వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

టైర్ల ఉత్ప‌త్తిదారుల‌కు వాణిజ్యం, ప‌రిశ్ర‌మ‌ల మంత్రిత్వ శాఖ తాజా మార్గ‌ద‌ర్శ‌కాలు

Posted On: 01 AUG 2023 3:44PM by PIB Hyderabad

దేశీయ విక్ర‌యాలు, ఎగుమ‌తుల కోసం టైర్ల ఉత్ప‌త్తిలో పెరుగుద‌ల‌కు డిమాండ్‌ను భార‌తీయ టైర్ల ప‌రిశ్ర‌మ వీక్షిస్తోంది. పెరుగుతున్న వాహ‌నాల యాజ‌మాన్యం టైర్ల ప‌రిశ్ర‌మ‌కు తోడ్ప‌డుతోంది. పారిశ్రామికీక‌ర‌ణ‌, పెరుగుతున్న చ‌ల‌న‌గ‌తి కార‌ణంగా ట్ర‌క్కుల‌, బ‌స్సుల టైర్ల‌కు కూడా డిమాండ్ పెరుగుతోంది.  ప‌రిశోధ‌న‌, అభివృద్ధి (ఆర్ & డి), ఆధునిక, ప‌ర్యావ‌ర‌ణ అనుకూల టైర్ల‌ను ప్రారంభించ‌డం కూడా టైర్ల‌ మార్కెట్ వృద్ధికి తోడ్ప‌డ‌నుంది. 
ప్ర‌స్తుతం, డైరెక్టొరేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డిజిఎఫ్‌టి - విదేశీ వాణిజ్య‌పు డైరొక్ట‌రేట్ జ‌న‌ర‌ల్‌) 12-06-2020న జారీ చేసిన నోటిఫికేష‌న్ నెం. 12/ 2015- 2000 ప్ర‌కారం, కొత్త న్యుమాటిక్ (వాయుపూరిత ద‌) టైర్ల‌ను నియంత్రిత వ‌ర్గం కింద ఉంచినందువ‌ల్ల దిగుమ‌తిదారులు పైన పేర్కొన్న నోటిఫికేష‌న్ కింద క‌వ‌ర్ చేసిన టైర్ల దిగుమ‌తి కోసం  దిగుమ‌తి లైసెన్స్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌లసి ఉంటుంది. 
భార‌త్‌లో టైర్ల ప‌రిశ్ర‌మ మొత్తం వృద్ధిలోకి ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని, వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల మంత్రిత్వ శాఖ  భార‌త్‌లో టైర్ల‌ను ఉత్ప‌త్తి చేసేందుకు   బ్రౌన్ ఫీల్డ్ లేదా గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులలో పెట్టుబ‌డులు పెట్టేందుకు క‌ట్టుబ‌డి ఉండ‌డం కోసం, నియంత్రిత జాబితా కింద ఉండ‌డం వంటి నూత‌న మార్గ‌ద‌ర్శ‌కాల‌ను  టైర్ల ఉత్ప‌త్తి దారుల‌కు ప్ర‌తిపాదించింది. సంబంధిత ప‌రిశ్ర‌మ‌లు, అంత‌ర్గ‌త వాణిజ్య ప్రోత్సాహ‌క విభాగం (డిపిఐఐటి)లో సంబంధిత డివిజ‌న్‌లో నిర్ధిష్ట వివ‌రాలు అందుబాటులో ఉన్నాయి.

 

***
 



(Release ID: 1944858) Visitor Counter : 105


Read this release in: English , Urdu , Hindi