వ్యవసాయ మంత్రిత్వ శాఖ

నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్స్- ఆయిల్ పామ్ కింద ఆయిల్ పామ్ సాగు కోసం మెగా ప్లాంటేషన్ డ్రైవ్ 2023 జూలై మరియు ఆగస్టు నెలల్లో భారతదేశం అంతటా నిర్వహించబడుతోంది.


ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ కంపెనీలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు 7750 హెక్టార్ల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు కోసం మెగా ప్లాంటేషన్ డ్రైవ్‌లో పాల్గొంటున్నాయి.

Posted On: 30 JUL 2023 12:41PM by PIB Hyderabad

ఆయిల్ పామ్ ఉత్పత్తి విస్తీర్ణాన్ని 10 లక్షల హెక్టార్లకు పెంచడం మరియు 2025-26 నాటికి క్రూడ్ పామ్ ఆయిల్ ఉత్పత్తిని 11.20 లక్షల టన్నులకు పెంచే లక్ష్యంతో భారత ప్రభుత్వం 2021 ఆగస్టులో నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్స్- ఆయిల్ పామ్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం వంట నూనెల ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధితో పాటు దిగుమతి భారాన్ని తగ్గించడం ద్వారా భారతదేశాన్ని 'ఆత్మ నిర్భర్ భారత్' వైపు విజయవంతంగా నడిపిస్తోంది. ఈ మిషన్ కింద దేశంలో ఆయిల్ పామ్ సాగును మరింత పెంచడానికి ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ కంపెనీలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు 25 జూలై 2023 నుండి మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ డ్రైవ్‌ను ప్రారంభించాయి. మూడు ప్రధాన ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ కంపెనీలైన పతంజలి ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్, గోద్రెజ్ ఆగ్రోవెట్, మరియు 3ఎఫ్‌లు రికార్డు విస్తీర్ణ విస్తరణ కోసం తమ తమ రాష్ట్రాల్లోని రైతులతో చురుకుగా ప్రచారం చేస్తున్నాయి మరియు పాల్గొంటున్నాయి.

మెగా ప్లాంటేషన్ డ్రైవ్ 25 జూలై 2023న ప్రారంభమైంది మరియు ఆగస్టు 12, 2023 వరకు కొనసాగుతుంది. ఆయిల్ పామ్ పండించే ప్రధాన రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక, గోవా, అస్సాం, త్రిపుర, నాగాలాండ్, మిజోరం మరియు అరుణాచల్ ప్రదేశ్‌లు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కానున్నాయి.

ఈ డ్రైవ్ 25 జూలై 2023న రెస్ట్ ఆఫ్ ఇండియా (ఆర్‌ఒఐ) రాష్ట్రాలలో అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఒడిషా, గోవా, కర్ణాటకలో ప్రారంభమైంది మరియు 08-08-2023 వరకు కొనసాగుతుంది మరియు దాదాపు 7000 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంటుంది. 6500 హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ పరిధిలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

 

image.png

 

అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మిజోరం మరియు నాగాలాండ్ వంటి ఈశాన్య ప్రాంత (ఎన్‌ఈఆర్‌) రాష్ట్రాలలో ఈ డ్రైవ్ జూలై 27, 2023న ప్రారంభమైంది మరియు 19 జిల్లాల్లో 750 హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో 12 ఆగస్టు 2023 వరకు కొనసాగుతుంది.

 

image.png


27 జూలై 2023 నుండి ఆగస్టు 05, 2023 వరకు మెగా ప్లాంటేషన్ డ్రైవ్‌లో ఉన్న 8 జిల్లాల్లో 75 హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో మొక్కలు నాటాలని అస్సాం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో జరుగుతున్న ఈ డ్రైవ్‌లో గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్, పతంజలి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, 3ఎఫ్‌ ఆయిల్ పామ్ లిమిటెడ్ మరియు కెఈ కల్టివేషన్ కంపెనీలు ఈ డ్రైవ్‌లో పాల్గొంటున్నాయి.

 

image.png


29 జూలై 2023 నుండి ఆగస్టు 12, 2023 వరకు 6 జిల్లాల్లో జరిగే ఈ డ్రైవ్‌లో దాదాపు 700 హెక్టార్ల విస్తీర్ణంలో మొక్కలు నాటాలని అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం  లక్ష్యంగా పెట్టుకుంది.ఈ డ్రైవ్‌లో 3ఎఫ్‌ప్రైవేట్. లిమిటెడ్ మరియు పతంజలి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లు రాష్ట్రంలో జరిగే ఈ డ్రైవ్‌లో పాల్గొంటున్నాయి.

 

image.png

 

చిత్రం: జూలై 28, కాచర్, అస్సాం

 

****



(Release ID: 1944169) Visitor Counter : 141