బొగ్గు మంత్రిత్వ శాఖ
2023-24 ఆర్థిక సంవత్సరంలో జూలై వరకు బొగ్గు ఉత్పత్తి 14.11% వృద్ధితో 292.12 మిలియన్ టన్నులు
జూలైలో బొగ్గు రవాణా 74.33 మిలియన్ టన్నులు
Posted On:
01 AUG 2023 6:19PM by PIB Hyderabad
బొగ్గు మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2023 సంవత్సరం జూలైలో దేశంలో బొగ్గు ఉత్పత్తి 68.75 మిలియన్ టన్నుల (ఎంటి) స్థాయికి చేరింది. 2022 జూలై ఉత్పత్తి 60.25 మిలియన్ టన్నుల కన్నా ఇది 14.11% అధికం. అలాగే కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) బొగ్గు ఉత్పత్తి 2023 జూలైలో 2022 జూలై నెలతో పోల్చితే 13.41% వృద్ధితో 47.29 మిలియన్ టన్నుల నుంచి 53.63 మిలియన్ టన్నులకు పెరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జూలై వరకు మొత్తం బొగ్గు ఉత్పత్తి గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 265.94 ఎంటి నుంచి 9.84% వృద్ధితో 292.12 ఎంటికి (అంచనా) చేరింది.
2023 జూలైలో బొగ్గు రవాణా కాడ గణనీయంగా పెరిగి 74.33 ఎంటిలకు చేరింది. 2022 జూలైలో నమోదైన 67.46 టన్నుల రికార్డు కన్నా ఇది అధికం. గత జూలైతో పోల్చితే బొగ్గు ఉత్పత్తి 10.19 శాతం పెరిగింది. కాప్టివ్/ఇతర విభాగాల్లో బొగ్గు రవాణా 2022 జూలై నాటి 9.74 ఎంటి నుంచి 11.48 ఎంటికి చేరింది. అంటే 17.83% వృద్ధిని నమోదు చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 2023 జూలై వరకు గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే రవాణా 7.79% పెరిగి 291.59 ఎంటి నుంచి 314.30 ఎంటికి చేరింది.
బొగ్గు సరఫరా వ్యవస్థలో సామర్థ్యాలతో పాటు దేశవ్యాప్తంగా బొగ్గు పంపిణీ సామర్థ్యాన్ని ఇది నిరూపిస్తోంది. రుతుపవనాల కాలంలో బొగ్గు సరఫరా నిలకడగా ఉండేలా చూసేందుకు బొగ్గు మంత్రిత్వశాఖ కట్టుబడి ఉంది. మైనింగ్ కార్యకలాపాల సంరక్షణకు, నిర్వహణా సామర్థ్యాలు పెంచడానికి పలు వ్యూహాలు అమలుపరుస్తోంది.
బొగ్గు ఉత్పత్తి, సరఫరా, నిల్వలు అన్నింటిలోనూ బొగ్గు రంగం అసాధారణమైన వృద్ధి నమోదు చేసింది. ఈ అసాధారణమైన వృద్ధి సాధించడంలో బొగ్గు రంగంలోని పిఎస్ యులు అవిశ్రాంతంగా అంకిత భావాన్ని ప్రదర్శస్తున్నాయి. ఇంధన రంగం నిలకడగా, ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకునేలా ఉండేందుకు సమన్వయపూర్వక ప్రయత్నాలు, సాంకేతికాభివృద్ధి, సుస్థిర విధానాలు అనుసరించడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది.
***
(Release ID: 1944946)
Visitor Counter : 160