ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఎంఇఐటివై చొరవ సైబర్ సురక్షిత్ భారత్ కింద 39వ సిఐఎస్ఒ డీప్ డైవ్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించిన ఎన్ఇజిడి
Posted On:
07 AUG 2023 7:35PM by PIB Hyderabad
సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించడం, పెరుగుతున్న విపత్తుకు ఎదుర్కొనడానికి తగిన భద్రతా చర్యలను నిర్ధారించడం కోసం అన్ని ప్రభుత్వ శాఖలలోని ముఖ్య సమాచార భద్రతా అధికారులు (సిఐఎస్ఒలు), ఫ్రంట్‌లైన్ ఐటి అధికారుల సామర్ధ్యాలను పెంపొందించే లక్ష్యంతో ఎంఇఐటివై సైబర్ సురక్షిత్ భారత్ చొరవను రూపొందించింది. సంస్థలు తమ డిజిటల్ మౌలిక సదుపాయాలను కాపడుకొని, సైబర్ దాడులను ఎదుర్కోవడంలో భవిష్యత్ సంసిద్ధతను కలిగి ఉండాలన్నది కూడా దీని లక్ష్యం.
సామర్ధ్య నిర్మాణ పథకం కింద జాతీయ ఇ- గవర్నెన్స్ విభాగం (ఎన్ ఇజిడి) 7 నుంచి 11 ఆగస్టు 2023 వరకు కేంద్ర లైన్ మినిస్ట్రీల నుంచి వచ్చిన 25మంది ప్రతినిధులతో న్యూఢిల్లీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో 39వ సిఐఎస్ఒ డీప్- డైవ్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
ఈ కార్యక్రమాన్ని ఐఐపిఎ డైరెక్టర్ జనరల్ శ్రీ ఎస్.ఎన్. త్రిపాఠీ, ఎంఇఐటివై, సైబర్ సెక్యూరిటీ (సీనియర్ డైరెక్టర్) & గ్రూప్ కోర్డినేటర్ శ్రీమతి సవితా ఉత్రేజా, ఎన్ ఇజిడి, ఎంఇఐటివై, సామర్ధ్య నిర్మాణం, ఫైనాన్స్ డైరెక్టర్ శ్రీ రజనీష్ కుమార్, సైబర్ సెక్యూరిటీ సైంటిస్ట్ ఇ శ్రీ వినోద్ కుమార్ చౌహాన్, ఐఐపిఎ కోర్స్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ చారు మల్హోత్రా ప్రారంభించారు.
సైబర్ ప్రతిఘాతక పర్యావరణ వ్యవస్థను రూపొందించడం కోసం తీసుకోవలసిన చర్యలపై ప్రభుత్వ విభాగాలకు అవగాహన కల్పించడం, సామర్ధ్యాన్ని నిర్మించడం, తోడ్పడం ఈ కార్యక్రమ ఉద్దేశ్యం. ఈ కార్యక్రమం పౌరులకు వివిధ ప్రభుత్వ సేవలను సమగ్రంగా బట్వాడా చేసేందుక డిజిటల్ ఇండియాను ముందుకు తీసుకువెళ్ళేందుకు సైబర్ భద్రత, రక్షణల పట్ల పాల్గొన్న వారికి వారిని సున్నితం చేసి, అవగతం చేయడం ,సైబర్ భద్రతపై సమగ్ర సమాచారాన్ని, విజ్ఞానాన్ని, అవగాహనను అందించి, చైతన్యాన్ని వ్యాప్తి చేసి, సామర్ధ్యాలను నిర్మించడమే కాక ప్రభుత్వ విభాగాలు తమ సైబర్ పారిశుద్ధ్యాన్ని, భద్రతను, రక్షణ తోడ్పడడం కార్యక్రమ లక్ష్యం.
పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి) నమూనాలో ప్రభుత్వం, పరిశ్రమల కన్సార్షియం (సహాయతా సంఘం) తో 2018లో ప్రారంభించిన సిఐఎస్ఒ శిక్షణ అన్నది ఇటువంటి ఉత్తమ భాగస్వామ్యం. జూన్ 2018 నుంచి ఆగస్టు 2023 వరకు ఎన్ఇజిడి 1,489 సిఐఎస్ఒలు, ఫ్రంట్‌లైన్ ఐటి అధికారుల కోసం 39 బ్యాచ్‌ల సిఐఎస్ఒ డీప్-డైవ్ శిక్షణా కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహించింది.
***
(Release ID: 1946608)
Visitor Counter : 132