వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సెంట్రల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ (సీటీఐలు), స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ (ఏటీఐలు)తో పీఎం గతిశక్తి ఎన్ఎంపిపై వెబ్‌నార్

Posted On: 05 AUG 2023 4:30PM by PIB Hyderabad

లాజిస్టిక్స్ విభాగం, పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్యం (డీపీఐఐటీ), వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తో పాటు కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ (సీబీసీ) 27 సెంట్రల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు (సీటీఐలు), 34 స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లతో (ఏటీఐలు) నిన్న వెబ్‌నార్‌ను నిర్వహించాయి. ఈ ఇన్‌స్టిట్యూట్‌లన్నింటిలో శిక్షణ పొందుతున్న ప్రభుత్వోద్యోగులకు పీఎం గతిశక్తి విధానంపై శిక్షణ, సామర్థ్యాన్ని పెంపొందించడానికి సంస్థాగతీకరించడానికి, క్రమబద్ధీకరించడానికి తగు మార్గాలు ఈ కార్యక్రమంలో చర్చించారు. వెబ్‌నార్‌లో, పీఎం గతి శక్తి హేతుబద్ధత, భావనను వివరించడంతో పాటు, వినూత్న ఉపయోగాలు కూడా ప్రదర్శించారు. .

వెబ్‌నార్‌లో మూడు సెషన్‌లు ఉన్నాయి. బిఐఎస్ఏజి-ఎన్ ద్వారా పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ద్వారా  విధానాన్ని ఆవిష్కరించడంపై తొలి  దృష్టి సారించింది. రెండవ సెషన్ పీఎం గతి శక్తిని ఉపయోగించి సంపూర్ణ మౌలిక సదుపాయాల ప్రణాళిక కోసం మంత్రిత్వ శాఖలు అనుసరించిన పద్ధతులను ప్రదర్శించింది, రైల్వే మంత్రిత్వ శాఖ పీఎం గతి శక్తిని స్వీకరించడాన్ని వివరిస్తుంది. సీటీఐలు, ఏటీఐల కోర్సు పాఠ్యాంశాల్లో పీఎం గతి శక్తిని ఏకీకృతం చేయడానికి అన్ని రంగాల్లో,  మార్గాల్లో ప్రభుత్వ పనితీరుకు 'మొత్తం ప్రభుత్వ' విధానాన్ని ఊహించి, పీఎం గతి శక్తి సూత్రాలపై ప్రభుత్వ సేవకుల సామర్థ్యాన్ని పెంపొందించవలసిన అవసరాన్ని మూడవ సెషన్ ప్రముఖంగా ప్రస్తావించింది. 

బిసాగ్-ఎన్, సీబీసీ, నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ మినిస్ట్రీలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 27 సెంట్రల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు (సీటీఐలు), దాదాపు 34 స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు (ఏటీఐలు) నుండి 250 మందికి పైగా సీనియర్ అధికారులు పాల్గొన్నారు. .

డిపిఐఐటి కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్ 'మొత్తం ప్రభుత్వ విధానం' దృక్పథాన్ని కలిగి ఉన్న పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ప్రాముఖ్యతను వివరించారు. దేశానికి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను నిర్మించడంలో, ప్రణాళిక, సీటీఐలు, రాష్ట్రాల పాత్ర కోసం జిల్లాలు, ప్రత్యేకించి ఆకాంక్షాత్మక జిల్లాలలో దీనిని ఉపయోగించడంలో పీఎం గతి శక్తి విధానం భావన, ఉపయోగాలను అర్థం చేసుకోవడానికి ఈనాటి నిర్వాహకులు, ప్రభుత్వ సేవకులు కీలకమైన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఏటీఐ లు ఈ ప్రయత్నంలో కీలక పాత్ర పోషిస్తాయి. 

డీపీఐఐటీ  ప్రత్యేక కార్యదర్శి (లాజిస్టిక్స్)  శ్రీమతి  సుమితా దావ్రా  2047 నాటికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వికాసిత్ భారత్ దార్శనికతకు అనుగుణంగా గత దశాబ్దంలో భారతదేశం ఆర్థిక వృద్ధిలో సాధించిన ముఖ్యమైన పురోగతిని  వివరించారు. 

ప్రత్యేక కార్యదర్శి (లాజిస్టిక్స్) పీఎం గతిశక్తి భావన, ఉపయోగాన్ని విశదీకరించారు, మల్టీమోడల్ లాజిస్టిక్స్ కోసం సమగ్ర ప్రణాళిక కోసం జీఐఎస్ -ప్రారంభించిన  ప్లాట్‌ఫారమ్, ఇది ఏరియా డెవలప్‌మెంట్ అప్రోచ్ ప్లానింగ్, సమర్థవంతమైన అమలుకు దారితీసింది. 

పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ చేసిన వివరాల రూట్ సర్వే (డీఆర్ఎస్) 46 నివేదికలను సిద్ధం చేయడానికి 6-9 నెలలు పట్టింది. అయితే, ఎలక్ట్రానిక్ డిటైల్డ్ రూట్ సర్వే (ఈడిఆర్ఎస్) ద్వారా ఎన్ఎంపి ఎన్ఎంపీ తో పాటు , ఇప్పుడు డిజిటల్ క్లిప్‌తో కొన్ని గంటల్లో నివేదికలు రూపొందుతాయి. ప్రక్రియను సులభతరం, వేగవంతం చేస్తుంది.

రైల్వే మంత్రిత్వ శాఖ ఎన్ఎంపిపై 13,000 కి.మీలకు పైగా ప్రణాళిక వేసింది. తుది స్థాన సర్వేలను (ఎఫ్ఎల్ఎస్) పూర్తి చేయడంలో ఎక్కువ వేగాన్ని నివేదించింది. ఎన్ఎంపి  వినియోగంతో,2022 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 427 ఫైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్ఎల్ఎస్) రైల్వేస్ ద్వారా జరిగింది, 

పెట్రోలియం., సహజ వాయువు మంత్రిత్వ శాఖ నార్త్-ఈస్ట్ గ్యాస్ గ్రిడ్ (ఎన్ఈఈజిజి) కింద 5 పైప్‌లైన్‌ల అమరికలను ప్లాన్ చేసింది, దీని ఫలితంగా మొత్తం 42 కి.మీ పొడవు తగ్గింది, దీని వలన 169 కోట్ల రూపాయల ఖర్చు ఆదా అవుతుంది. పూణే బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌వే వంటి ప్రాజెక్టుల ప్రణాళిక , భద్రక్-విజయనగరం (కలింగ్‌నగర్) 3వ లైన్ రైలు ప్రాజెక్ట్, మల్టీమోడల్ కనెక్టివిటీని నిర్ధారించడానికి ట్యూనా-టెక్రా (కాండ్లా) వద్ద కొత్త టెర్మినల్‌కు కనెక్టివిటీ కూడా ఎన్ఎంపి  జరిగింది.

 

 ***


(Release ID: 1946300) Visitor Counter : 96


Read this release in: English , Urdu , Hindi , Tamil