గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
పట్టణ ప్రణాళిక సంస్కరణలు
Posted On:
31 JUL 2023 2:01PM by PIB Hyderabad
రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక సాయం కోసం 2022-–23 సంవత్సరానికి రూ.6,000 కోట్లతో మరియు 202–3-24 సంవత్సరానికి రూ.15,000 కోట్ల వ్యయంతో ‘పట్టణ సంస్కరణలు’ పథకాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా పర్యవేక్షిస్తుంది. 2022–-23 సంవత్సరానికి రాష్ట్రాలకు ప్రత్యేక సహాయ పథకంలో మొత్తం ₹6000 కోట్ల నుండి, స్కీమ్‌లోని పార్ట్ VI కింద 13 పాల్గొనే రాష్ట్రాలకు సంబంధించి గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా రూ.4598.22 కోట్ల మొత్తాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసింది. కాగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఖర్చుల విభాగం ద్వారా మొత్తం ₹4093.16 కోట్లు విడుదలయ్యాయి. 31 మార్చి, 2023లోగా వినియోగించుకోవడానికి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యయ శాఖ నుండి ప్రోత్సాహక మొత్తాన్ని విడుదల చేశారు. రాష్ట్రాలకు విడుదల చేసిన ప్రోత్సాహకాల వినియోగాన్ని గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షించదు.
గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు/యూఎల్బీల సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం హ్యాండ్ హోల్డింగ్ వర్క్‌షాప్‌లు/కాన్ఫరెన్స్‌లు/ శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇటీవల 13-, 14 జూలై, 2023 తేదీల్లో గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ సుస్థిర నగరాలను సృష్టించడం కోసం జాతీయ పట్టణ ప్రణాళికా సదస్సును నిర్వహించింది. ఇందులో భారతదేశం మొత్తం మీద వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు/యూఎల్బీలు మరియు విద్యా సంస్థల నుండి 1000 మందికి పైగా అధికారులు, ప్రపంచ బ్యాంకు వంటి బహుళ-పార్శ్వ సంస్థల అధికారులు , ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) GESELLSCHAFT FUR INTERNATIONALE ZUSMENARBEIT (జీఐజెడ్), జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జికా) మొదలైన సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. హాజరైన వారి ప్రయోజనం కోసం వివిధ రాష్ట్ర టౌన్ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లు మరియు ప్లానింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల ద్వారా అర్బన్ ప్లానింగ్‌లో అత్యుత్తమ అభ్యాసాలను ప్రదర్శించడానికి ఒక ప్రదర్శన కూడా నిర్వహించబడింది. అమృత్ నగరాల కోసం జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జిఐఎస్) ఆధారిత మాస్టర్ ప్లాన్ ఫార్ములేషన్ సబ్ స్కీమ్ కింద, 77 శిక్షణా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. అంతేకాకుండా 2900 మంది అధికారులు పట్టణ ప్రణాళికలో భౌగోళిక సమాచార వ్యవస్థ (జిఐఎస్) మరియు రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగించడంపై శిక్షణ పొందారు.
కేంద్ర గృహ మరియు పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ కౌశల్ కిషోర్ ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 1944874)
Visitor Counter : 102