గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ

Posted On: 02 AUG 2023 3:23PM by PIB Hyderabad

2021-22 ఆర్థిక సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (మహాత్మాగాంధీ ఎన్‌ఆర్‌ఈజీఎస్) కింద క్రియాశీలంగా ఉన్న కార్మికుల సంఖ్య రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వారీగా అనుబంధం-Iలో ఇవ్వబడింది.

28.07.2023 నాటికి మహాత్మా గాంధీ ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (ఏబిపిఎస్‌)తో ఆధార్ నంబర్‌లు సీడ్ చేయబడిన కార్మికుల సంఖ్య రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వారీగా అనుబంధం-IIలో ఇవ్వబడ్డాయి.

మహాత్మాగాంధీ ఎన్‌ఆర్‌ఈజిఎస్ కింద ఏ ఒక్క కార్మికుడి వేతనాన్ని కూడా ఎబిపిఎస్ కారణంగా  తిరస్కరించలేదు. మహాత్మాగాంధీ ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద లబ్ధిదారులకు సకాలంలో వేతనాలు అందజేయడంతోపాటు లబ్ధిదారులు బ్యాంకు ఖాతా నంబర్‌లను తరచూ మార్చడం, ప్రోగ్రామ్ ఆఫీసర్లు అప్‌డేట్ చేయకపోవడం వల్ల తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు ఆధార్ బేస్ పేమెంట్ సిస్టమ్‌ను అనుసరించాలని నిర్ణయించారు. (ఏబిపిఎస్) బ్యాంక్ ఖాతా మార్పు కారణంగా ప్రభావితం కాదు. అలాగే నిజమైన లబ్ధిదారులు మాత్రమే పథకం యొక్క ప్రయోజనం పొందాలని నిర్ధారించడానికి ఇప్పటికే ఉన్న లబ్దిదారులను డి-డూప్లికేషన్ చేయాలి. దీని కోసం ఆధార్ బేస్ చెల్లింపు వ్యవస్థ ఉత్తమ ప్రత్యామ్నాయం.

మహాత్మా గాంధీ ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో 1 ఫిబ్రవరి, 2023 నాటినుండి ఏబిపిఎస్‌ తప్పనిసరి. అయితే అనేక రాష్ట్రాలు చేసిన అభ్యర్థన మేరకు 31 ఆగస్టు, 2023 వరకు, లబ్ధిదారుల ఏబిపిఎస్‌ స్థితిని బట్టి ఏబిపిఎస్‌ లేదా ఎన్‌ఏసిహెచ్‌ విధానంలో లబ్ధిదారుల వేతన చెల్లింపులు చేయాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

ఒకవేళ రాష్ట్రాలు/యూటీలు ఏబిపిఎస్‌కు సంబంధించి ఏవైనా సమస్యలు లేదా ఇబ్బందులు ఎదుర్కొంటే అదే ప్రాధాన్యత ఆధారంగా పరిష్కరించబడుతుంది.

రాష్ట్రాలు/యూటీలలో మహాత్మా గాంధీ ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ అమలులో మరింత పారదర్శకతను నిర్ధారించడానికి అన్ని పనుల కోసం నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్‌ఎంఎంఎస్‌) యాప్ ద్వారా ఒక రోజులో కార్మికుల యొక్క జియో ట్యాగ్ చేయబడిన రెండు టైమ్ స్టాంప్ ఫోటోలతో హాజరును సంగ్రహించడం ( వ్యక్తిగత లబ్ధిదారుల పనులు మినహా) జనవరి 1, 2023 నుండి తప్పనిసరి చేయబడింది.

ఇది చెల్లింపుల వేగవంతమైన ప్రాసెసింగ్‌ను ప్రారంభించడంతో పాటు పథకంపై పౌరుల పర్యవేక్షణను పెంచుతుంది.ఎన్‌ఎంఎంఎస్‌ యాప్ ద్వారా కార్మికుల జియో-ట్యాగ్ చేయబడిన ఫోటోగ్రాఫ్‌లతో పాటు హాజరును సంగ్రహించే బాధ్యత వర్క్‌సైట్ సూపర్‌వైజర్‌లకు ఉంటుంది.

ఎన్‌ఎంఎంఎస్‌ యాప్‌లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ఎన్‌ఐఎస్‌ రూరల్ డెవలప్‌మెంట్‌తో తీసుకోబడతాయి. రాష్ట్రాలు/యూటీలు అభ్యర్థించిన కొత్త నిబంధనలు/సూచనలు పొందుపరచబడుతున్నాయి.ఎన్‌ఎంఎంఎస్‌ యాప్‌కు సంబంధించిన అన్ని సమస్యలు ఎప్పటికప్పుడు సమీక్షించబడతాయి మరియు పరిష్కరించబడతాయి.

హాజరు మరియు మొదటి ఫోటోగ్రాఫ్‌ను అప్‌లోడ్ చేసిన 4 గంటల తర్వాత రెండవ ఫోటోగ్రాఫ్ క్యాప్చర్ చేయడానికి ఎన్‌ఎంఎంఎస్‌ యాప్ సవరించబడింది. మొదటి ఫోటో మరియు రెండవ ఫోటోతో పాటు ఉదయం హాజరు ఆఫ్‌లైన్ మోడ్‌లో క్యాప్చర్ చేయబడుతుంది మరియు పరికరం నెట్‌వర్క్‌లోకి వచ్చిన తర్వాత అప్‌లోడ్ చేయబడుతుంది. అసాధారణ పరిస్థితుల కారణంగా హాజరు అప్‌లోడ్ చేయలేని పక్షంలో మాన్యువల్ హాజరును అప్‌లోడ్ చేయడానికి జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ (డిపిసి)కి అధికారం ఇవ్వబడింది.

 

అనుబంధం-I

2021-22 ఆర్థిక సంవత్సరంలో మహాత్మా గాంధీ ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద క్రియాశీల కార్మికుల సంఖ్య రాష్ట్రం/యూటీ వారీగా వివరాలు .

క్రమ సంఖ్య

రాష్ట్రం/యూటీ

క్రియాశీల కార్మికుల సంఖ్య ( లక్షల్లో )

1

అండమాన్ మరియు నికోబార్

0.16

2

ఆంధ్రప్రదేశ్

99.82

3

అరుణాచల్ ప్రదేశ్

3.03

4

అస్సాం

60.49

5

బీహార్

99.33

6

గోవా

0.07

7

గుజరాత్

31.76

8

హర్యానా

9.27

9

హిమాచల్ ప్రదేశ్

14.32

10

జమ్మూ మరియు కాశ్మీర్

16.55

11

కర్ణాటక

88.22

12

కేరళ

27.06

13

మధ్యప్రదేశ్

114.26

14

మహారాష్ట్ర

66.41

15

లక్షద్వీప్

0.00

16

మణిపూర్

7.26

17

మేఘాలయ

9.05

18

మిజోరం

2.08

19

నాగాలాండ్

5.25

20

ఒడిశా

78.72

21

పుదుచ్చేరి

0.67

22

పంజాబ్

17.26

23

రాజస్థాన్

145.66

24

సిక్కిం

0.99

25

తమిళనాడు

94.31

26

త్రిపుర

10.09

27

ఉత్తర ప్రదేశ్

174.92

28

పశ్చిమ బెంగాల్

181.25

29

ఛత్తీస్‌గఢ్

75.90

30

జార్ఖండ్

47.34

31

ఉత్తరాఖండ్

12.74

32

తెలంగాణ

64.76

33

లడఖ్

0.45

 

మొత్తం

1,559.47

 

అనుబంధం-II

28.07.2023 నాటికి మహాత్మా గాంధీ ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (ఏబిపిఎస్‌)తో ఆధార్ నంబర్‌లు సీడ్ చేయబడిన కార్మికుల సంఖ్య రాష్ట్రం/యూటీ వారీగా వివరాలు .

క్రమ సంఖ్య

రాష్ట్రం/యూటీ

కార్మికుల సంఖ్య ( లక్షల్లో )

1

ఆంధ్రప్రదేశ్

93.44

2

అరుణాచల్ ప్రదేశ్

1.92

3

అస్సాం

23.47

4

బీహార్

71.20

5

ఛత్తీస్‌గఢ్

57.09

6

గోవా

0.06

7

గుజరాత్

21.94

8

హర్యానా

7.68

9

హిమాచల్ ప్రదేశ్

12.30

10

జమ్మూ మరియు కాశ్మీర్

11.12

11

జార్ఖండ్

33.04

12

కర్ణాటక

74.99

13

కేరళ

24.25

14

లడఖ్

0.36

15

మధ్యప్రదేశ్

88.34

16

మహారాష్ట్ర

48.51

17

మణిపూర్

4.17

18

మేఘాలయ

0.28

19

మిజోరం

1.73

20

నాగాలాండ్

 


(Release ID: 1945267) Visitor Counter : 161