వ్యవసాయ మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు వివిధ రంగాలకు చెందిన ప్రత్యేక అతిథులకు ఆహ్వానం
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరుకావాలని శక్తివంతమైన గ్రామాల సర్పంచులు, ఉపాధ్యాయులు, నర్సులు, రైతులు, మత్స్యకారులకు ఆహ్వానం
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద లబ్ధి పొందిన ఎర్రకోట వద్ద ప్రత్యేక అతిథులుగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వీక్షించనున్న ఇద్దరు లబ్ధిదారులు
Posted On:
11 AUG 2023 12:11PM by PIB Hyderabad
ఈ ఏడాది ఆగస్టు 15న ఎర్రకోటపై భారత ప్రధాని ఆవిష్కరించే స్వాతంత్ర్య దినోత్సవ పతాకావిష్కరణ కార్యక్రమంలో దేశం వివిధ ప్రాంతాలకు చెందిన దాదాపు 1,800 మంది ప్రత్యేక అతిథులుగా పాల్గొంటారు.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి ఈ ఏడాది 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా శక్తివంతమైన గ్రామాల సర్పంచులు, ఉపాధ్యాయులు, నర్సులు, రైతులు, మత్స్యకారులు, ఢిల్లీలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించిన కార్మికులు, ఖాదీ రంగ కార్మికులు, జాతీయ అవార్డు పొందిన పాఠశాల ఉపాధ్యాయులు, అమృత్ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొన్న సరిహద్దు రహదారుల సంస్థ కార్మికులు, దేశం వివిధ ప్రాంతాల్లో అమలు జరుగుతున్న హర్ ఘర్ జల్ యోజన ప్రాజెక్టుల నిర్మాణంలో పాల్గొంటున్న కార్మికులను ఈ ఏడాది న్యూఢిల్లీలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తమ జీవిత భాగస్వామితో కలిసి పాల్గోవాలని ప్రభుత్వం ఆహ్వానించింది.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం (పిఎం-కిసాన్) కింద లబ్ది పొందిన మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన ఇద్దరు లబ్ధిదారులు 2023 ఆగస్టు 15న ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రత్యేక అతిథులుగా వీక్షించనున్నారు. వీరితో పాటు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద లబ్ధి పొందిన 50 మంది లబ్ధిదారులకు ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగాన్ని వినడానికి ఆహ్వానం అందింది. దేశవ్యాప్తంగా ఆధ్వానాలు అందిన 1,800 మంది లో మహారాష్ట్రకు చెందిన లబ్ధిదారులు ఉన్నారు.
'జన్ భాగీ దారి' కార్యక్రమం స్ఫూర్తికి అనుగుణంగా దేశం వివిధ ప్రాంతాలకు చెందిన అన్ని వర్గాలకు చెందిన ప్రజలను ఆహ్వానించి వేడుకల్లో వారిని భాగస్వామ్యులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. .
స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఎర్రకోటలో జరిగే కార్యక్రమంలో పాల్గొనడానికి ఆహ్వానం అందిన పుణె జిల్లా బారామతిలోని ధేకల్వాడికి చెందిన 54 ఏళ్ల అశోక్ సుదమ్ ఘులే తనకు లభించిన అవకాశం పట్ల హర్షం వ్యక్తం చేశారు. "నేను న్యూఢిల్లీలోని ఎర్రకోటకు వెళ్లగలను అని ఎప్పుడూ ఊహించలేదు. స్వాతంత్ర్య దినోత్సవ రోజున ఢిల్లీ వెళ్లడం అంటే కల సాకారం అయినట్టే" అని అశోక్ సుదమ్ ఘులే అన్నారు. అయిన 1.5 ఎకరాల భూమిలో చెరకు సాగు చేస్తున్న ఘులే పీఎం కిసాన్ లబ్దిదారు.
థానే జిల్లా ముర్బాద్ లోని వైశాఖఖరేకు చెందిన మరో లబ్ధిదారుడు విజయ్ గోతీరాం కు కూడా ఆహ్వానం అందింది. విజయ్ గోతీరాం కూరగాయలు, వరి పండిస్తున్నారు. 2019 నుంచి ఆయన పీఎం కిసాన్ పథకం కింద లబ్ధి పొందుతున్నారు. తన సతీమణితో కలిసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు తిలకించడానికి ప్రత్యేక అతిథిగా ఢిల్లీ వెళ్లే అవకాశం లభించినందుకు కృతజ్ఞతలు తెలిపారు
కేంద్ర రంగ పథకంగా పీఎం-కిసాన్ పథకం అమలు జరుగుతోంది. కొన్ని మినహాయింపు ప్రమాణాలకు లోబడి దేశవ్యాప్తంగా అన్ని సాగుభూమి రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం లక్ష్యంగా పథకం అమలు జరుగుతోంది. ఈ పథకం కింద ఏటా రూ.6,000/- మొత్తాన్ని మూడు సమాన వాయిదాలలో రూ.2,000/- నేరుగా రైతుల ఆధార్ సీడెడ్ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు
***
(Release ID: 1948038)
Visitor Counter : 145