మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సైన్స్ & టెక్నాలజీని ప్రోత్సహించడానికి మరియు పరిశోధన పర్యావరణ వ్యవస్థను పెంపొందించడానికి ప్రభుత్వం రీసెర్చ్ పార్క్‌ను ప్రారంభిస్తోంది.

Posted On: 07 AUG 2023 4:24PM by PIB Hyderabad

దేశంలో పరిశోధనా పర్యావరణ వ్యవస్థను పెంపొందించేందుకు ఐఐటీ మద్రాస్, ఐఐటీ బాంబే, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ గౌహతి, ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ గాంధీనగర్ మరియు ఐఐఎస్‌సీ బెంగళూరులో రీసెర్చ్ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఖరగ్‌పూర్ మరియు ఐఐటీ ఢిల్లీలోని రీసెర్చ్ పార్కులు పని చేస్తున్నాయి మరియు మరికొన్ని పూర్తి అయ్యేదశలో ఉన్నాయి. అగ్రశ్రేణి పరిశ్రమలతో పరిశోధన సహకారం, విద్యార్ధుల పారిశ్రామిక వ్యవస్థాపకత, ప్రగతి సహకారం  అందుకోసం బలమైన విద్యా సంబంధాలను నిర్మించడం, పరిశ్రమకు విద్యారంగ కంటెంట్   మరియు విద్యారంగానికి విలువను జోడించడానికి పరిశ్రమలను ప్రారంభించడం సన్నిహిత సహకారాలు మొదలైనలవి ఈ రీసెర్చ్ పార్క్   యొక్క ప్రధాన లక్ష్యాలు.  రీసెర్చ్ పార్కుల యొక్క వివిధ లక్ష్యాలను సాధించడానికి, ఇవి సాధారణంగా దేశంలోని ఉన్నత విద్యా సంస్థలలో స్థాపించబడతాయి.

 

ఈరోజు లోక్‌సభలో విద్యాశాఖ సహాయ మంత్రి డాక్టర్ సుభాస్ సర్కార్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

 

***


(Release ID: 1946554) Visitor Counter : 139