మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
29 రాష్ర్టాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో 412 పోస్కో (ఇ-పోస్కో) ప్రత్యేక కోర్టులు సహా 758 ఫాస్ట్ ట్రాక్ కోర్సులు
Posted On:
09 AUG 2023 4:05PM by PIB Hyderabad
బాలలను లైంగిక నేరాల నుంచి కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం లైంగిన నేరాల నుంచి బాలల రక్షణ (పోస్కో) చట్టం 2012ని (తదుపరి 2019 సవరణ) రూపొందించింది. 18 సంవత్సరాల లోపు వయస్కులైన వారెవరైనా ఈ చట్టం కింద బాలలు అనే నిర్వచనంలోకే వస్తారు. బాలలపై లైంగిక అత్యాచారాల కేసులను సత్వరం విచారించేందుకు పోస్కో చట్టం 2012 ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసింది.
క్రిమినల్ నేరాల చట్టం (సవరణ) 2018 కింద న్యాయ శాఖ కేంద్ర స్పాన్సర్ షిప్ లోని పథకం కింద 2019 అక్టోబరులో దేశవ్యాప్తంగా 1023 ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టుల (389 పోస్కో కోర్టులు సహా) ఏర్పాటుకు కేంద్రప్రభుత్వ స్పాన్సర్ షిప్ లోని పథకం ఒకటి ప్రారంభించింది.
2023 మే 31 నాటికి దేశంలోని 29 రాష్ర్టాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో 412 పోస్కో (ఇ-పోస్కో) కోర్టులు సహా 758 ఎఫ్ టిఎస్ సిలు పని చేస్తున్నాయి. 2023 మే నాటికి అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం స్కీమ్ ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటికి ఈ కోర్టులు 1,69,342 కేసులు పరిష్కరించాయి.
జాతీయ న్యాయ సేవల సంస్థ నుంచి అందిన సమాచారం ప్రకారం రాష్ర్టాలు/జిల్లా స్థాయి న్యాయ సేవలు పరిహారం చెల్లింపు సేవలందిస్తున్నాయి. ఎలాంటి జాప్యం లేకుండా బాధితులకు నష్టపరిహారం చెల్లింపునకు వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నాయి.
ఎస్ఎల్ఎస్ఏ నుంచి అందిన గణాంకాల ప్రకారం సిఆర్ పిసి 357ఎ సెక్షన్ కింద బాధితులకు నష్టపరిహారం పథకాల కింద దేశంలోని న్యాయ సేవల సంస్థలు వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాల్లో చెల్లించిన పరిహారం వివరాలు ఇలా ఉన్నాయి...
సంవత్సరాలు
|
న్యాయ సర్వీసుల సంస్థ నేరుగా అందుకున్న దరఖాస్తులు (ఎ)
|
ఏ కోర్టు అయినా మార్క్ చేసిన దరఖాస్తులు/ఆర్డర్లు/ఆదేశాలు (బి)
|
కోర్టు ఆర్డర్లు సహా అందుకున్న దరఖాస్తులు (ఎ+బి)
|
పరిష్కరించిన దరఖాస్తులు
|
అందించిన నష్టపరిహారం(రూపాయల్లో)
|
2020-21
|
8765
|
4050
|
12815
|
9786
|
14,56,23,601
|
2021-22
|
8715
|
8267
|
16982
|
15173
|
22,18,74,742
|
2022-23
|
15196
|
14740
|
29936
|
20900
|
33,78,03,735
|
|
|
|
|
|
|
|
ప్రభుత్వం పోస్కో నిబంధనలు 2020ని కూడా నోటిఫై చేసింది. పోస్కో నిబంధనల్లోని 9వ నిబంధన బాలల తరఫున అందిన దరఖాస్తు ఆధారంగా లేదా సొంతంగా అవసరమైన కేసుల్లో విచారణకు, వారి అవసరాల కోసం మధ్యంతర నష్టపరిహారం అందించేందుకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు లేదా ఎఫ్ఐఆర్ దాఖలు అనంతరం ఏ దశలో అయినా పునరావాసం చేపట్టడానికి వీలు కల్పించింది. ఇలా అందించే మధ్యంతర పరిహారాన్ని చివరి పరిహారంతో సద్దుబాటు చేసుకోవచ్చు.
పోస్కో నిబంధనల కింద ప్రత్యేక సహాయంగా ఆహారం, దుస్తులు, రవాణా, ఇతర నిత్యావసరాలు అందించవచ్చు. అలాగే ఆ దశలో మదింపు చేసిన మేరకు తక్షణ చెల్లింపునకు ఈ దిగువ విభాగాల నుంచి ఎంత సొమ్ము ఎంత చెల్లించాలనేది కూడా సిడబ్ల్యుసి సిఫారసు చేయవచ్చు.
i. 357ఎ సెక్షన్ కింద డిఎల్ఎస్ఏ
ii. రాష్ర్టం వద్ద అందుబాటులో ఉంచిన నిధుల కింద డిసిపియు లేదా
iii. జువెనైల్ జస్టిస్ (బాలల సంరక్షణ, పరిరక్షణ) చట్టం 2015 (2016లోని 2) సెక్షన్ 105 కింద నిర్వహిస్తున్న నిధులు
సిడబ్ల్యుసి నుంచి సిఫారసు అందుకున్న వారం రోజుల్లోగా ఈ తక్షణ చెల్లింపు చేయవచ్చు.
విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన పాఠశాల విద్యా విభాగం నుంచి అందిన సమాచారం ప్రకారం విద్యా విభాగం; ఆయా రాష్ర్టం, కేంద్రపాలిత ప్రాంతలోని అధిక శాతం పాఠశాలలు రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో చేర్చారు.
విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ 2018-19 నుంచి పాఠశాల విద్య కోసం ఇంటిగ్రేటెడ్ కేంద్ర స్పాన్సర్ పథకం-సమగ్ర శిక్ష ప్రారంభించారు. ఆ స్కీమ్ ను నూతన విద్యా విధానం (ఎన్ఇపి) 2020 సిఫారసులతో అనుసంధానం చేశారు. బాలలు వారి భిన్న నేపథ్యాలు, బహుళ భాషా అవసరాలు, విభిన్న విద్యా సామర్థ్యాలకు అనుగుణంగా సమాన, సమ్మిళిత పాఠశాల వాతావరణంలో నాణ్యమైన విద్య అందుకునేందుకు ఇది వీలు కల్పిస్తుంది. వారిని అభ్యాస విధానంలో క్రియాశీల భాగస్వాములను చేస్తుంది.
ఈ పథకం కింద పాఠశాల విద్య వదిలి వేసే బాలల సంఖ్య (ఒఒఎస్ సి) తగ్గించేందుకు రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వివిధ కార్యకలాపాలు చేపట్టేందుకు ఆర్థిక సహాయం కూడా అందిస్తారు. సీనియర్ సెకండరీ స్థాయి వరకు కొత్త పాఠశాలు తెరవడం/పటిష్ఠం చేయడం; పాఠశాల భవనాలు, అదనపు తరగతి గదుల నిర్మాణం; ప్రస్తుతం పని చేస్తున్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల నిర్వహణ, స్థాయి పెంపు; నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అవసీయ విద్యాలయాల ఏర్పాటు, ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ, రవాణా అలవెన్స్ అందించడం; నమోదు, రిటెన్షన్ కార్యకలాపాలు చేపట్టడం సహా వివిధ చర్యలు ఇందులో ఉన్నాయి.
పాఠశాల విద్య, రెసిడెన్షియల్ విద్య వదిలివేసిన బాలలకు వయసుకు తగినట్టు ప్రత్యేక ప్రవేశాలు కల్పించడం, వయసు పైబడిన పిల్లలకు నాన్ రెసిడెన్షియల్ శిక్షణ అందించడానికి; సీజనల్ హాస్టళ్లు/రెసిడెన్షియల్ శిబిరాల నిర్వహణ; రవాణా/ఎస్కార్ట్ సదుపాయాల ఏర్పాటుకు, నియత విద్యా విధానం నుంచి పాఠశాల విద్యార్థులను వెలుపలికి తీసుకురావడానికి వీలైన మద్దతు చర్యలు చేపట్టడానికి అవకాశం కల్పిస్తోంది. బాలల ప్రత్యేక అవసరాలకు దీటుగా ప్రత్యేక సహాయ చర్యలు చేపట్టడానికి; సహాయ సామగ్రి, అప్లయెన్స్ లు అందించడానికి; బెయిలీ కిట్లు, పుస్తకాలు, బోధనా పరికరాలు అందించడానికి; వైకల్యం గల బాలికా విద్యార్థులకు స్టైపెండ్ అందించడానికి కూడా అవకాశం ఉంది. అత్యాచారాలకు గురైన బాలలు సహా పాఠశాల విద్య వదిలివేసిన బాలలందరికీ ఈ సహాయం వర్తిస్తుంది.
దీనికి తోడు ‘‘ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్‘‘ (పిఎం పోషణ్) కింద ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ఒక వేడి భోజనం కూడా అందిస్తారు.
ఉచిత, నిర్బంధ విద్యకు (ఆర్ టిఇ) బాలల హక్కుల చట్టం సెక్షన్ 10 కింద ప్రతీ ఒక్క తల్లిదండ్రులు, సంరక్షకులు తమ బాలలు, సంరక్షకులను అడ్మిట్ చేయడం వారి బాధ్యత.
దీనికి తోడు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ పథకం కింద ఆర్థికంగా బలహీన వర్గాల్లోని విద్యార్థులకు ఎనిమిదో తరగతి స్థాయిలో డ్రాపౌట్లు తగ్గించడానికి, సెకండరీ స్థాయి విద్య కొనసాగించడానికి స్కాలర్ షిప్ లు అందిస్తారు.
దీనికి తోడు బాలలపై నేరాలు చేసిన వారికి, వారి చర్యలను ప్రోత్సహించే వారికి మరణ దండన సహా కఠిన శిక్షలు విధించడానికి వీలుగా నేరాల నుంచి బాలల సంరక్షణ (పోస్కో) చట్టం 2012ని సమీక్షించి 2019లో సవరించారు.
మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ రాజ్యసభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం అందచేశారు.
***
(Release ID: 1947402)
|