మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభ్యాసాన్ని విప్లవాత్మకంగా మార్చిన 'డిజిటల్ ఇండియా' కార్యక్రమం

Posted On: 02 AUG 2023 4:38PM by PIB Hyderabad

డిజిటల్ వినియోగం, డిజిటల్ సాధికారత ద్వారా భారతదేశాన్ని డిజిటల్ సాధికారత గల సమాజంగా, విజ్ఞానభరిత ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ‘డిజిటల్ ఇండియా’ కార్యక్రమాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ & సమాచార సాంకేతికత మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.

పైన పేర్కొన్న లక్ష్యాలను సాధించడానికి, ముఖ్యంగా గ్రామీణ, గిరిజన, మారుమూల ప్రాంతాల్లో పీఎం ఈ-విద్య ఆధ్వర్యంలో డీటీహెచ్‌ ఛానెళ్లతో పాటు వెబ్ వేదికల ద్వారా అధిక నాణ్యతతో విద్య కార్యక్రమాలను విద్యా శాఖ అందిస్తోంది.

కొన్ని ప్రధాన విద్య కార్యక్రమాలు ఇవి:

  • దేశంలో డిజిటల్ మౌలిక సదుపాయంగా దీక్షను తీసుకురావడం జరిగింది. రాష్ట్రాలు/యూటీల్లో పాఠశాల విద్యలో నాణ్యమైన ఈ-పాఠ్యాంశాలు అందించడానికి, అన్ని తరగతులకు (ఒక దేశం, ఒక డిజిటల్ ప్లాట్‌ఫామ్) క్యూఆర్‌-కోడ్ ఉన్న పాఠ్య పుస్తకాలు అందించడానికి దీనిని ప్రారంభించారు. దీక్ష ఇప్పటి వరకు (25.07.2023) 524 కోట్లకు పైగా అభ్యాస సెషన్లు, 2.2 కోట్లకు పైగా సగటు రోజువారీ పేజీ వీక్షణలతో 6,125 కోట్లకు వైగా అభ్యాస నిమిషాలను పూర్తి చేసింది. ఇప్పటి వరకు దీక్షలో 3,17,496 ఈ-పాఠ్యాంశాలు ప్రత్యక్ష ప్రసారం అయ్యాయి.
  • పాఠశాల విద్య కోసం 12 డీటీహెచ్‌ ఛానెళ్లు, ఉన్నత విద్యలో 22 స్వయం ప్రభ ఛానెళ్లు ప్రస్తుతం ఉన్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రకటన ప్రకారం, 12 డీటీహెచ్‌ ఛానెళ్లను 200 పీఎం ఈ-విద్య డీటీహెచ్‌ TV ఛానెళ్లుగా విస్తరించడం జరుగుతుంది.
  • ఉన్నత విద్య కోర్సుల కోసం విశ్వవిద్యాలయాలకు క్రెడిట్ బదిలీని అందించే జాతీయ వేదిక స్వయం (స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్-లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్). ఎఐవోఎస్‌, ఎన్‌సెర్ట్‌ అనేవి, స్వయం కింద పాఠశాల విద్యా కోర్సులకు నేషనల్ కోఆర్డినేటర్లు. ఇవి 9 నుంచి 12వ తేదీ వరకు పాఠశాల కోర్సులను అందిస్తున్నాయి. స్వయం పోర్టల్‌లో, వీటి కింద మొత్తం 10,451 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఎన్‌సెర్ట్‌కు చెందిన 257 కోర్సులు, ఎన్‌ఐవోస్‌కు చెందిన 431 కోర్సులు కూడా ఉన్నాయి. ఎన్‌సీఈఆర్‌టీ కోర్సుల కోసం 4.1 లక్షల మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోగా, ఎన్‌ఐవోఎస్‌ కోర్సుల కోసం 34 లక్షల మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు.

'డిజిటల్ ఇండియా'ను సాకారం చేసేందుకు, విద్య బహుళ మార్గాల్లో అందుబాటులో ఉండేలా, డిజిటల్/ఆన్‌లైన్/ఆన్-ఎయిర్ విద్యకు సంబంధించిన అన్ని ప్రయత్నాలను చేస్తున్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్‌లో భాగంగా పీఎం ఈ-విద్య కింద వీటిని నిర్వహిస్తున్నారు.

కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి శ్రీమతి అన్నపూర్ణ దేవి ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారం అందించారు.

 

*****



(Release ID: 1945281) Visitor Counter : 101


Read this release in: English , Urdu , Bengali , Tamil