రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

ప్రపంచ ఫార్మసీగా గుర్తింపు పొందిన భారతదేశాన్ని ప్రపంచ ఫార్మా ఉత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చేయాలి.. కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ సంపూర్ణ అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది.. డాక్టర్ మాండవీయ


సుస్థిర అభివృద్ధి అంశంపై దృష్టి సారించిన 3వ ఎడిషన్ సమ్మిట్ "గ్లోబల్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్స్ ఇన్ ఇండియా" సదస్సు

Posted On: 28 JUL 2023 5:42PM by PIB Hyderabad

 ప్రపంచ ఫార్మసీగా గుర్తింపు పొందిన భారతదేశాన్ని ప్రపంచ ఫార్మా ఉత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కృషి జరగాలని కేంద్ర మంత్రి డాక్టర్  మన్సుఖ్ మాండవీయ అన్నారు.  "గ్లోబల్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్స్ ఇన్ ఇండియా" సదస్సు ముగింపు కార్యక్రమంలో డాక్టర్ మాండవీయ పాల్గొన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) సహకారంతో " గ్లోబల్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్స్ ఇన్ ఇండియా " (GCPMH 2023)పై 3వ సదస్సు జరిగింది.రసాయనాలు, పెట్రో కెమికల్స్  రంగానికి  చెందిన ప్రముఖ సంస్థలు, నిపుణులు సదస్సులో పాల్గొన్నారు. వృత్తాకార సుస్థిర అభివృద్ధి ఇతివృత్తంతో సదస్సు జరిగింది. 

ముగింపు సమావేశంలో ప్రసంగించిన డాక్టర్ మాండవీయ స్వావలంబన సాధించడానికి ప్రతి దేశ ఆర్థిక వ్యవస్థకు పటిష్టమైన  పరిశ్రమ రంగం సహకారం అవసరం ఉంటుందన్నారు. విడివిడిగా కాకుండా మొత్తం పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు అమలు చేస్తుందని డాక్టర్ మాండవీయ అన్నారు. తక్కువ ప్రభుత్వ ప్రమేయంతో గరిష్ట పాలన అందించడానికి దోహదపడే సమగ్ర, సంపూర్ణ వ్యవస్థను  అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని డాక్టర్ మాండవీయ వివరించారు. రసాయనాలు, పెట్రో కెమికల్స్ రంగంలో  సానుకూల మార్పు,పురోగతి కోసం వినూత్నమైన, స్థిరమైన పరిష్కారాలను అందించాలని మంత్రి కోరారు. 

రెండు రోజుల పాటు జరిగిన సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమల ప్రతినిధులు వివిధ అంశాలపై చర్చలు జరిపారని  కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ, రసాయనాలు పెట్రోకెమికల్స్ శాఖ కార్యదర్శి శ్రీ అరుణ్ బరోకా తెలిపారు.   రసాయనాలు, పెట్రోకెమికల్స్ పరిశ్రమ రంగానికి అవసరమైన నిధులు, పర్యావరణ అనుమతులు లాంటి వివిధ అంశాలపై చర్చలు జరిగాయన్నారు.

రసాయనాలు, పెట్రో కెమికల్ రంగం అభివృద్ధికి కృషి చేస్తిన వివిధ పరిశ్రమల ప్రతినిధులు సదస్సులో పాల్గొన్నారు. 

 

 

******



(Release ID: 1943862) Visitor Counter : 127


Read this release in: English , Urdu , Marathi , Hindi