ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సంస్థల నిబంధనలపై తాజా సమాచారం


వైద్య సంస్థల (ప్రభుత్వ, ప్రైవేట్) మదింపు, రేటింగ్ కోసం 'మెడికల్ అసెస్‌మెంట్ అండ్‌ రేటింగ్ బోర్డు' ఏర్పాటు

ప్రభుత్వ & ప్రైవేట్ క్లినిక్‌ల నమోదు, నియంత్రణ కోసం 'నేషనల్ కౌన్సిల్ ఫర్ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్' ఏర్పాటు

Posted On: 01 AUG 2023 2:23PM by PIB Hyderabad

రేటింగ్ ఇవ్వడానికి 'జాతీయ వైద్య కమిషన్' (ఎన్‌ఎంసీ) చట్టం 2019 ప్రకారం, ఎన్‌ఎంసీ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా వైద్య సంస్థలను (ప్రభుత్వ, ప్రైవేట్) మదింపు చేయడానికి 'మెడికల్ అసెస్‌మెంట్ అండ్‌ రేటింగ్ బోర్డు'ను (మార్బ్‌) భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 'భారత వైద్య మండలి' చట్టం 1956 ప్రకారం జారీ అయిన 'భారత వైద్య మండలి (వృత్తిగత నడవడిక, మర్యాద, నీతి) నిబంధనలు 2002' ప్రకారం, వైద్యం విషయంలో నిర్లక్ష్యానికి సంబంధించిన కేసులు/ఫిర్యాదులను ఆయా రాష్ట్రాలు/యూటీల్లోని 'డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్' లేదా సంబంధిత రాష్ట్ర వైద్య మండలి పరిష్కరిస్తుంది. రాష్ట్ర వైద్య మండలి తీసుకున్న నిర్ణయంతో ఫిర్యాదుదారు లేదా ప్రతివాది సంతృప్తి చెందకపోతే, జాతీయ వైద్య కమిషన్‌లోని  'ఎథిక్స్ అండ్ మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డు' వద్దకు అప్పీలుకు వెళ్లవచ్చు.

క్లినికల్ సంస్థలు (నమోదులు, నియంత్రణ) చట్టం 2010 (సీఈ చట్టం, 2010) ప్రకారం, 'నేషనల్ కౌన్సిల్ ఫర్ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌'ను ప్రభుత్వ సంస్థలు (సాయుధ దళాలు మినహా), గుర్తింపు పొందిన వ్యవస్థలకు చెందిన ప్రైవేట్ క్లినికల్ సంస్థల నమోదు, నియంత్రణ కోసం ఏర్పాటు చేశారు. రోగులకు తక్కువ ఫీజులతో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించడం దీని లక్ష్యం. సీఈ చట్టం 2010 ప్రకారం, క్లినిక్స్‌లో సౌకర్యాలు, సేవలకు సంబంధించి కనీస ప్రమాణాలను క్లినికల్ సంస్థలు పాటించాలి, కనీస సిబ్బందిని నియమించుకోవాలి, రికార్డులు, నివేదికలు వంటివి నిర్వహించాలి, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి, వారు వసూలు చేసే ధరలను అందరికీ కనిపించే ప్రదేశంలో ప్రదర్శించాలి. సీఈ చట్టం 2010 నిబంధనలు పాటించకపోతే ఆసుపత్రుల నమోదును రద్దు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు, సీఈ చట్టం 2010ను 12 రాష్ట్రాలు, 7 యూటీలు ఆమోదించాయి. వినియోగదార్ల రక్షణ చట్టం 1986 (2019 సవరణ) ప్రకారం, వైద్య సేవల్లో లోపం ఉంటే జిల్లా/రాష్ట్ర/జాతీయ వినియోగదార్ల వివాదాల పరిష్కార ఫోరాల్లో ఫిర్యాదు చేయవచ్చు.

కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్‌ ఎస్.పి.సింగ్ బఘేల్ ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ విషయం వెల్లడించారు.

 

****



(Release ID: 1944768) Visitor Counter : 130


Read this release in: English , Urdu , Bengali , Tamil