ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఐటీ హార్డ్‌వేర్ పీఎల్‌ఐ పథకం 2.0 కింద దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు ఆగస్టు 30, 2023 వరకు పొడిగింపు
Posted On:
31 JUL 2023 3:44PM by PIB Hyderabad
ఈ నెల 29వ తేదీన జారీ చేసిన ప్రకటన CG-DL-E-30052023-246165 ద్వారా 'ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం 2.0' ప్రకటించారు. దీని కోసం ₹17,000 కోట్లు కేటాయించారు. దేశంలో ఐటీ హార్డ్‌వేర్ తయారీ వ్యవస్థను వేగవంతం, విస్తృతం చేయడం ఈ పథకం లక్ష్యం.
ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం 2.0 మార్గదర్శకాలను 14.07.2023న ప్రకటించడం జరిగింది. https://www.meity.gov.in/esdm/production-linked-incentive-scheme-pli లింక్ ద్వారా కూడా వాటిని చూడవచ్చు.
ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం 2.0 కింద దరఖాస్తులను స్వీకరించే చివరి తేదీ ఈ ఏడాది ఆగష్టు 30 వరకు పొడిగించడం జరిగింది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి పోర్టల్ తెరిచి ఉంది. https://2.pliithw.com/login ద్వారా నమోదు/దరఖాస్తు చేసుకోవచ్చు.
******
(Release ID: 1944493)
Visitor Counter : 109