికత మేరకు కార్యక్రమం నిర్వహించబడింది.

Posted On: 15 AUG 2023 2:33PM by PIB Hyderabad


77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఈరోజు 700 మంది రైతులకు ఆతిథ్యం ఇచ్చారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అంతర్భాగంగా అట్టడుగు వర్గాలతో మమేకం కావాలనే దృక్పథాన్ని ఈ కార్యక్రమం నిజంగా ప్రతిబింబించింది. ఈ కార్యక్రమంలో 700 కంటే ఎక్కువ మంది రైతులు వివిధ వ్యవసాయ కార్యకలాపాలలో తమ భాగస్వామ్యాన్ని ప్రదర్శిస్తూ దేశవ్యాప్తంగా వివిధ వ్యవసాయ సంఘాలకు ప్రాతినిధ్యం వహించారు.

 
image.png


హాజరైన వారిలో సుమారు 100 మంది రైతు జంటలు పిఎం కిసాన్ లబ్ధిదారులు మరియు ఎఫ్‌పిఓ నుండి సుమారు 300 మంది రైతు జంటలు ఈ కార్యక్రమంలో రైతు ప్రాతినిధ్యంలో వైవిధ్యానికి సహకరించారు.

 
image.png


అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరానికి అనుగుణంగా రైతులకు ప్రత్యేక మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయబడింది. ఇందులో మిల్లెట్ (శ్రీ అన్న) నుండి తయారు చేయబడిన వంటకాలు ఉన్నాయి. ఈ  వంటకాల ఎంపిక మన రోజువారీ భోజనంలో మిల్లెట్‌లు అందించే విభిన్న పోషక విలువలు మరియు ఆహార ప్రయోజనాల ప్రదర్శనగా ఉపయోగపడుతుంది.కేంద్ర వ్యవసాయ మంత్రితో పాటు కేంద్ర వ్యవసాయం మరియు రైతు సంక్షేమశాఖ సహాయమంత్రి శ్రీ కైలాష్ చౌదరి మరియు శ్రీమతి శోభా కరంద్లాజేలు రైతుల సమావేశానికి స్వాగతం పలికారు మరియు సత్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ ఎర్రకోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో రైతులు పాల్గొనడం ప్రధానమంత్రి నరేంద్రమోదీ భగీదరి దార్శనికతను ప్రతిబింబిస్తుందని మరియు ప్రజల భాగస్వామ్యాన్ని నిర్ధారిస్తోందని అన్నారు.

ఈ ప్రభుత్వ హయాంలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు గణనీయమైన వృద్ధిని సాధించాయని, తన మంత్రిత్వ శాఖ నికర బడ్జెట్ 2013-14లో సుమారు 23 వేల కోట్ల నుండి ఈ సంవత్సరం 1,25,000 కోట్లకు ఐదు రెట్లు పెరిగిందని శ్రీ తోమర్ నొక్కి చెప్పారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ప్రతి రైతుకు వర్తింపజేసేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు.

 
image.png


సుమారు 24 వేల కోట్ల ప్రీమియం వసూళ్లకు సంబంధించి సుమారు 140 లక్షల కోట్ల రూపాయలను బీమా చెల్లింపుగా చెల్లించినట్లు శ్రీ తోమర్ తెలియజేశారు. "10,000 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌పిఓలు) ఏర్పాటు మరియు ప్రమోషన్" పేరుతో భారత ప్రభుత్వం యొక్క తాజా కేంద్ర రంగ పథకంపై శ్రీ తోమర్ వెలుగునిచ్చారు.

దేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి వ్యూహం మరియు అంకితమైన వనరుల గురించి మంత్రి వివరించారు. చిన్న, సన్నకారు మరియు భూమిలేని రైతులను ఎఫ్‌పిఓలలోకి చేర్చడానికి మద్దతు మరియు మార్గదర్శకత్వం అందించడానికి ఈ కార్యక్రమాలు రూపొందించబడ్డాయి అని శ్రీ తోమర్ పునరుద్ఘాటించారు.

మంత్రితో పరస్పర చర్చతో పాటు ఈ కార్యక్రమంలో ఫార్మర్స్ కనెక్ట్ ప్రోగ్రామ్‌లోని మరో చెప్పుకోదగ్గ అంశం ఏమిటంటే ఐసిఎఆర్ ప్రదర్శించిన ఎగ్జిబిషన్ ద్వారా వ్యవసాయ పరిశోధనలో తాజా పురోగతులను రైతులు అర్థం చేసుకునే అవకాశం లభించింది.

కార్యక్రమంలో పాల్గొన్న రైతులు ప్రధానమంత్రి సంగ్రహాలయ, వార్ మ్యూజియం మరియు ఐకానిక్ ఇండియా గేట్ వంటి ముఖ్యమైన ప్రదేశాలను సందర్శించడం ద్వారా ఢిల్లీ యొక్క శక్తివంతమైన చరిత్ర, నిర్మాణ అద్భుతాలు మరియు సాంస్కృతిక మైలురాళ్ల గురించి అవగాహన పొందగలిగారు.


 

****



(Release ID: 1949301) Visitor Counter : 123


Read this release in: English , Urdu , Hindi , Punjabi