రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

సుభ్రతో ముఖర్జీ స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ, ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ మధ్య అవగాహన ఒప్పందం


గ్రాస్‌రూట్ స్థాయిలో ఫుట్‌బాల్‌ను ప్రోత్సహించడానికి వీలుగా ఒప్పందం

Posted On: 02 AUG 2023 5:46PM by PIB Hyderabad

ఫుట్‌బాల్‌క్రీడను కింది మూలాలస్థాయి నుంచి ప్రోత్సహించే విషయంలో సహకరించుకునేందుకు  వీలుగా మొట్టమొదటిసారిగా సుబ్రొతో ముఖర్జీ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ సొసైటీ (ఎస్ఎంఎస్ఈఎస్) ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)తో కలిసి ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా ఈ ఎడిషన్ నుండి, జూనియర్ బాయ్స్ (యు-17) విభాగంలో సుబ్రొటో XI జట్టు ఏర్పడుతుంది. ఈ జట్టు 2023-24 సీజన్ నుండి ఏఐఎఫ్ఎఫ్ యూత్ కాంపిటీషన్‌లో పాల్గొంటుంది. దీనికి తోడు ఐఎస్ఎల్, ఐ-లీగ్ మరియు ఐడబ్ల్యుఎల్ నుండి క్లబ్‌లు తమ జట్లకు ప్రాతినిధ్యం వహించడానికి సుభ్రతో కప్ నుండి ఆటగాళ్లను తీసుకుంటాయి. జాతీయ స్థాయిలో క్రీడాకారులు తమ ప్రతిభను చాటేందుకు ఇది దోహదపడుతుంది. ఏఐఎఫ్ఎఫ్ వారి వార్షిక మీడియా ప్రణాళిక మరియు క్యాలెండర్ ద్వారా సుబ్రోతో కప్‌ను కూడా ప్రమోట్ చేస్తుంది. పోటీలో వయస్సు మోసాన్ని నిరోధించడానికి, ఎస్ఎంఎస్ఈఎస్ నిపుణులను ఉపయోగించి వయస్సు నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తుంది. కోచ్‌లను అప్‌డేట్ చేయడానికి మరియు ఎడ్యుకేట్ చేయడానికి, ఢిల్లీ మరియు బెంగళూరులో చివరి రౌండ్ జట్ల కోచ్‌ల కోసం ఏఐఎఫ్ఎఫ్ ద్వారా ఎడ్యుకేషన్ వర్క్‌షాప్ నిర్వహించబడుతుంది. న్యూఢిల్లీలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో ఎస్ఎంఎస్ఈఎస్ సభ్యుడిగా ఎయిర్ వైస్ మార్షల్ అలోక్ శర్మ, వీఎం వీఎస్ఎం, ఏసీఏఎస్ (ఆర్గా & సెర్) మరియు ఏఐఎఫ్ఎఫ్ సెక్రటరీ జనరల్ డాక్టర్. షాజీ ప్రభాకరన్ సంతకం చేశారు. ఇద్దరు ప్రముఖులు ఈ భాగస్వామ్యంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం మూలంగా రాబోయే కాలంలో జాతీయ ఫుట్‌బాల్‌కు గొప్ప ఫలాలా వస్తాయనే నమ్మకంతో ఉన్నారు. సుబ్రొతో ముఖర్జీ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ సొసైటీ (ఎస్ఎంఎస్ఈఎస్) ఎయిర్ ఫోర్స్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో 1960 నుండి ప్రతిష్టాత్మకమైన సుభ్రొతో కప్ అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తోంది. ఇది ఒక ప్రత్యేకమైన ఫుట్‌బాల్ టోర్నమెంట్, దీనిలో గ్రాస్-రూట్ స్థాయి నుండి ప్రారంభించి అన్ని రాష్ట్రాల పాఠశాల జట్లు సబ్-జూనియర్ బాలురు (యు-14), జూనియర్ బాలురు (యు-17) మరియు జూనియర్ బాలికలు (U-17) మూడు విభాగాలలో దేశంలో ఫుట్‌బాల్‌లో అత్యున్నత గౌరవాల కోసం పోటీపడతాయి.

 

***



(Release ID: 1945227) Visitor Counter : 120


Read this release in: Urdu , English , Hindi