ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
2019-20 నుంచి 2022-23 వరకు ఎన్‌ఈఎస్‌ఐడీఎస్ కింద రూ.2273.44 కోట్ల విలువైన 108 ప్రాజెక్టులు మంజూరు
Posted On:
31 JUL 2023 4:12PM by PIB Hyderabad
ఈశాన్య ప్రాంత ప్రత్యేక మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకం (ఎన్‌ఈఎస్‌ఐడీఎస్) కింద, నీటి సరఫరా, విద్యుత్, అనుసంధానానికి సంబంధించిన రంగాల నుంచి వివిధ ప్రాజెక్టులు మంజూరయ్యాయి. ముఖ్యంగా, విద్య & ఆరోగ్యం, పర్యాటక రంగాలను ప్రోత్సహించే ప్రాజెక్టులు మంజూరయ్యాయి. 2019-20 నుంచి 2022-23 మధ్య కాలంలో ఎన్‌ఈఎస్‌ఐడీఎస్ కింద రూ.2273.44 కోట్ల విలువైన 108 ప్రాజెక్టులు మంజూరయ్యాయి.
కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి.కిషన్‌రెడ్డి ఈ రోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారం అందించారు.
*****
(Release ID: 1944489)
Visitor Counter : 110