సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
దేశంలో 2022-23కుగాను 20.93 లక్షల మంది కుటుంబ పెన్షనర్లుసహా 65.74 లక్షల మందికిపైగా పెన్షనర్లకు రూ.2,41,000 కోట్లమేర పెన్షన్ పంపిణీ: డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
02 AUG 2023 4:15PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లకు 2022-23 సంవత్సరంలో పెన్షన్ల చెల్లింపు పద్దుకింద వ్యయంపై వివిధ శాఖలు వివరాలు వెల్లడించాయి. ఈ మేరకు సెంట్రల్ పెన్షన్ అకౌంటింగ్ ఆఫీస్ (సివిల్ పెన్షనర్లు), ఆఫీస్ ఆఫ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ (రక్షణశాఖ పెన్షనర్లు), డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (టెలికాం పెన్షనర్లు), రైల్వే బోర్డ్ (రైల్వే పెన్షనర్లు), డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ (తపాలా పెన్షనర్లు) ప్రకటించిన సమాచారం కింది విధంగా ఉంది:
వ.సం.
|
డిపార్ట్’మెంట్
|
పెన్షనర్లు
|
కుటుంబ పెన్షనర్లు
|
2022-23లో వ్యయం(రూ.కోట్లలో)
|
1
|
సివిల్ పెన్షనర్
|
780509
|
361476
|
40,811.28
|
2
|
రక్షణశాఖ పెన్షనర్
|
2331388
|
835043
|
1,25,269.42
|
3
|
టెలికాం పెన్షనర్
|
317992
|
120766
|
12448.00
|
4
|
రైల్వేశాఖ పెన్షనర్
|
856058
|
669710
|
55,034.00
|
5
|
తపాలాశాఖ పెన్షనర్
|
195298
|
106467
|
8214.85
|
మొత్తం
|
|
4481245
|
2093462
|
2,41,777.55
|
కేంద్ర ప్రభుత్వ పరిధిలో కనీస పెన్షన్/కుటుంబ పెన్షన్ మొత్తం నెలకు రూ.9,000. కాగా, ఈ నేపథ్యంలో కనీస పెన్షన్/కుటుంబ పెన్షన్ పెంచే ప్రతిపాదనేదీ లేదు. అయితే, పెన్షన్/కుటుంబ పెన్షన్‌దారులు కాలానుగుణ ధరల మార్పుల ప్రాతిపదికన కరవు భత్యం పొందడానికి అర్హులు.
లోక్‌సభలో ఇవాళ ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వశాఖ, ప్రధాని కార్యాలయ, ప్రజా ఫిర్యాదులు-పెన్షన్లు, అణుశక్తి-అంతరిక్ష శాఖల (స్వతంత్ర బాధ్యతగల) సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సమాచారం వెల్లడించారు.
*****
(Release ID: 1945230)
Visitor Counter : 91