మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఎన్ఇపి 2023 మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఉల్లాస్ః నవ భారత్ సాక్షరతా కార్యక్రమం అన్న మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
Posted On:
30 JUL 2023 6:21PM by PIB Hyderabad
ఎన్ఇపి (నూతన విద్యావిధానం) 2020 మూడవ వార్షికోత్సవం సందర్భంగా న్యూఢిల్లీ ప్రగతి మైదాన్‌లోని భరతమండపంలో అఖిల భారతీయ శిక్షా సమాగమం 2023ను ప్రధానమంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేంద్ర విద్యా శాఖ, నైపుణ్యాల అభివృద్ధి & వ్యవస్థాపకత శాఖల మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ లోగోను, జన జన సాక్షర్ అన్న నినాదాన్ని, ఉల్లాస్ అన్న మొబైల్ అప్లికేషన్‌ను న్యూఢిల్లీ, ప్రగతిమైదాన్‌లోని భరతమండపంలో నవ భారత సాక్షరతా కార్యక్రమంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రాథమిక అక్షరాస్యతకు విస్తృతమైన ప్రాప్యతను సులభతరం చేయడానికి సాంకేతికత సామర్ధ్యాన్ని ఉపయోగించడంలో ఉల్లాస్ మొబైల్ అప్లికేషన్ ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది అని శ్రీ ప్రధాన్ అన్నారు. ఉపయోగించేవారికి అనుకూలంగా,ఇంటరాక్టివ్‌గా ఉండే ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఒఎస్ రెండింటిలోనూ అందుబాటులో ఉండడమే కాక ఎన్‌సిఇఆర్‌టి అధికారిక దీక్షా పోర్టల్ ద్వారా విభిన్న అభ్యాస వనరులలో నిమగ్నం కావడానికి అభ్యాసకులకు ఒక ప్రవేశద్వారంగా ఉపయోగపడుతుంది. ఉల్లాస్ యాప్‌లో అభ్యాసకులు, వాలెంటీర్లు స్వయంగా లేదా సర్వేయర్ల ద్వారా నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. క్రియాత్మక అక్షరాస్యత, వృత్తి నైపుణ్యాలు, ఆర్ధిక అక్షరాస్యత, న్యాయపరమైన అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత, దేశ నిర్మాణంలో పౌరుల సాధికారత వంటి అనేక ముఖ్యమైన జీవన నైపుణ్యాలను ప్రోత్సహించడంపై ఉల్లాస్ దృష్టి పెడుతుందని మంత్రి ఉద్ఘాటించారు. ఇది భారతదేశం అంతటా సమాజాలలో నిరంతర అభ్యాసం, జ్ఞానాన్ని పంచుకునే సంస్కృతిని కూడా ప్రోత్సహిస్తుంది అని ఆయన చెప్పారు.
ఉల్లాస్ (సమాజంలో అందరికీ జీవితకాల అభ్యాసం పై అవగాహన) చొరవ అన్నది దేశంలో విద్య, అక్షరాస్యతను విప్లవాత్మకంగా మార్చడానికి సంసిద్ధంగా ఉందని, ప్రతి వ్యక్తినీ చేరే పర్యావరణ వ్యవస్థను పెంపొందించడం ద్వారా, ప్రాథమిక అక్షరాస్యత, క్లిష్టమైన జీవిత నైపుణ్యాలలో అంతరాలను తగ్గించేందుకు యత్నిస్తుందన్నారు.
పాఠశాలకు వెళ్ళే అవకాశాన్ని కోల్పోయిన 15 ఏళ్ళు, అంతకంటే ఎక్కువ వయసున్న పౌరులకు ప్రాథమిక విద్య, డిజిటల్, ఆర్థిక అక్షరాస్యత, క్లిష్టమైన జీవన నైపుణ్యాలను ఇది అందిస్తుంది. ఇది స్వచ్ఛందసేవల ద్వారా అమలవుతంది.
ప్రచారపు ఉత్సాహాన్ని శక్తిని నూతన లోగో, ఉల్లాస్ః నవ్ భారత్ సాక్షరతా కార్యక్రమం అన్న నినాదం ప్రతిఫలిస్తాయి. ఇది దేశంలోని నలుమూలలా విస్తరిస్తున్న విజ్ఞాన క్రాంతికి ప్రతీక, విద్యాశక్తితో పౌరులను సాధికారం శక్తివంతం చేయడంతో పాటుగా, ప్రతి వ్యక్తిలో ఉత్సుకత, అభ్యాసజ్వాలను వెలిగిస్తూ జన జన సాక్షర్‌ను సాకారం చేస్తుంది.
దేశ నిర్మాణ కర్తవ్యం లేదా కర్తవ్యబోధ తో దిశగా స్వచ్ఛంద సేవకులు ఈ పథకం ప్రేరణను ఇవ్వడమే కాక పాఠశాల/ విశ్వవిద్యాలయంలో క్రెడిట్‌ల ద్వారా విద్యార్ధి వాలంటీర్లను ప్రోత్సహించడంతో పాటుగా సర్టిఫికెట్లు, ప్రశంసా పత్రాలు, సత్కారం తదితర మార్గాల ద్వారా ప్రశంసిస్తుంది.
ఉల్లాస్ ః నవ భారత సాక్షరతా కార్యక్రమం గురించి మరింత తెలుసుకునేందుకు, గూగుల్ ప్లే స్టోర్ లేదా ఐఒఎస్ ఆప్ స్టోర్‌నుంచి మోబైల్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
***
(Release ID: 1944209)
Visitor Counter : 172