రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
'భారతదేశంలో గ్లోబల్ కెమికల్స్, పెట్రోకెమికల్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌లపై 3వ సమ్మిట్'ను ప్రారంభించిన కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్
Posted On:
27 JUL 2023 7:35PM by PIB Hyderabad
“గ్లోబల్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్స్ ఇన్ ఇండియా” (GCPMH 2023)పై సమ్మిట్ 3వ ఎడిషన్‌ను కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. కార్యక్రమంలో రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ భగవంత్ ఖుబా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒడిశా ప్రభుత్వ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి శ్రీ ప్రతాప్ కేశరి, రసాయనాలు, పెట్రోలియం మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అరుణ్ బరోకా, -ఫిక్కీ పెట్రోకెమికల్స్ కమిటీ చైర్మన్ శ్రీ ప్రభ్ దాస్ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, వివిధ పరిశ్రమల ప్రతినిధులు , విద్యావేత్తలు, విధాన రూపకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) సహకారంతో రసాయనాలు, ఎరువుల శాఖ " గ్లోబల్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్స్ ఇన్ ఇండియా " (GCPMH 2023)పై 3వ సదస్సును నిర్వహిస్తోంది..
ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీమతి నిర్మలా సీతారామన్ భారత రసాయనాలు, పెట్రోకెమికల్స్ రంగానికి భారీ సామర్థ్యం ఉందని, ఇది ఆర్థిక వ్యవస్థలోని ఇతర రంగాలపై కూడా ప్రభావం చూపుతుందని అన్నారు. వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, జౌళి , ఫార్మా, ప్యాకేజింగ్ మొదలైన రంగాల కార్యకలాపాలు 80,000 కంటే ఎక్కువ రసాయన ఉత్పత్తుల ఆధారంగా సాగుతున్నాయని మంత్రి తెలిపారు.దీనివల్ల ఈ రంగం ప్రాముఖ్యత అంచనా వేయవచ్చు అని శ్రీ శ్రీమతి సీతారామన్ పేర్కొన్నారు.
2047 నాటికి ఇంధన రంగంలో స్వావలంబన సాధించడానికి భారతదేశం సిద్ధంగా ఉందని తెలిపిన మంత్రి 2070 నాటికి నికర సున్నా ఉద్గార స్థాయిని సాధిస్తుందని అన్నారు. హరిత అభివృద్ధి, కర్బన తీవ్రత తగ్గింపుపై అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. 2022-23లో ప్రధాన రసాయనాలు , పెట్రోకెమికల్‌ల సంయుక్త ఎగుమతులు $9 బిలియన్ల మేరకు ఉండగా దిగుమతులు $13.33 బిలియన్లకు పెరిగాయి. ఈ దిగుమతుల్లో చాలా వరకుదేశంలోనే ఉత్పత్తి చేయగల వస్తువులు ఉన్నాయి. ఉత్పత్తి ఎక్కువ చేసి దిగుమతులు తగ్గించడానికి ప్రభుత్వం మరియు అన్ని ప్రయత్నాలు చేస్తోంది.
స్పెషాలిటీ కెమికల్ మార్కెట్ CAGR వద్ద 12% వృద్ధి నమోదు చేస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు.దీనివల్ల ప్రత్యేకమైన రసాయనాలకు మరింత సహకారం అవసరం ఉంటుందని మంత్రి అన్నారు. బలమైన ప్రాసెస్ ఇంజనీరింగ్ సామర్థ్యాలు, తక్కువ-ధర తయారీ సామర్థ్యాలు, మరియు సమృద్ధిగా లభించే మానవ వనరులు ఆధారంగా స్పెషాలిటీ కెమికల్ మార్కెట్ పనిచేస్తుందని శ్రీమతి సీతారామన్ వివరించారు.
శ్రీ భగవంత్ ఖూబా మాట్లాడుతూ దేశంలో కెమికల్ పార్కుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం చేస్తుందని తెలిపారు. ప్లాస్టిక్ పార్కుల ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే అమలులో ఉందన్నారు. నైపుణ్యాభివృధిని ప్రోత్సహించడంతో పాటు పరిశ్రమ,విద్యాసంస్థలను ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రభుత్వం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను కూడా ఏర్పాటు చేసిందన్నారు.రసాయనాలు, పెట్రోకెమికల్ రంగం మార్కెట్ పరిమాణం దాదాపు $ 190 బిలియన్లు వరకు ఉందని తెలిపిన పెట్టుబడులకు భారీ అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ రంగంలో పెట్టుబడులు 2025 నాటికి $ 300 బిలియన్లకు, 2040 నాటికి $ 1 ట్రిలియన్‌కు చేరుకునే అవకాశం ఉంది.
శ్రీ ప్రతాప్ కేశరీ దేబ్ మాట్లాడుతూ రసాయన రంగంలో ఒడిశా రాష్ట్రం దేశీయంగా 8 శాతం వృద్ధిని సాధిస్తోందని అన్నారు. రాబోయే 10 సంవత్సరాలలో ఇదే స్థాయిలో వృద్ధి సాధించడానికి ఒడిశా సామర్థ్యం 40 శాతం పెరగాల్సి ఉంటుందన్నారు. పారిశ్రామిక విధానం, 2022 కింద ఒడిశా ప్రభుత్వం తయారీ యూనిట్లకు పన్ను మినహాయింపులు, ఎలక్ట్రికల్ డ్యూటీ మినహాయింపు మొదలైన నిబంధనలు అమలు చేస్తూ పారిశ్రామిక ప్రగతి సాధిస్తోంది.
పెరుగుతున్న డిమాండ్‌తో పాటు విధాన సంస్కరణల సహకారంతో రసాయనాలు, పెట్రోకెమికల్స్ రంగంలో భారతదేశం అత్యధిక వృద్ధి సాధించడానికి సిద్ధంగా ఉందని రసాయనాలు, పెట్రోలియం మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అరుణ్ బరోకా అన్నారు. ప్రస్తుత రేటు వృద్ధి కొనసాగితే రసాయనాల రంగం 2047 నాటికి USD 1 ట్రిలియన్‌కు పెరుగుతుంది. ఈ రంగం వృద్ధికి నాలుగు పీసీపిఐఆర్ లు సహాయపడుతున్నాయి. దీనితో పాటు ప్రతిపాదిత కెమికల్ పార్కులు పరిశ్రమ వేగవంతమైన రేటుతో అభివృద్ధి చెందడానికి దోహదపడతాయి.
***
(Release ID: 1943582)
Visitor Counter : 130