సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గ్రంధాలయాలు ఉమ్మడి చైతన్యానికిప్రతీకలుగా,దేశం,సమాజం మేధస్సుకు చిహ్నంగా పరిగణింపబడతాయి : రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము.


విజ్ఞానఖనిగా భారత్ ప్రస్థానాన్ని ప్రతిబింబించే గ్రంథాలయ ఉత్సవాలను ప్రారంభించిన రాష్ట్రపతి.

ఇండియాను విజ్ఞాన రంగంలో సూపర్ పవర్గా తీర్చిదిద్దే లక్ష్యం దిశగా పడిన ముందడుగు గ్రంథాలయ ఉత్సవాలు : శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్.

గ్రంథాలయాల అభివృద్ధి చేయాలన్న ప్రధానమంత్రి దార్శనికతను ముందుకు తీసుకుపోవడానికి, దేశం నలుమూలలకు చేరడానికి , పఠన సంస్కృతి మరింత పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. : శ్రీమతి మీనాక్షి లేఖి.

కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కోరిన వెంటనే గ్రంథాల సూచీ సేవను కూడా ప్రారంభించింది. ఇది సకాలంలో తీసుకున్నపరివర్తనాత్మక చర్య. ఇది దేశంలో పరిశోధనలకు అనువైన పరిస్థితులను కల్పిస్తుంది.

Posted On: 05 AUG 2023 5:25PM by PIB Hyderabad

రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గ్రంథాలయ ఉత్సవాలను 2023 ఆగస్టు 06న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ ఉత్సవాలను కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ నిర్వహిస్తోంది . గ్రంథాలయాలను డిజిటలైజ్ చేయడం,
పఠన సంస్కృతిని పెంపొందించే లక్ష్యంతో ఈ ఉత్సవాలను  నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, గ్రంథాలయాల అభివృద్ధి సమాజం, సంస్కృతుల అభివృద్ధితో సంబంధం కలిగి ఉంటుందని అన్నారు.
చరిత్రలో  ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని అంటూ రాష్ట్రపతి,  దురాక్రమణదారులు, గ్రంథాలయాలను ధ్వంసం చేయడం అవసరమని భావించారన్నారు. దీనిని బట్టి  గ్రంథాలయాలు, దేశ, సమాజ ఉమ్మడి చైతన్యానికి,
మేథస్సుకు గుర్తుగా పరిగణించేవారన్న విషయం బోధపడుతున్నదని రాష్ట్రపతి అన్నారు. ఆధునిక యుగంలో ఇలాంటి ఘటనలు జరగవని అయిత, అరుదైన రాతప్రతులు, గ్రంథాలు కనిపించకుండా పోతున్న ఘటనలు ఉన్నాయన్నారు.
ఇలాంటి అరుదైన గ్రంథాలు, రాతప్రతులను తిరిగి తెప్పించేందుకు కృషి చేయవచ్చని అన్నారు.

గ్రంథాలయాలు నాగరికతల మధ్య వారధిగా నిలుస్తాయని రాష్ట్రపతి అన్నారు. ప్రాచీన, మధ్యయుగాల కాలంంలో ఎన్నో దేశాలకు చెందిన ప్రజలు ఇండియానుంచి గ్రంథాలు తీసుకువెళ్లారని, వాటిని అనువదించుకుని విజ్ఞానం పొందారని తెలిపారు.
ఇలాంటి కృషిని బట్టి, గ్రంథాలయాలు, గ్రంథాలు మానవాళి ఉమ్మడి వారసత్వ సంపదగా నిలుస్తాయన్నారు. ఒక చిన్న పుస్తకం ప్రపంచ గతిని  మార్చే శక్తి కలిగి ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా  రాష్ట్రపతి గాంధీజీ ఆత్మకథను ప్రస్తావించారు.
అందులో  అన్ టు దిస్ లాస్ట్ పేరుతో జాన్ రస్కిన్ రాసిన  పుస్తకం తనపై ఎంతటి ప్రభావం చూపిందో  తెలిపారని అన్నారు. గ్రంథాలు మట్టిపరిమళాలు,ఆశాకమంత విస్తృతి కలిగి ఉంటాయని అన్నారు.

 

కేంద్ర సాంస్కృతిక,న్యాయ, చట్ట శాఖ సహాయమంత్రి శ్రీ అర్జున్ రామ్, సాంస్కృతిక, విదేశీవ్యవహారాలశాఖ సహాయమంత్రి
శ్రీమతి మీనాక్షి లేఖి, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ గోవింద్ మోహన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈసందర్భంగా మాట్లాడుతూ శ్రీ మేఘవాల్, లైబ్రరీల ఉత్సవం దేశాన్ని 21 వ శతాబ్దపు ప్రపంచంలో
 మేథో సూపర్పవర్గా తీర్చిదిద్దే దిశగా పడిన ముందడుగుగా తెలిపారు. దేశంలోని నలుమూలలకూ
గ్రంథాలయాలను తీసుకెళ్లడంతోపాటు, ప్రధానమంత్రి దార్శనికత అయిన లైబ్రరీల అభివృద్ధి, పఠన  సంస్కృతిని పెంపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీమతి మీనాక్షి లేఖి తెలిపారు.
లైబ్రరీల ఉత్సవం 2023 ఈదిశగా కీలక ముందడుగుగా తెలిపారు.

‘‘2023 గ్రంథాలయ ఉ త్సవం సమగ్ర, విజ్ఞానం ప్రజలకు అందుబాటులో వచ్చేందుకు కీలకపాత్ర వహిస్తుంది.
వైవిధ్యతతో కూడిన విజ్ఞానం,పఠన అలవాట్లను పెంపొందించడం ద్వారా ఈ ఉత్సవం సమాజ సాధికారతకు ఎంతగానో దోహదపడుతుందన్నారు.
ఇలాంటివి విజ్ఞాన సముపార్జనకు, దేశ అభివృద్ధికి ప్రేరణ కలిపించేందుకు ఎంతగానో దోహదం చేస్తాయని ఆమె తెలిపారు. ”
కేంద్ర సాంస్కృతిక శాఖ సంయుక్త కార్యదర్శి, శ్రీమతి ముగ్ధా సిన్హా మాట్లాడుతూ, ఈ గ్రంథాలయ ఉత్సవం, గ్రంథాలయాల ఆధునీకరణ,  ఇండియాలో మళ్లీ పాఠకులను పెద్ద ఎత్తున ప్రోత్సహించడంపై చర్చకు నిర్దేశించినదని అన్నారు. ఇందుకు సంబంధించి కార్యాచరణతో కూడిన విధానాలను, ఉత్సవాలను నిర్వహిస్తఉన్నట్టు తెలిపారు.గ్రామస్థాయిలో, కమ్యూనిటీ స్థాయిలో ఆదర్శ గ్రంథాలయాలను ఏర్పాటు చేసేందుకు కార్యచరణకు ఈ ఉత్సవాలు ఉపకరిస్తాయని, తద్వారా దేశం నలుమూలలకు విజ్ఞాన వ్యాప్తి జరుగుతుందని అన్నారు.
2023 గ్రంధాలయ ఉత్సవాల తొలి రోజున ఎన్నో ముఖ్యమైన నిర్ణయాలు జరిగాయి. అవన్నీ దేశంలో విజ్ఞాన వ్యాప్తికి, గ్రంధాలయాల వ్యాప్తికి నిర్దేశించినవి.  రాంపూర్‌ రాజా 250 సంవత్సరాల గ్రంథాలయ ఉత్సవాలు ఈ సందర్భగా ఒక ప్రత్యేక విశేషం గా చెప్పుకోవచ్చు.ఈ గ్రంథాలయం అందించిన సేవలు ఎంతో గొప్పవి. దీనికి సమున్నత చారిత్రక ప్రాధాన్యత ఉంది.
ఈ ఈవెంట్‌ సందర్భంగా ఆర్‌.ఆర్‌.ఆర్‌.ఎల్‌ ఆధునీకరణ, రాంపుర్‌ రాజా మిస్టరీ (శాస్సీ లైబ్రరీ థ్రిల్లర్‌ సీరిస్‌) వంటి వాటిని ప్రదర్శించారు. దీనికి తోడు రాంపూర్‌, పాట్నా, టోంక్‌ స్వర్ణ త్రిభుజి గ్రంథాలయాలకు  సంబంధించి
ఎం.ఒ.యు కుదుర్చుకునేందుకు ఒక సమన్వయ కమిటీ ఏర్పాటైంది. 

అలాగే అక్షర మ్యూజియం పేరుతో ఒక మ్యూజియంను ఎలక్ట్రానిక్‌ పద్దతిలో ఆవిష్కరించారు. రాతపూర్వక విజ్ఞానానికి సంబంధించిన పరిణామ క్రమం చర్చించేందుకు ఒక ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ఫారం ను ఏర్పాటుచేశారు.
  దేశవ్యాప్తంగా గల అద్భుత గ్రంథాలయాలను గుర్తించేందుకు,  లైబ్రరీ ర్యాంకింగ్‌ ఫార్మెట్‌ ను ప్రవేశపెట్టారు.  డైరక్టరీ ఆఫ్‌ లైబ్రరీస్‌ (వాల్యూం 1) పాఠకుల సంఖ్యను పెంచడం, దేశవ్యాప్తంగా గ్రంథాలయాలకు వచ్చే వారి సంఖ్యను పెంచే లక్ష్యంతో తీసుకువచ్చారు. దీనికి తోడు, గ్రంధసూచీని అడిగినవెంటనే సమకూర్చేలా , కోరిన పుస్తకం ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు వెంటనే వీలు కల్పించే బిబిలియొ ఆన్‌ డిమాండ్‌ సేవను ప్రారంభించారు.
గ్రంథాలయ ఉత్సవాల తొలి రోజున ఢల్లీి పబ్లిక్‌ లైబ్రరీలల ఆధునీకరణను దృశ్యమాధ్యమం ద్వారా ప్రారంభించారు.అలాగే ఢల్లీి ఆధునిక ప్రజా గ్రంధాలయాలులో పాఠకులకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతున్నారు. దీని ద్వారా పాఠకులు మరింత మెరుగైన సేవలు పొందుతారు. ఈ కార్యక్రమాలతో ఇండియా సాంకేతికతను ఉపయోగించి, సంస్కృతిని పరిరక్షించడంతోపాటు, పౌరులకు విజ్ఞానం అందించడం ద్వారా సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నది స్పష్టమైంది.
రెండో రోజు జరిగిన గ్రంథాలయ ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి శ్రీజగదీప్‌ ధన్‌ఖర్‌ విచ్చేస్తున్నారు. ఈ ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా గల గొప్పలైబ్రరీలను తెలియజేడంతోపాటు, గ్రంధాలయాల ఆధునీకరణ, ఇండియాలో డిజిటలైజేషన్‌ వంటి వాటిపై చర్చలను కొనసాగించడం జరుగుతుంది.2023 గ్రంథాలయ ఉత్సవాలు , గ్రంథాలయాల ప్రాధాన్యతను ప్రముఖంగా తెలియజేయడంతోపాటు, విజ్ఞాన దీపికలుగా, జ్ఞాన స్తంభాలుగా అవి సాగిస్తున్న కృషిని కళ్లకు కట్టాయి. పాఠక సంస్కృతిని పెంపొందించడం ద్వారా, గ్రంథాలయాల మౌలిక సదుపాయాలను పెంపొందించడం ద్వారా ఇండియా , విజ్ఞాన ప్రపంచంలో నాయకత్వం వహించగలదు.

 

***


(Release ID: 1946404) Visitor Counter : 217