బొగ్గు మంత్రిత్వ శాఖ
2020లో ప్రారంభించబడిన వాణిజ్య వేలం కింద ఇప్పటివరకు ఏడు రాష్ట్రాలకు చెందిన 86 బొగ్గు గనులు వేలం
Posted On:
07 AUG 2023 3:47PM by PIB Hyderabad
2020 జూన్ నెలలో గౌరవనీయులైన ప్రధాన మంత్రి వాణిజ్య వేలం పథకాన్ని ప్రారంభించినప్పటి నుండి బొగ్గు మంత్రిత్వ శాఖ దేశ వ్యాప్తంగా బొగ్గు బ్లాకుల వాణిజ్య వేలాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు 86 బొగ్గు గనులను వాణిజ్య బొగ్గు గనుల వేలం కింద విజయవంతంగా వేలం వేయబడ్డాయి. అటువంటి వేలం నుండి ఇప్పటి వరకు రాష్ట్రాల వారీగా వచ్చిన ఆదాయ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
రాష్ట్రాల వారీగా, వాణిజ్య ప్రయోజనం కోసం వేలం వేయబడిన గనుల నుండి ముందస్తు మరియు నెలవారీ చెల్లింపు ద్వారా వచ్చే ఆదాయం (రూ. కోట్లలో)
|
రాష్ట్రం
|
ఆదాయం
(2020-21)
|
ఆదాయం
(2021-22)
|
ఆదాయం
(2022-23)
|
చత్తీస్ గఢ్
|
28.786
|
14.93
|
481.542
|
జార్ఖండ్
|
35.341
|
2.255
|
38.244
|
మధ్య ప్రదేశ్
|
0
|
225.371
|
20.391
|
మహారాష్ట్ర
|
0
|
52.964
|
8.993
|
ఒడిషా
|
38.764
|
125
|
109.302
|
పశ్చిమ బెంగాల్
|
0
|
0
|
18.6
|
అస్సోం
|
0
|
0
|
0.185
|
మొత్తం
|
102.891
|
420.52
|
677.257
|
Tక్యాప్టివ్ ఎండ్ యూజ్ల నిమిత్తం కమర్షియల్ మైనింగ్ సైన్ 2017 కోసం బొగ్గు మంత్రిత్వ శాఖ మొత్తం 99 బొగ్గు గనులను వేలం వేసింది. అన్ని గనులు ఆపరేషన్ ప్రారంభించడానికి కష్టపడుతున్నాయని చెప్పడం సరికాదు. బొగ్గు మంత్రిత్వ శాఖ యొక్క చురుకైన మరియు సమన్వయ విధానం కారణంగాను మరియు రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుతో, 55 గనులకు గనుల నిర్వహణ అనుమతి లభించింది. బొగ్గు గనులు/ బ్లాక్ అభివృద్ధి మరియు వాణిజ్య బొగ్గు గనుల ఉత్పత్తి ఒప్పందం ప్రకారం నామినేటెడ్ అథారిటీ, బొగ్గు మంత్రిత్వ శాఖ మరియు విజయవంతమైన బిడ్డర్ల మధ్య అమలు చేయబడిన వాణిజ్య బొగ్గు గనుల వేలం ప్రకారం, బొగ్గు బ్లాకులను అమలు చేయడానికి వెస్టింగ్ ఆర్డర్ తేదీ నుండి 9 నెలల షెడ్యూల్ II బొగ్గు గనులకు మంజూరు చేయబడింది. షెడ్యూల్-II గనులు కాకుండా ఇతర గనులకు పూర్తిగా అన్వేషించిన బొగ్గు గనులకు 51 నెలలు మరియు పాక్షికంగా అన్వేషించిన బొగ్గు గనులకు 66 నెలలు మంజూరు చేయబడ్డాయి. అయితే, కొన్ని వాణిజ్య గనులు నిర్ణీత సమయానికి ముందే పని చేస్తున్నాయి. కేంద్ర బొగ్గు, గనులు మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
****
(Release ID: 1946555)