పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
ప్రయాణీకులకు సౌలభ్యాన్ని పెంచేందుకు పలు చర్యలు
ఢిల్లీ & ముంబై విమానాశ్రయాలలో సగటు నెలవారీ ప్రయాణీకుల నిర్వహణ సామర్థ్యం వరుసగా 74 మిలియన్లు మరియు 60 మిలియన్లుగా ఉంది
మొదటి దశలో డిజి యాత్ర ఢిల్లీ, బెంగళూరు, వారణాసి, కోల్‌కతా, పూణె, విజయవాడ & హైదరాబాద్ విమానాశ్రయాలలో ప్రారంభించబడింది.
Posted On:
07 AUG 2023 2:35PM by PIB Hyderabad
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్లలో భారతదేశం ఒకటి. ఇప్పటికే మూడవ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా ఉంది. ప్రస్తుతం దేశంలో 30 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. 2022-23 సంవత్సరానికి అంతర్జాతీయ విమానాశ్రయాల సగటు నెలవారీ ఫుట్‌ఫాల్ మరియు వార్షిక ప్రయాణీకుల నిర్వహణ సామర్థ్యం అనుబంధంలో ఉన్నాయి.
ఇప్పటికే ఉన్న టెర్మినల్స్‌లో మౌలిక సదుపాయాల మార్పుల ద్వారా సామర్థ్య పెంపుదల, సామాను తనిఖీ కోసం అదనపు ఎక్స్-రే యంత్రాల ఏర్పాటు మరియు కమీషన్, సిఐఎస్‌ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) ద్వారా అదనపు సిబ్బందిని మోహరించడం, ఎయిర్‌లైన్స్ మరియు ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లు, స్లాట్ కేటాయింపుల నిర్వహణ, విమానాల గుంపులను నివారించడానికి ఎయిర్‌లైన్స్‌తో సమన్వయం వంటి చర్యల ద్వారా ప్రయాణీకులకు ప్రయాణ సౌలభ్యాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. వీటితో పాటు విమానాశ్రయాలలో ప్రయాణీకులకు ఇబ్బందులు మరియు అవాంతరాలు లేని ప్రయాణ అనుభవాన్ని అందించడానికి బయోమెట్రిక్ ఆధారిత ప్రయాణం కోసం ప్రభుత్వం డిజి యాత్రను ప్రారంభించింది. తొలి దశలో ఢిల్లీ, బెంగళూరు, వారణాసి, కోల్‌కతా, పూణె, విజయవాడ, హైదరాబాద్ విమానాశ్రయాల్లో డిజి యాత్రను ప్రారంభించారు.
విమానాశ్రయాలలో మౌలిక సదుపాయాలు/సౌకర్యాల అప్‌గ్రేడేషన్ అనేది ఆపరేషనల్ అవసరాలు, ట్రాఫిక్, డిమాండ్, వాణిజ్య సాధ్యత మొదలైన వాటిపై ఆధారపడి ఏఏఐ లేదా సంబంధిత ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లచే నిర్వహించబడే ఒక నిరంతర ప్రక్రియ. అంతేకాకుండా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రాంతీయ కనెక్టివిటీ పథకాన్ని (ఆర్‌సిఎస్) ప్రారంభించింది. ప్రాంతీయ విమాన కనెక్టివిటీని ఉత్తేజపరిచేందుకు మరియు సామాన్యులకు విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు 21.10.2016న ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకాన్ని ప్రారంభించింది. అంతేకాకుండా ఏఏఐ మరియు ఇతర పిపిపి ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్‌లు 2019-24లో ఏఏఐ ద్వారా దాదాపు రూ.25,000 కోట్లతో సహా మొత్తం రూ.98,000 కోట్లకు పైగా మొత్తాన్ని ప్రయాణీకుల పెరుగుదల మరియు విమాన ప్రయాణాన్ని సురక్షితమైన, సౌకర్యవంతమైన మరియు కస్టమర్ ఫ్రెండ్లీగా చేయడానికి బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయాల అభివృద్ధి/అప్‌గ్రేడేషన్/ఆధునీకరణ మరియు గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలను అభివృద్ధి చేయడం కోసం కాపెక్స్ ప్లాన్‌ను ప్రారంభించారు.
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జనరల్ (డాక్టర్) వి.కె. సింగ్ (రిటైర్డ్) ఈరోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
****
వైబి/డిఎన్ఎస్/పిఎస్
అనుబంధం
అంతర్జాతీయ విమానాశ్రయాలలో 2022-23 ( మిలియన్లలో ) సగటు నెలవారీ ప్రయాణీకుల & వార్షిక ప్రయాణీకుల నిర్వహణ సామర్థ్యం
|
క్ర.సంఖ్య.
|
విమానాశ్రయం
|
సగటు నెలవారీ ప్రయాణీకులు
|
వార్షిక ప్యాసింజర్ హ్యాండ్లింగ్ కెపాసిటీ
|
1
|
ఢిల్లీ (డయల్)
|
5.44
|
74.00
|
2
|
ముంబై (మెయిల్)
|
3.66
|
60.00
|
3
|
బెంగళూరు (బెయిల్)
|
2.66
|
51.50
|
4
|
హైదరాబాద్ (ఘియల్)
|
1.75
|
21.60
|
5
|
చెన్నై
|
1.55
|
23.00
|
6
|
కోల్‌కతా
|
1.48
|
26.00
|
7
|
అహ్మదాబాద్
|
0.84
|
10.84
|
8
|
కొచ్చిన్(సియాల్)
|
0.73
|
25.00
|
9
|
గోవా
|
0.70
|
11.30
|
10
|
లక్నో
|
0.44
|
5.55
|
11
|
గౌహతి
|
0.42
|
5.00
|
12
|
జైపూర్
|
0.40
|
3.50
|
13
|
శ్రీనగర్
|
0.37
|
3.00
|
14
|
భువనేశ్వర్
|
0.30
|
4.40
|
15
|
త్రివేండ్రం
|
0.29
|
4.50
|
16
|
కాలికట్
|
0.25
|
6.60
|
17
|
నాగపూర్
|
0.21
|
4.00
|
18
|
కోయంబత్తూరు
|
0.21
|
3.63
|
19
|
వారణాసి
|
0.21
|
2.50
|
20
|
అమృతసర్
|
0.21
|
4.00
|
21
|
మంగళూరు
|
0.15
|
2.00
|
22
|
తిరుచ్చి
|
0.13
|
1.50
|
23
|
పోర్ట్‌బ్లెయిర్
|
0.11
|
0.70
|
24
|
కన్నూర్(కియల్)
|
0.10
|
9.00
|
25
|
ఇంఫాల్
|
0.10
|
1.39
|
26
|
విజయవాడ
|
0.08
|
2.03
|
27
|
తిరుపతి
|
0.08
|
2.50
|
28
|
షిర్డీ
|
0.06
|
0.50
|
29
|
గోవా (మోపా)
|
0.06
|
4.40
|
30
|
కుషినగర్
|
0.002
|
0.30
|
(Release ID: 1946546)
Visitor Counter : 105