ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో సెమీకండక్టర్ రంగంలో నిర్ణయించుకున్న లక్ష్యాలు సాధించడానికి భారతదేశం వేగంగా అడుగులు వేస్తోంది.. : సెలికాన్ ఇండియా 2023 2వ రోజు సదస్సులో కేంద్ర సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్


ప్రపంచ సెమీకండక్టర్ రంగంలో పోటీ పడి భారతదేశాన్ని బలమైన, శక్తివంతమైన శక్తిగా అభివృద్ధి చేయడానికి అమలు చేయాల్సిన కార్యాచరణ ప్రణాళికపై చర్చలు జరిపిన ప్రముఖ సెమీకండక్టర్ సంస్థల ప్రతినిధులు

Posted On: 30 JUL 2023 9:09AM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో సెమీకండక్టర్ రంగంలో నిర్ణయించుకున్న లక్ష్యాలు సాధించడానికి చర్యలు అమలు చేస్తున్నామని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటి,నైపుణ్యాభివృద్ధి,వ్యవస్థాపక శక్తి   శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. మూడు రోజుల సెమీకాన్ ఇండియా 2023 రెండో రోజు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. సెమి కండక్టర్ రంగంలో అభివృద్ధి సాధించడానికి  జరుగుతున్న కృషికి  సెమికాన్ ఇండియా  2023 సదస్సు ఒక ఉదాహరణ అని మంత్రి పేర్కొన్నారు.  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో సెమీకండక్టర్ రంగంలో నిర్ణయించుకున్న లక్ష్యాలు సాధించడానికి అమలు చేస్తున్న కార్యక్రమాలను మంత్రి వివరించారు.  సాధించే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు.

మూడు రోజుల సెమికాన్ ఇండియా 2023 సదస్సు  రెండవ రోజు జరిగిన కార్యక్రమాల్లో పరిశ్రమ, విద్యాసంస్థలు, ప్రభుత్వ ప్రతినిధులు  భారీ సంఖ్యలో పాల్గొన్నారు.  నెక్స్ట్-జెన్ కంప్యూటింగ్‌పై జరిగిన సదస్సులో  వెంటనా మైక్రో సిస్టమ్స్ సీఈఓ  శ్రీ బాలాజీ భక్తా డిజిటల్ స్వయంప్రతిపత్తి, ఆర్ఐఎస్సీఈ-వి  ఆధారిత సావరిన్ డేటా సెంటర్ మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కీలకమైన అంశాలను వివరించారు.  కంప్యూటింగ్ రంగంలో స్టార్టప్‌ల భవిష్యత్తు, సమయ పాలన, ఆర్థిక వనరుల అంశాలను మిహిర ఏఐ సీఈఓ శ్రీ రాజా కొండూరి వివరించారు. 

సెమీకండక్టర్ ప్యాకేజింగ్‌తో సహా వివిధ సంబంధిత అంశాలపై జరిగిన చర్చల్లో నిపుణులు పాల్గొన్నారు.ఎస్వీపీ మైక్రోన్ టెక్నాలజీ  శ్రీ గురు చరణ్ సింగ్,సిమ్‌టెక్ నుంచి వచ్చిన జెఫ్రీ చున్,డిస్కో ప్రతినిధి  నోబోరు యోషినాగా, ఎయిర్ లిక్విడ్ ప్రతినిధి   శ్రీ రాజా వినయ్,  భారతదేశంలో మైక్రోన్ అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్ ప్యాకేజింగ్  ప్లాంట్  సరఫరా వ్యవస్థ,కార్యాచరణ ప్రణాళిక అంశాలపై ప్రసంగించారు.  డాక్టర్ హేమ్ టాకియార్ నేతృత్వంలో ప్రొఫెసర్ తుమ్మల రావు (జార్జియా టెక్) డాక్టర్ సూర్య భట్టాచార్య (ఐఎంఈ , సింగపూర్)శ్రీ దేవన్ అయ్యర్ (ఆమ్కోర్), శ్రీ అమృత్ మన్వానీ ( సహస్ర) సభ్యులుగా ఉన్న ప్యానెల్  భారతదేశంలో సెమీకండక్టర్ ప్యాకేజింగ్ భవిష్యత్తు,  పనితీరు మెరుగు పరచడానికి  ప్యాకేజింగ్ పరిశోధన, ఆవిష్కరణల ప్రాముఖ్యత అంశాలను చర్చించారు.భారతదేశంలో   పెద్దలో స్థాయి పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ఉన్న అవకాశాలు,  సామర్థ్యాన్నిప్రస్తావించిన నిపుణులు పరిశ్రమ సంబంధిత పరిశోధనలు పోషించే  కీలక పాత్రను ప్రస్తావించారు.  

"తదుపరి తరం డిజైన్లు" అనే అంశంపై జరిగిన చర్చల్లో సెమీకండక్టర్ పరిశ్రమలో వస్తున్న అత్యాధునిక పురోగతులు, భవిష్యత్తు అవకాశాలపై చర్చలు జరిగాయి. సెమీకండక్టర్ రంగంలో  భారతదేశంలో స్వయంప్రతిపత్తి ,ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధిపై  ఎన్‌ఎక్స్‌పి  ప్రతినిధి  లార్స్ రెగర్  మాట్లాడారు. ఛార్జింగ్ , డ్రైవింగ్ కోసం ఆధునిక స్మార్ట్‌ఫోన్ లాంటి సౌకర్యాల అభివృద్ధిపై దృష్టి  సారించి  సాఫ్ట్‌వేర్, డిజిటల్ ట్విన్ టెక్నాలజీలు పని చేస్తున్నాయని ఆయన  చెప్పారు. ఎన్‌ఎక్స్‌పి తో కలిసి  భారతీయ యునికార్న్‌లు పనిచేస్తాయని ఆయన తెలిపారు. దీనివల్ల ఆవిష్కరణల రంగం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.  

శ్రీ ఆనంద్ రామమూర్తి ( మైక్రోన్ టెక్నాలజీ),శ్రీ నవిన్ బిష్ణోయ్ (మార్వెల్), శ్రీ హితేష్ గార్గ్(ఎన్‌ఎక్స్‌పిసెమీకండక్టర్స్), శ్రీమతి మాలినీ నారాయణమూర్తి( రెనేసాస్), శ్రీ బాలాజీ సౌరిరాజన్( శామ్సంగ్ సెమీకండక్టర్ ఇండియా ఆర్ అండ్ డి సెంటర్) శ్రీ నీల్ గాలా( ఇన్‌కోర్ సెమీకండక్టర్‌) సభ్యులుగా ఉన్న ప్యానెల్  ఫాబ్ లోడింగ్‌ లో వస్తున్న మార్పులపై చర్చించారు.ఏఐ,డేటా సెంటర్ల కోసం కస్టమ్ కంప్యూటింగ్  ప్రాముఖ్యత,ఆటోమోటివ్ పరిశ్రమలో వృద్ధి సామర్థ్యాన్ని సభ్యులు వివరించారు. 

 

సెమీకండక్టర్ పరిశ్రమలో భారతదేశం  స్థానాన్ని బలోపేతం చేయడానికి చిప్ డిజైన్ స్టార్టప్‌లకు సహకారం, పెట్టుబడి అవకాశాలపై శ్రీ వినోద్ ధామ్ నేతృత్వంలోని  ప్యానెల్  దృష్టి సారించింది. శ్రీ గౌతమ్ సింగ్ ( ఫెర్మియోనిక్ డిజైన్‌),  శ్రీ రాకేష్ మాలిక్ ( వెర్వేసేమి మైక్రోఎలక్ట్రానిక్స్) శ్రీ దీపక్ షాపేటి ( మార్ఫింగ్ మెషీన్స్) శ్రీ జ్యోతిస్ ఇందిరా భాయ్ )నేత్రసేమి), శ్రీ నారాయణ రావు ( అకార్డ్ సాఫ్ట్‌వేర్అండ్  సిస్టమ్స్),శ్రీ వినాయక్ దాల్మియా, (DV2JS ఇన్నోవేషన్)లతో కూడిన ప్యానెల్  చిప్ డిజైన్, ప్యాకేజింగ్, టెస్టింగ్ , సప్లై చెయిన్‌ల ప్రాముఖ్యతపై చర్చలు జరిపింది.  భారతదేశంలో చిప్ డిజైన్, సెమీకండక్టర్-సంబంధిత పరిశ్రమల రంగంలో ఉన్న అవకాశాలపై ప్యానెల్ చర్చించింది, ఈ రంగంలో ఆవిష్కరణ, వృద్ధిని పెంపొందించడానికి ప్రభుత్వ సహకారం అవసరమని ప్యానెల్ అభిప్రాయపడింది. 

భారతీయ సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థలో ఉన్న  పెట్టుబడి అవకాశాలపై సదస్సులో చర్చలు జరిగాయి. శ్రీ గని సుబ్రమణ్యం( సెలెస్టా క్యాపిటల్ ), శ్రీ సుదీప్తో సన్నిగ్రాహి (, మ్యాట్రిక్స్) తమ ప్రసంగంలో  సెమీకండక్టర్ రంగంలో  స్టార్టప్‌లపై ప్రాముఖ్యతను వివరించారు.  గతంతో పోలిస్తే సెమి కండక్టర్ రంగంలో స్టార్టప్‌ లకు అవకాశాలు ఎక్కువ అయ్యాయని వారు వివరించారు. ప్రతిభ కలిగిన స్టార్టప్‌లకు మూలధనం సమస్యగా ఉండదని  శ్రీ సతీష్ ఆండ్రా (ఎండియా), అన్నారు. స్టార్టప్‌ ల అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, సహకారం పట్ల  శ్రీరామ బెత్మంగల్కర్ (క్వాల్ కాం వెంచర్స్ ) హర్షం వ్యక్తం చేశారు. స్టార్టప్‌ల అభివృద్ధికి తమ సంస్థ అందిస్తున్న సహకారాన్ని వివరించారు. 

ఇండియా సెమీకండక్టర్ రీసెర్చ్ సెంటర్ (ISRC) ఏర్పాటు చేయడానికి జరిగిన ప్యానెల్ చర్చలో శ్రీ ముఖేష్ ఖరే (ఐబీఎం సెమీకండక్టర్స్),  ప్రొఫెసర్ తుమ్మల రావు( జార్జియా టెక్),  శ్రీ అజయ్ సూద్ ( భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్;), శ్రీ శ్రీ సామవేదం (ఎస్వీపీ, ఐఎంఈసీ) ,శ్రీ సురీందర్ సింగ్ (ఎస్ఈఎల్ మాజీ డైరెక్టర్)పాల్గొన్నారు. భారతదేశంలో సెమీకండక్టర్ పరిశోధన కోసం అమలు చేయాల్సిన కార్యాచరణ ప్రణాలికను  సభ్యులు చర్చించారు. విద్య, పారిశ్రామిక, ఉత్పత్తి అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రపంచ స్థాయి పరిశోధన కేంద్రాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఇండియా సెమీకండక్టర్ రీసెర్చ్ సెంటర్ కృషి  చేస్తోంది. 

సెమీకండక్టర్ రంగంలో భారతదేశం అభివృద్ధి సాధించడానికి గల అవకాశాలు, సెమీకండక్టర్ పరికరాల ఆవిష్కరణ, సెమీకండక్టర్ సరఫరా-గొలుసు రంగాలలో భారతదేశానికి పెరుగుతున్న ప్రాధాన్యతపై సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ రంగానికి చెందిన నిపుణులు  డాక్టర్ రామన్ అచ్యుతరామన్ (అప్లైడ్ మెటీరియల్స్ ),  శ్రీ శేష వరదరాజన్ ( లాం రీసెర్చ్),  శ్రీ అహ్మద్ ఖాన్ (కెఎల్ఏ ),శ్రీ ప్రభు రాజా(అప్లైడ్ మెటీరియల్స్)  వారి అభిప్రాయాలు వివరించారు.  సెమీకండక్టర్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సహకారం అవసరమని నిపుణులు స్పష్టం చేశారు. 

 “స్థిరమైన సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి ” అనే అంశంపై  గ్లోబల్ ఫౌండ్రీస్ ఉపాధ్యక్షుడు  శ్రీ జితేంద్ర చద్దా నేతృత్వంలో జరిగిన ప్యానెల్  చర్చలో  డేవిడ్ రీడ్(సీఈఓ, వేదాంత సెమీకండక్టర్స్ లిమిటెడ్),డేవిడ్ క్రిక్ ( గ్లోబల్ సొల్యూషన్స్ డైరెక్టర్), శ్రీ దిగంత శర్మ (ఇనాక్స్  గ్రూప్) పాల్గొన్నారు.  సెమీకండక్టర్ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం  సహకారం అవసరమని నిపుణులు పేర్కొన్నారు.   రంగం వ్యూహాత్మక ప్రాముఖ్యతను ప్రభుత్వం గుర్తించడం పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు.  సెమీకండక్టర్ పరిశ్రమలో మూలధనం కీలకంగా ఉంటుందన్నారు.భారతదేశం సెమి కండక్టర్ రంగం అభివృద్ధికి కల్పించాల్సిన  మౌలిక సదుపాయాలు, సాంకేతిక, మానవ వనరుల  ఆవశ్యకతను నిపుణులు వివరించారు. 

" సెమీకండక్టర్ పరిశ్రమ సుస్థిర అభివృద్ధిలో  కోసం సెమీకండక్టర్ సప్లై-చెయిన్ పాత్ర " అనే అంశంపై జరిగిన చర్చలో  శ్రీ శ్రీనివాస్ సత్య (అప్లైడ్ మెటీరియల్స్ ఎండీ ) శ్రీ పాల్ ఛబ్రా( గ్లోబల్ సప్లై చైన్, అప్లైడ్ మెటీరియల్స్ ఉపాధ్యక్షుడు) మాట్లాడారు.  బలమైన సెమీకండక్టర్ సప్లై చైన్ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో ఎదురయ్యే సమస్యలు, సవాళ్ల గురించి మాట్లాడారు. 

"సెమీ ఎక్విప్‌మెంట్ సప్లై చైన్‌లో గ్లోబల్ ట్రెండ్స్ అండ్ ఇన్నోవేషన్స్" అనే అంశంపై జరిగిన ప్యానెల్ చర్చలో  మైఖేల్ హోల్డర్(ఈఈఎఫ్) , జాక్సన్ హ్వాంగ్ ( ఫాక్స్ సెమికాన్  ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీస్),  డాక్టర్ కెవిన్ రెస్లర్, కోర్స్టెక్,  ఫిల్ బారోస్ సెమీకండక్టర్ పరికరాల పరిశ్రమకు విజయవంతమైన సరఫరాదారుగా భారతదేశం  ఎలా అభివృద్ధి చెందాలి అనే అంశంపై  చర్చించారు.

"భారతదేశంలో స్థిరమైన దేశీయ సెమీకండక్టర్ సరఫరా-గొలుసును నిర్మించడం"  "గ్లోబల్ సెమీకండక్టర్ సప్లై-చెయిన్‌లను ఆకర్షించడం" అనే అంశంపై జరిగిన ప్యానెల్ చర్చలో నిపుణులు పాల్గొన్నారు. ఈ రెండు రంగాల్లో అభివృద్ధి సాధించడానికి అమలు చేయాల్సిన చర్యలను ప్రస్తావించారు. 

 

*****


(Release ID: 1944151) Visitor Counter : 161