ఆర్థిక మంత్రిత్వ శాఖ
పీఎం స్వనిధి పథకం పురోగతిని అంచనా వేయడానికి డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్సర్వీసెస్(డీఎఫ్ఎస్), తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తమిళనాడు ప్రభుత్వంలోని ఇతర సీనియర్ అధికారులు, తమిళనాడు రాష్ట్రంలోని ప్రధాన బ్యాంకుల అధికారులు సంయుక్తంగా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
Posted On:
05 AUG 2023 4:09PM by PIB Hyderabad
ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి డాక్టర్ వివేక్ జోషి ఈరోజు చెన్నైలో తమిళనాడు చీఫ్ సెక్రటరీ తిరు శివ దాస్ మీనాతో కలిసి పీఎం స్వనిధి పథకం పనితీరును అంచనా వేయడానికి మరియు సమీక్షించడానికి సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించారు. బ్యాంకులు, అలాగే ఎస్‌హెచ్‌జి- బ్యాంక్ లింకేజ్ మరియు మైక్రో ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్‌లో తిరిగి వచ్చిన దరఖాస్తుల సంఖ్యను తగ్గించడం గురించి ఈ సమీక్ష సమావేశంలో చర్చించారు.
ఈ సమావేశానికి తమిళనాడు ప్రభుత్వ అదనపు కార్యదర్శి, డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్సర్వీసెస్(డీఎఫ్ఎస్) ఇండియన్ బ్యాంక్ మరియు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌ల మేనేజింగ్ డైరెక్టర్ లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, అదనపు చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, జాయింట్ కమిషనర్లు/ తమిళనాడు ప్రభుత్వం నుండి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్/ఇతర పట్టణ స్థానిక సంస్థల డైరెక్టర్లు మరియు తమిళనాడు ఎస్ఎల్బీసీకి చెందిన స్థానిక బ్యాంకు అధిపతులు పాల్గొన్నారు.
సెక్రటరీ (ఆర్థికశాఖ కార్యదర్శి) ప్రధానంగా బ్యాంకులు తిరిగి ఇచ్చే అధిక సంఖ్యలో దరఖాస్తులపై దృష్టి సారించారు. అంతేకాకుండా తదుపరి మంజూరు మరియు పంపిణీ కోసం దరఖాస్తులలోని లోపాలను సరిచేయడానికి యూఎల్బీలు మరియు బ్యాంకులు కలిసి కూర్చుని తిరిగి వచ్చిన దరఖాస్తులను సమీక్షించాలని కోరారు. డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్సర్వీసెస్(డీఎఫ్ఎస్) ఇప్పటికే స్పష్టం చేసిన విధంగా, తక్కువ సిబిల్ స్కోర్‌పై మాత్రమే దరఖాస్తులను తిరిగి ఇవ్వవద్దని అతను బ్యాంకర్లను సూచించారు.
బ్యాంకులతో సన్నిహిత సమన్వయంతో పీఎం స్వనిధి పథకం కింద నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి తాజా దరఖాస్తులను సమీకరించాలని తిరు మీనా అన్ని యూఎల్బీలను ఆదేశించారు.
చిన్న రుణగ్రహీతలకు ప్రయోజనం చేకూర్చేలా సదుద్దేశంతో రుణాలను మంజూరు చేయాలని డాక్టర్ జోషి బ్యాంకులకు సూచించారు. అంతేకాకుండా ఈ రుణాలు ఇప్పటికే భారత ప్రభుత్వ క్రెడిట్ గ్యారెంటీ పథకం కింద సురక్షితంగా ఉన్నాయని గుర్తించారు.
పీఎం స్వనిధి కింద రుణాల యొక్క శీఘ్ర మరియు సానుకూల ప్రాసెసింగ్ యొక్క ప్రాముఖ్యతను శాఖ స్థాయిలో కూడా ప్రచారం చేయాలి. పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు బ్యాంకులకు చెందిన సీనియర్ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలి.
పీఎం స్వనిధి పథకంపై అప్‌డేట్:
ప్రధానమంత్రి స్వనిధి పథకం వీధి వ్యాపారుల ఆర్థికాభివృద్ధికి సరసమైన క్రెడిట్ మరియు డిజిటల్ ఆన్‌బోర్డింగ్‌కు అవాంతరాలు లేని యాక్సెస్ ద్వారా వారి సాధికారతను అందిస్తుంది.
వీధి వ్యాపారులకు క్రెడిట్ మద్దతును అందించడంలో ఈ పథకం గణనీయమైన పురోగతిని కొనసాగిస్తోంది. పథకం పనితీరును హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్సర్వీసెస్(డీఎఫ్ఎస్) సంయుక్తంగా క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తుంది. ఇది దేశవ్యాప్తంగా దాని ప్రభావవంతమైన అమలును నిర్ధారించడానికి. జూలై 31, 2023 నాటికి 54.40 లక్షల దరఖాస్తులు మంజూరు కాగా, 51.46 లక్షల దరఖాస్తులకు రూ. 6,623 కోట్ల రుణాలను అందజేశారు.
****
(Release ID: 1946661)
Visitor Counter : 101