సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
జన్ భాగిదారి పెరుగుతుండడంతో, హర్ ఘర్ తిరంగా ప్రచారం ప్రజా ఉద్యమంగా మారింది : శ్రీ గోవింద్ మోహన్
ప్రతి రోజు లక్షల మంది తిరంగా సెల్ఫీలను అప్ లోడ్ చేస్తున్నారు
హర్ ఘర్ తిరంగా ప్రచారం కింద ఈ ఏడాది ఇప్పటి వరకు 2000 కు పైగా
కార్యక్రమాలను నిర్వహించిన సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
Posted On:
12 AUG 2023 3:49PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా భారత ప్రభుత్వం 2023 ఆగస్టు 13 నుండి 15 వరకు హర్ ఘర్ తిరంగను జరుపుకుంటుంది. పౌరులలో దేశభక్తి భావాన్ని పెంపొందించడం, సహకార భాగస్వామ్యం, పెరిగిన జన్ భగీదారి నేపథ్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను స్మరించుకోవడం దీని వెనుక ఉన్న ఆలోచన. ఈ రోజు న్యూఢిల్లీలో సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ గోవింద్ మోహన్ మీడియాతో ఈ అంశాలను పంచుకున్నారు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రారంభించిన హర్ ఘర్ తిరంగ ప్రచారం జన్-భాగిదారీతో ప్రజల ఉద్యమంగా రూపాంతరం చెందిందని ఆయన అన్నారు. అపారమైన ప్రజల భాగస్వామ్యంతో ఈ సంవత్సరం తిరంగా ర్యాలీలు దేశంలోని వివిధ ప్రాంతాలలో అత్యంత ఉత్సాహంగా జరిగాయి.
హర్ ఘర్ తిరంగా ప్రచారంలో పార్లమెంటు సభ్యులు పాల్గొన్న భారత మండపం (ప్రగతి మైదాన్, న్యూఢిల్లీ) నుండి ఈ సంవత్సరం జాతీయ స్థాయి తిరంగ బైక్ ర్యాలీ ఆగస్ట్ 11న ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. దీనిని భారత ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధంఖడ్ జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర ఈశాన్య ప్రాంత సాంస్కృతిక, పర్యాటక, అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి; వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ, జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్; సమాచార, ప్రసారాలు యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్; జలశక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్; న్యాయ శాఖ సహాయ మంత్రి, పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్; సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి శ్రీమతి మీనాక్షీ లేఖి, ఇతర ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బైక్ ర్యాలీ ఇండియా గేట్ సర్కిల్‌కు చేరుకుని ఇండియా గేట్ ఏరియా దగ్గర సర్కిల్‌లో తిరుగుతూ, కర్తవ్య మార్గం దాటి, మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియం వద్ద ముగిసింది. వివిధ వయసుల వారికి చెందిన వేలాది మంది ప్రజలు తమ బైక్‌లపై భారత జాతీయ జెండాను ఎగురవేసుకుని ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీకి నాయకత్వం వహిస్తున్న పార్లమెంట్ సభ్యులు తమ సొంత ద్విచక్ర వాహనాలపై వచ్చారు.
శ్రీ గోవింద్ మాట్లాడుతూ, ప్రతిరోజూ లక్షల మంది ప్రజలు తిరంగాతో తమ సెల్ఫీలను అప్‌లోడ్ చేస్తున్నారన్నారు. తిరంగాతో సెల్ఫీలతో పాటు, దేశంలోని సమరయోధుల స్మారక చిహ్నాలతో కూడిన అనేక శిలాఫలకాలను ముఖ్యమైన ప్రదేశాలలో నిర్మించే మేరి మాటి మేరా దేశ్ ప్రచారంలో ప్రజలు పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరూ తిరంగాతో తమ సెల్ఫీని అప్‌లోడ్ చేయడం ద్వారా హర్ ఘర్ తిరంగలో పాల్గొనవచ్చు, అన్నారాయన. ఈ చొరవలో భాగంగా, ప్రజలకు అధిక-నాణ్యత గల జాతీయ జెండాలను విక్రయించడం, పంపిణీ చేయడం కోసం పోస్టల్ డిపార్ట్‌మెంట్ బాధ్యత వహిస్తుంది. ఫ్లాగ్‌లను https://www.epostoffice.gov.in/ నుండి 12 ఆగస్టు 11:59 రాత్రి వరకు కొనుగోలు చేయవచ్చు.
శ్రీ గోవింద్ మోహన్ మరిన్ని వివరాలను తెలియజేస్తూ, పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఈ సంవత్సరం 2.5 కోట్ల జెండాల కోసం ప్రతిపాదించిందని, ఇప్పటికే పోస్టాఫీసుల ద్వారా 55 లక్షల జెండాలను పంపించామని చెప్పారు. జౌళి మంత్రిత్వ శాఖ ఇప్పటికే 1.3 కోట్ల జెండాలను రాష్ట్రాలకు పంపిందని ఆయన వెల్లడించారు. జెండా తయారీలో ఆత్మనిర్భర్త ధోరణిని సూచిస్తూ కోట్లాది జెండాలు కూడా రాష్ట్రాల్లోని సెల్ఫ్ హెల్ఫ్ గ్రూపుల ద్వారా ఉత్పత్తి చేస్తున్నట్టు చెప్పారు.
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ సంవత్సరం ఇప్పటి వరకు హర్ ఘర్ తిరంగా కింద 2000 కంటే ఎక్కువ ఈవెంట్‌లను నిర్వహించిందని శ్రీ గోవింద్ మోహన్ తెలిపారు ముఖ్యంగా మంత్రిత్వ శాఖలోని జోనల్ సాంస్కృతిక కేంద్రాల ద్వారా నూక్కడ్ నాటకం మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామని, హర్ ఘర్ తిరంగాలో పాల్గొనేందుకు విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో కూడా సందేశాలు ప్రచారం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇంటి వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలను కోరారు. మన్ కీ బాత్ తాజా సంచికలో, గత సంవత్సరం అద్భుతమైన విజయాన్ని, జన్ భగీదారిని సాధించిన 'హర్ ఘర్ తిరంగ' సంప్రదాయాన్ని కొనసాగించాలని పీఎం పిలుపునిచ్చారు. 2022లో ప్రచారంలో అనేక కొత్త విజయాలు సాధించారు. చండీగఢ్‌లోని సెక్టార్ 16లో ఉన్న క్రికెట్ స్టేడియంలో 5,885 మంది వ్యక్తులు ఒకచోట చేరి, జాతీయ జెండాను రెపరెపలాడే అతిపెద్ద మానవ చిత్రాన్ని రూపొందించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను నెలకొల్పడం ఒక ఉదాహరణ. అలాగే, 6 కోట్ల మందికి పైగా భారతీయ జెండా (తిరంగా)తో సెల్ఫీలు తీసుకుని హర్ ఘర్ తిరంగా వెబ్‌సైట్‌లో షేర్ చేశారు. కొనసాగుతున్న 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' వేడుకల్లో భాగంగా, శ్రీనగర్‌లోని జిల్లా యంత్రాంగం 75 సంవత్సరాల భారతదేశ స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని బక్షి స్టేడియంలో 1850 మీటర్ల పొడవైన జాతీయ జెండాను ప్రదర్శించడం ద్వారా జాతీయ రికార్డును సాధించింది.
తిరంగతో మీ సెల్ఫీని https://hargartiranga.com లో అప్‌లోడ్ చేయవచ్చు.
ప్రజలు https://merimaatimeradesh.gov.inలో మేరీ మాటీ - మేరా దేశ్ ప్రచారంలో పాల్గొనవచ్చు
(Release ID: 1948323)
Visitor Counter : 125