రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

సరసమైన ధరలకు మందులను అందుబాటులో ఉంచేందుకు 25000 జన్ ఔషధి కేంద్రాలను ప్రారంభించనున్న ప్రభుత్వం


“ రూ.20,000 కోట్లు ఆదా చేయడం ద్వారా దేశంలోని మధ్యతరగతిప్రజలకు సరికొత్త శక్తిని అందించిన జన్ ఔషధి కేంద్రాలు ”

"జన్ ఔషధి కేంద్రాల సంఖ్యను 25,000 కేంద్రాలకు పెంచడమే లక్ష్యం"

Posted On: 15 AUG 2023 1:02PM by PIB Hyderabad

ఎర్రకోటలో స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 'జన్ ఔషధి కేంద్రాల' సంఖ్యను 10,000 నుండి 25,000కి పెంచాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు.

జన్ ఔషధి కేంద్రాలు మధ్యతరగతి ప్రజలకు ప్రత్యేక శక్తిని ఇచ్చాయన్నారు. ఎవరికైనా మధుమేహం ఉన్నట్లు నిర్ధారణ అయితే నెలవారీ బిల్లు రూ.3000 ఆదా అవుతుందని చెప్పారు.

రూ.100 ధర ఉన్న మందులను జన్ ఔషధి కేంద్రాల ద్వారా  రూ.10 నుంచి రూ.15కే ఇస్తున్నామని ప్రధాని తెలిపారు.

 

image.png


సాంప్రదాయ నైపుణ్యాలు కలిగిన వారి కోసం వచ్చే నెలలో ₹13,000 నుండి 15,000 కోట్ల కేటాయింపుతో విశ్వకర్మ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. 'జన్ ఔషధి కేంద్రం' (సబ్సిడీ మందుల దుకాణాలు) 10,000 నుండి 25,000 కు పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.

 

***



(Release ID: 1948979) Visitor Counter : 120