రక్షణ మంత్రిత్వ శాఖ
రక్షణ రంగంలో స్వయంసమృద్ధి
Posted On:
04 AUG 2023 2:02PM by PIB Hyderabad
స్వదేశీ అధునాతన సాంకేతికతలు, కీలక వ్యవస్థల అభివృద్ధి ద్వారా దేశాన్ని స్వావలంబనగా మార్చేందుకు భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది. సాంకేతికత-ఆధారిత రక్షణ పరికరాలు, ఆయుధాల తయారీని దేశీయంగా చేపట్టేందుకు, దేశీయ రక్షణ ఉత్పత్తి వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలు/చర్యలు ఇవి:
- స్వదేశీ వనరుల ద్వారా రక్షణ పరికరాల సేకరణలు పెంచడానికి, దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి 'డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్'ను (డీఏపీ 2020) ప్రకటించడం జరిగింది. మూలధన సముపార్జనకు అత్యంత ప్రాధాన్య ఎంపికగా 'బయ్ ఇండిజెనస్లీ డిజైన్డ్ డెవలప్డ్ అండ్ మాన్యుఫాక్చర్డ్ (ఐడీడీఎం)' విభాగం పరికరాలను, ఆ తర్వాత 'బయ్' (ఇండియన్) విభాగాన్ని భారత ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రైవేట్ రంగం సహా భారతీయ పారిశ్రామిక వ్యవస్థలో ఎక్కువ భాగస్వామ్యాన్ని కలిగి ఉండటం ద్వారా స్వయంసమృద్ధి లక్ష్యాన్ని సాధించడం 'మేక్' విభాగం లక్ష్యం.
- మేక్-I, టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫండ్ (టీడీఎఫ్), ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ (ఐడెక్స్) ప్రాజెక్టుల కోసం ప్రభుత్వ నిధులు కేటాయిస్తోంది. ఎంఎస్‌ఎంఈలు, అంకుర సంస్థలు ద్వారా విడిభాగాలు, ఉత్పత్తులు, వ్యవస్థలు, సాంకేతికతల స్వదేశీ అభివృద్ధికి డీఆర్‌డీవో ద్వారా అమలయ్యే టీడీఎఫ్ పథకం సాయం చేస్తుంది. ఈ పథకం కింద, ప్రతి ప్రాజెక్ట్‌కు ఇచ్చే నిధులు రూ.10 కోట్ల నుంచి రూ.50 కోట్లకు పెంచారు. ఐడెక్స్ ప్రైమ్ పథకం కింద రూ.1.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంచారు. రక్షణ రంగంలో స్వయంసమృద్ధికి ఇది మరింత ప్రోత్సాహం ఇస్తుంది.
- దిగుమతి నిషేధం ఉన్న రక్షణ పరికరాలు, వ్యవస్థల నాలుగు జాబితాలు.
- డీఆర్‌డీవోకు చెందిన 'డెవలప్‌మెంట్ కమ్ ప్రొడక్షన్ పార్టనర్ (డీసీపీపీ)' విధానం అమలవుతుంది. వ్యవస్థల అభివృద్ధి ప్రాజెక్టుల కోసం పరిశ్రమలను డీసీపీపీగా తీసుకుంటారు.
- డీఆర్‌డీవో పరిశోధన కేంద్రాల్లోకి పరిశ్రమలకు అనుమతి ఇస్తారు. అనుమతించే పరిశోధన కేంద్రాల వివరాలను డీఆర్‌డీవో వెబ్‌సైట్‌లో ఉంచారు, పరిశ్రమలకు తెలియజేశారు. ఆయా కేంద్రాలను పరిశ్రమలు వినియోగించుకుంటున్నాయి.
- రక్షణ, అంతరిక్ష సంబంధిత పరికరాల దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఉత్తరప్రదేశ్, తమిళనాడులో రెండు రక్షణ రంగ పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటు చేయడం జరిగింది.
- పరిశ్రమ, అంకుర సంస్థలు, విద్యాసంస్థల కోసం రక్షణ ఆర్&డీ తలుపులు తెరుచుకున్నాయి. ఇందుకోసం రక్షణ ఆర్&డీ బడ్జెట్‌లో 25% కేటాయించారు. ఇప్పటికే ఉన్న వివిధ పథకాల ద్వారా దీనిని అమలు చేస్తున్నారు, కొత్త పథకాలు ప్రతిపాదించారు.
- స్వదేశీ ఆకృతి, తయారీని ప్రోత్సహించడానికి, స్వదేశీ వనరుల నుంచి సేకరణలకు కూడా నిధులు కేటాయించడం జరిగింది. ఎఫ్‌వై 2023-24 కోసం, రక్షణ మంత్రిత్వ శాఖ మూలధన సమీకరణ బడ్జెట్‌లో, దేశీయ & విదేశీ సేకరణల కోసం 67.75:32.25 నిష్పత్తిలో నిధులు కేటాయించడం జరిగింది. దీనికి అదనంగా, అంకుర సంస్థల నుంచి సేకరణల కోసం 1,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని రక్షణ మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
- 'సాంకేతికత బదిలీ' (టాట్) కోసం డీసీపీపీలు/పీఏలు/ఎల్‌ఎస్‌ఐ నుంచి రుసుము వసూలు చేయడం లేదు.
- డీఆర్‌డీవో పేటెంట్లను పరిశ్రమలు ఉచితంగా వినియోగించుకోవచ్చు.
- పరిశ్రమలు మాత్రమే అభివృద్ధి చేసే వ్యవస్థల జాబితాలను డీఆర్‌డీవో రూపొందించింది. దానినే ఎంవోడీ ప్రకటించింది. అలాంటి వ్యవస్థలను డీఆర్‌డీవో అభివృద్ధి చేయదు.
- రక్షణ రంగ పరిశ్రమల కోసం యువతను (ఇంటర్న్‌షిప్‌లు, అప్రెంటిస్‌షిప్‌లు, బి.టెక్, ఎం.టెక్ కోర్సుల ద్వారా) డీఆర్‌డీవో సిద్ధం చేస్తోంది.
గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో (2020-21 నుంచి 2022-23 వరకు), రక్షణ పరికరాల మూలధన సేకరణల కోసం 122 ఒప్పందాలు జరిగాయి. ఈ మొత్తం ఒప్పందాల విలువలో 87% వాటా ఉన్న 100 ఒప్పందాలు భారతీయతో జరిగాయి.
2021-22తో పోలిస్తే 2013-14 సంవత్సరానికి రక్షణ రంగంలో దిగుమతులు-ఎగుమతుల నిష్పత్తి ఇది:
(రూ.కోట్లలో)
సంవత్సరం
|
2013-14
|
2021-22
|
దిగుమతి విలువ (మూలధనం + ఆదాయం)
|
41,198.61
|
50,061.67
|
ఎగుమతి విలువ
|
1,153
|
12,815
|
నిష్పత్తి (దిగుమతి/ఎగుమతి)
|
35.73
|
3.90
|
రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్ ఈ రోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 1945968)
Visitor Counter : 161