గనుల మంత్రిత్వ శాఖ
జమ్ము కాశ్మీర్ లో లిథియం నిక్షేపాలు
Posted On:
31 JUL 2023 4:16PM by PIB Hyderabad
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, జమ్ము కాశ్మీర్ లోని రియాసి జిల్లా సలాల్– హైమ్నా ప్రాంతంలో భూమి నుంచి వెలికి తీసే అరుదైన ఖనిజాలు బాక్సైట్ ,లిథియం వంటి జి 3 స్థాయి ఖనిజాల అన్వేషణకు సంబంధించి,
ప్రాథమిక అన్వేషణ చేపట్టింది. 2020–21,2021–22లో ఈ అన్వేషణ చేపట్టారు. ఈ సందర్భంగా 5.9 మిలియన్ టన్నుల లిథియం గని ఉన్నట్టు నిర్ధారణకు వచ్చారు. జమ్ము కాశ్మీర్లోని రియాసి జిల్లాలోని సలాల్ హైమా బ్లాక్లో
అక్కడక్కడ విసిరేసినట్టు ఇళ్లు ఉన్నాయి.
లిథియం గని నుంచి లిథియం ప్రాసెసింగ్, రిఫైనింగ్ వంటివి అక్కడ దొరికిన లిథియం నిక్షేపాల రకాన్ని బట్టి, గని లక్షణాలను బట్టి, వాటిని అంతిమంగా ఎందుకు ఉపయోగిస్తారన్నదానినిబట్టి ఉంటుంది.
లిథియం గని నుంచి లిథియం ఖనిజాన్ని వెలికితీసే సాంకేతికతను అభివృద్ధి చేయగల సమర్ధత ఇండియాకు ఉంది. లిథియం మినరల్ బ్లాక్ ను వేలం వేసే అంశంపై నిర్ణయాన్ని జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం తీసుకుంటుంది.
అణు ఇంధన విభాగంకింద గల, అటామిక్ మినరల్స్ డైరక్టరేట్ ఫర్ ఎక్స్ ప్లరేషన్, రిసెర్చ్ సంస్థ, కర్ణాటకలోని మర్లగల్ల ప్రాంతంలో లిథియం నిక్షేపాలు 1600 టన్నుల వరకు ఉండవచ్చని అంచనా వేసింది.
ఇది ప్రాథమిక అంచనా. అప్పటినుంచి మరింత అన్వేషణ జరిపి ఈ ప్రాథమిక అంచనాలు వాస్తవమయ్యేలా , ఇంకా ఎక్కువ స్థాయిలో నిక్షేపాలను ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో కనుగొనేందుకు, గట్టి ప్రయత్నాలు చేపడుతోంది.
అత్యంత పరిశుభ్రమైన లిథియం కార్బనేట్ను, స్పొడ్యుమీన్ మినరల్ కాన్సన్ట్రేట్ ద్వారా నుంచి ఉత్పత్తిచేసేందుకు , బెంచ్ స్థాయి అధ్యయనాలను పూర్తిచేశారు.
ఈ సమాచారాన్ని కేంద్ర బొగ్గు,గనులు,పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్జోసి,రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
****
(Release ID: 1944529)
Visitor Counter : 131