పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
విమానాల దిగుమతికి ఏఐ & ఇండిగో సంస్థలకు డీజీసీఏ సూత్రప్రాయ ఆమోదం
-విమానాల వాస్తవ దిగుమతికి ఎన్ఓసీ మంజూరు చేసేటప్పుడు పార్కింగ్ స్లాట్ల లభ్యత నిర్ధారించబడుతుంది
Posted On:
31 JUL 2023 4:30PM by PIB Hyderabad
పౌర విమానయాన విభాగం డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) వరుసగా 470 మరియు 500 విమానాల దిగుమతి కోసం ఎయిర్ ఇండియా లిమిటెడ్ (ఏఐ) మరియు ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (ఇండిగో) సంస్థల ప్రతిపాదనలకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. డీజీసీఏ ద్వారా దిగుమతి చేసుకోవడానికి ఆమోదించబడిన విమానాల వివరాలు అనుబంధంగా జతచేయబడ్డాయి. విమానయాన సంస్థ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారుల (ఓఈఎంలు) మధ్య వాణిజ్య స్వభావం ఉన్నందున, ఈ విమానాల కొనుగోలు ధరకు సంబంధించిన సమాచారం అందుబాటులో లేదు. విమానాల వాస్తవ దిగుమతికి ఎన్ఓసీ మంజూరు సమయంలో పార్కింగ్ స్లాట్ల లభ్యత నిర్ధారించబడుతుంది. ఎయిర్‌లైన్స్ ఇండక్షన్ ప్లాన్ ప్రకారం, 2023-2035 కాలంలో విమానాలను దిగుమతి చేసుకోవాలని ప్రతిపాదించారు. పార్కింగ్ స్లాట్‌ల లభ్యతను నిర్ధారించడం కోసం ఎయిర్‌లైన్ ఆపరేటర్‌లు తమ ఇండక్షన్ ప్లాన్‌ను ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్‌లతో పంచుకోవాలని డీజీసీఏ ద్వారా సూచించబడింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖలోని సహాయ మంత్రి జనరల్ (డాక్టర్) వి.కె. సింగ్ (రిటైర్డ్) ఈరోజు రాజ్యసభకు ఒక ప్రశ్నకు లిఖితపూర్వక ఇచ్చిన సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
అనుబంధం
ఇండియా లిమిటెడ్ (ఏఐ) మరియు ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (ఇండిగో) సంస్థలకు సూత్రప్రాయ ఆమోదపు వివరాలు
క్రమసంఖ్యం
|
విమానయాన సంస్థ పేరు
|
విమాన రకం
|
మొత్తం విమానాల సంఖ్య
|
1
|
ఎయిర్ ఇండియా లిమిటెడ్ (ఏఐ)
|
ఏ320 నియో ఫ్యామిలీ
|
210
|
బీ737 ఫ్యామిలీ
|
140
|
ఏ350 ఫ్యామిలీ
|
40
|
బీ777-9
|
10
|
బీ787-9
|
20
|
బీ737-8
|
50
|
2
|
ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (ఇండిగో)
|
ఏ320 నియో ఫ్యామిలీ
|
500
|
***
(Release ID: 1944525)
Visitor Counter : 153