వ్యవసాయ మంత్రిత్వ శాఖ

వెల్లుల్లి ఉత్ప‌త్తి

Posted On: 01 AUG 2023 5:29PM by PIB Hyderabad

దేశంలో 2021-22 & 2022-23 (మొద‌టి ముందస్తు అంచ‌నాలు)లో వెల్లుల్లి ఉత్ప‌త్తికి సంబంధించిన గ‌ణాంకాలు దిగువ‌న ఇవ్వ‌డం జ‌రిగింది ః 

సంవ‌త్స‌రం                                                ఉత్ప‌త్తి (వేల ట‌న్నుల‌లో)

2021-22                                                                 3523

2022-23 (తొలి ముంద‌స్తు అంచ‌నాలు)                 3369  

భార‌త దేశంలో వివిధ రుతువులు, వ్య‌వ‌సాయ -వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌లో సాగుకు అనువైన ర‌కాలను గుర్తించ‌డానికి వెల్లుల్లి జ‌న్యుప‌ర‌మైన మెరుగ‌ద‌ల‌పై ప్ర‌ణాళికాబ‌ద్ధ‌మైన ప‌రిశోధ‌న‌ను పూణెకు చెందిన ఐసిఎఆర్‌- డైరెక్టొరేట్ ఆఫ్ ఆనియ‌న్ అండ్ గార్లిక్ రీసెర్చ్ (ఉల్లి, వెల్లుల్లి ప‌రిశోధ‌న డైరొక్ట‌రేట్‌), నాసిక్‌కు చెందిన నేష‌న‌ల్ హార్టిక‌ల్చ‌ర్ రీసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఫౌండేష‌న్ (జాతీయ ఉద్యాన‌వ‌న ప‌రిశోధ‌న & అభివృద్ధి ఫౌండేష‌న్‌) నిర్వ‌హిస్తున్నాయి. 
అద‌నంగా, ఉల్లి, వెల్లుల్లిపై పూణెలోని ఐసిఎఆర్ - ఆల్ ఇండియా నెట్‌వ‌ర్క్ రీసెర్చ్ ప్రాజెక్టు (ఒ&జిలో ఐసిఎఆర్‌- ఎఐఆర్‌సిఆర్‌పి) ద్వారా దేశంలోని వివిధ ప్ర‌దేశాల‌లో, ఆ నిర్ధిష్ట ప్ర‌దేశ అనుస‌ర‌ణీయ ట్ర‌య‌ల్స్ జ‌రుగుతున్నాయి. 
ఐసిఎఆర్‌- ఎఐఎన్ఆర్‌పి ద్వారా ఖ‌రీఫ్ కాలంలో సాగుకు అనువైన ర‌కాల‌ను గుర్తించేందుకు ఒ & జిఎటి ఆరు ప్ర‌దేశాల‌లో (మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు (ఊటి))లో క్షేత్ర స్థాయి ప్ర‌యోగాలు మూడేళ్ళ‌పాటు జ‌రిగాయి. రెండు ర‌కాలు - భీమా ప‌ర్పుల్‌, జి-282లు మూడు ప్రాంతాలలో, అంటే మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు (ఊటీ)ల‌లో మెరుగైన ప‌నితీరును ప్ర‌ద‌ర్శించి హెక్టారుకు 30.0 నుంచి 40.0 క్వింటాళ్ళ దిగుబ‌డిని ఇచ్చాయి. కాగా, ర‌బీ కాలంతో పోలిస్తే ఖ‌రీఫ్ కాలంలో దిగుబ‌డి త‌క్కువ‌గా ఉంది. ఈ కాలంలో క‌ర్ణాట‌క‌కు చెందిన భూమి జాతి అయిన గ‌డ‌గ్ లోకల్‌ను సాగు చేస్తుండ‌గా, అది క‌ర్ణాట‌క‌లో మెరుగైన దిగుబ‌డిని ఇస్తోంది. 
ఇందుకు అద‌నంగా, జి-339 పేరుగ‌ల వెల్లుల్లి ఆధునిక బ్రీడింగ్ లైన్ మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఖ‌రీఫ్‌కూ, ర‌బీకి కూడా అనువైన‌ద‌ని గమ‌నించ‌డం జ‌రిగింది. 
ఈ విష‌యాన్ని కేంద్ర వ్య‌వ‌సాయ & రైతాంగ సంక్షేమ మంత్రి శ్రీ న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ మంగ‌ళ‌వారం ఇచ్చిన లిఖిత‌పూర్వ‌క జ‌వాబులో పేర్కొన్నారు. 

 

***
 



(Release ID: 1944886) Visitor Counter : 108


Read this release in: English , Urdu , Marathi