భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ

శాస్త్రవేత్తల సంయుక్త యాత్రకు విజయవంతమైన ముగింపు - కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్

Posted On: 28 JUL 2023 10:56AM by PIB Hyderabad

భారతదేశం, బంగ్లాదేశ్ మరియు మారిషస్ నుండి సముద్ర శాస్త్రవేత్తల సంయుక్త యాత్రను ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఐఎన్‌సిఓఐఎస్), కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ (సిఎస్‌సి)కు చెందిన ప్రాంతీయ ఫ్రేమ్‌వర్క్‌లో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ నిర్వహించింది. 24 జులై 2023న ఇది ముగిసింది. హిందూ మహాసముద్రానికి చెందిన ప్రాంతీయ వాతావరణంలో మార్పులను అంచనా వేయడానికి మరియు నిర్వహించడానికి సముద్ర డేటా సేకరణ మాత్రమే కాకుండా సముద్ర పరిశీలన మరియు సేవలలో సామర్థ్యాన్ని పెంపొందించడం ఈ యాత్ర లక్ష్యం.

ఓఆర్‌వి సాగర్ నిధి ఆన్‌బోర్డ్ సాహసయాత్ర ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది సిఎస్‌సి ఫ్రేమ్‌వర్క్‌లో మొదటిది; దీనిలో పాల్గొనేవారు సముద్ర పారామితుల కొలత మరియు మోడలింగ్ వంటి సహకార కార్యకలాపాలను చేపట్టారు. ఇది ఈ ప్రాంతంలోని అందరి ఉమ్మడి ప్రయోజనం కోసం మెరుగైన సూచన మరియు సేవలకు దారి తీస్తుంది.

బంగ్లాదేశ్ ఓషనోగ్రాఫిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (బిఓఆర్‌ఐ) నుండి యాత్రలో పాల్గొన్న శాస్త్రవేత్త ఎండీ సిముల్ భుయాన్ తన అనుభవాలను పంచుకుంటూ"  ఓషన్ రీసెర్చ్ వెసెల్ సాగర్ నిధిలో పరిశోధనా యాత్ర నాకు మొదటి అనుభవం. నేను ఫిషింగ్ బోట్‌లు మరియు కంట్రీ బోట్‌లలో పనిచేసినందున, ఇంత అధునాతన పరిశోధనా నౌకలో పనిచేసిన అనుభవం నాకు ఎప్పుడూ లేదు. వాతావరణం చాలా కఠినంగా ఉన్నప్పటికీ, నాకు కొన్ని అద్భుతమైన అనుభవాలు మరియు అభ్యాసాలు ఉన్నాయి. శాస్త్రవేత్తలు మరియు సిబ్బంది అందరూ చాలా సపోర్ట్ చేశారు. డాక్టర్ గిరీష్‌కుమార్‌తో కలిసి పని చేయడం చాలా సౌకర్యంగా అనిపించింది. ఈ పరిశోధన క్రూయిజ్ నాకు జీవితకాల జ్ఞాపకం మరియు అనుభవం అవుతుంది" అని తెలిపారు.

మారిషస్ ఓషనోగ్రఫీ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన శాస్త్రవేత్త మురుఘేన్ సాడియన్ తన అనుభవాలను పంచుకుంటూ ఇలా అన్నారు: భౌతిక సముద్ర శాస్త్రవేత్తగా, ప్రధానంగా తీరప్రాంతాలలో నైపుణ్యం కలిగిన వ్యక్తిగా ఇన్‌కాయిస్‌ బృందంతో ఓఆర్‌వి సాగర్ నిధి యొక్క ఈ సాహసయాత్ర నా ప్రస్తుత పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి నాకు సహాయపడింది. లోతైన సముద్ర ప్రక్రియల యొక్క ఉత్సుకత మరియు వర్టికల్ మైక్రోస్ట్రక్చర్ ప్రొఫైలర్ (విఎంపి) మరియు లోయర్డ్ ఎకౌస్టిక్ డాప్లర్ కరెంట్ ప్రొఫైలర్ (ఎన్‌ఏడిసిపి) ఉపయోగించి బహిరంగ మరియు తీర సముద్రంలో వివిధ చిన్న స్థాయి మిక్సింగ్ ప్రక్రియల ప్రాముఖ్యత ఉంది. సంగ్రహంగా చెప్పాలంటే ఈ సాహసయాత్ర ఫలవంతమైంది, ఎందుకంటే ఇది డేటా సేకరణలో కొత్త సాంకేతికతలను పొందడంలో అలాగే సాహసయాత్ర రూపకల్పనలో నాకు సహాయపడింది. జోఫియా, అభిజీత్ మరియు ముఖ్యంగా డాక్టర్ గిరీష్‌కుమార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు, ఈ సర్వే యొక్క సిద్ధాంతం మరియు ప్రాముఖ్యత గురించి విలువైన వివరణలు ఇచ్చారు." అని చెప్పారు.

తొలి సిఎస్‌సి ఓషనోగ్రాఫర్స్ జాయింట్ ఎక్స్‌పెడిషన్‌ను పూర్తి చేసిన తర్వాత ఇన్‌కొయిస్‌ డైరెక్టర్ డాక్టర్ టి.శ్రీనివాస కుమార్ మాట్లాడుతూ " అరేబియా సముద్రంలోని సముద్ర మరియు వాతావరణ స్థితి భారతదేశం మరియు సమీపంలోని భూభాగంపై రుతుపవనాల  ప్రాదేశిక మరియు తాత్కాలిక వైవిధ్యాన్ని గుర్తించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయినప్పటికీ వేసవి రుతుపవనాల గరిష్ట సమయంలో అరేబియా సముద్రంలో సముద్ర మరియు వాతావరణ స్థితిని నిర్ణయించే చిన్న-స్థాయి అల్లకల్లోల మిక్సింగ్ ప్రక్రియల పాత్ర స్పష్టంగా అర్థం కాలేదు. ఒక నెలపాటు సాగే ఈకెఏఎంఎస్‌ఏటి (సైన్స్ మరియు అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ ద్వారా అరేబియా సముద్రపు సముద్ర పర్యావరణంపై నాలెడ్జ్‌ని పెంపొందించడం)లో భాగంగా ఇన్‌కొయిస్‌ నేతృత్వంలోని సాగర్ నిధిలో విహారయాత్ర, భారతదేశంలోని ఇన్‌కొయిస్‌  నుండి శాస్త్రవేత్తలు; ఎంఓఐ, మారిషస్ మరియు బిఓఆర్‌ఐ, బంగ్లాదేశ్ కలిసి వర్టికల్ మైక్రోస్ట్రక్చర్, ఎడ్డీ కోవియారిన్స్ ఫ్లక్స్ కొలతలు, ఎల్‌-ఏడిసిపి, అండర్‌వే సిడిటి(అండర్‌వే కండక్టివిటీ-టెంపరేచర్-డెప్త్ ఇన్‌స్ట్రుమెంట్) మరియు రేడియోసన్‌డ్ సమయంలో ఫైన్-స్కేల్ స్కేల్ రిజల్యూషన్‌లో విలువైన సముద్ర శాస్త్ర మరియు వాతావరణ డేటాను సేకరించడానికి కలిసి పనిచేశాయి. ఈ డేటా అరేబియా సముద్రంలో వేసవి రుతుపవనాల సమయంలో చిన్న-స్థాయి మిక్సింగ్ మరియు వాతావరణ సరిహద్దు పొర డైనమిక్స్ పట్ల ఖచ్చితంగా కొత్త అంశాలను అందిస్తుంది" అని అభిప్రాయపడ్డారు.

 

image.pngimage.png

 

image.pngimage.png


నవంబర్ 2022లో గోవా మరియు హైదరాబాద్‌లో జరిగిన సిఎస్‌సి ఓషనోగ్రాఫర్‌లు మరియు హైడ్రోగ్రాఫర్‌ల తొలి సహకార వెంచర్ ఫలితమే 29 జూన్ 2023న ప్రారంభమైన ఓఆర్‌వి సాగర్ నిధి యాత్ర.
 

<><><><><>



(Release ID: 1943747) Visitor Counter : 148


Read this release in: English , Urdu , Hindi , Tamil