ప్రధాన మంత్రి కార్యాలయం
సహ ప్రాణులతో మన సామరస్యానికీ అమృత సరోవరాల భరోసా: ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
27 JUL 2023 6:19PM by PIB Hyderabad
అమృత సరోవరాల ప్రాముఖ్యం గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక ప్రకటననలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. జల సంరక్షణ, అందులో సమాజ భాగస్వామ్యంతోపాటు మనతో కలసి జీవించే ప్రాణులతో మన సామరస్యానికీ భరోసా ఇస్తున్నాయని ఆయన అభివర్ణించారు.
ఈ మేరకు అస్సాంలోని కామ్‌రూప్ జిల్లాలోని సింగ్రా వద్ద నిర్మించిన నిర్మల సరోవరంలో మునకలేస్తూ ఏనుగులు వేసవి తాపం నుంచి సేద దీరడంపై అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ చేసిన ట్వీట్‌కు ప్రతిస్పందనగా ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“ఇది ఎంతో కనువిందు చేసే దృశ్యం... జల సంరక్షణ, సమాజ భాగస్వామ్యంతోపాటు మనతో భూగోళాన్ని పంచుకునే ప్రాణులతో మన సామరస్యానికీ అమృత సరోవరాలు భరోసా ఇస్తున్నాయి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1943590)
आगंतुक पटल : 121
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Tamil
,
Kannada
,
Malayalam